ఇదేంటో ఇంకా తెలియదా?
ఇది ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఒక సినిమా పాట.
ఈ సినిమా పేరు దేవ్.డి (Dev D).
అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకి దర్శకుడు. అభయ్ డియోల్ ఈ సినిమాలో దేవ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
ఈ సినిమా మనకందరికీ బాగా తెలిసిన దేవదాదు కథలోని పాత్రలను సమకాలీన ప్రపంచంలోకి తెచ్చి కొత్త రంగుల్లో మనముందు ప్రవేశపెడ్తున్నాడు దర్శకుడు.
ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఒక పెద్ద సెన్సేషన్.
త్వరలో విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్:
నవతరంగం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి జొనాథన్ గురించి తెలిసేవుంటుంది. ఆయన నిర్మించిన రెండు లఘు చిత్రాలు చూడమని ఇక్కడ(నవతరంగంలో) చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్న జొనాథన్ రూపొందించిన ఈ రెండు సినిమాలూ అద్భుతం అని చెప్పలేము కానీ ఈ మధ్యలో వస్తున్న చాలా లఘు చిత్రాలకంటే ఎన్నో రెట్లు బావుండడమే కాకుండా మరి కాస్త శ్రద్ధ తో తీస్తే మంచి దర్శకుడిగా పేరు సాధిస్తాడని నమ్మకం ఉంది. [...]
1920 లలో జర్మనీ లో మొదలయిన కళాత్మక ఉద్యమమయిన భావవ్యక్తీకరణ వాదం (Expressionism) అప్పటి కళలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాదం అప్పటి జర్మన్ సినిమాలలోనూ కనిపిస్తుంది. ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ శీర్షికన ఈ వారం జర్మన్ expressionism గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురిస్తున్న సందర్భంగా Expressionism సినిమాలలో ముఖ్యమైన సినిమాగా భావించే ’The Cabinet of Dr. Caligari’ సినిమాను వీక్షించే అవకాశం నవతరంగం పాఠకులకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఆనందించండి.
గమనిక:
ఈ సినిమా [...]