Menu

telugu Archive

1962 ఓ ‘ఆరాధన’

1962 లో “జగపతి పిక్చర్స్” బ్యానరు పై, వీ.మధుసూధన రావుగారి దర్శకత్వంలో, రంగరావు-వీ.బీ.రాజేంద్రప్రసాద్ గార్ల నిర్మాణంలో తీసిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినీ ప్రపంచానికి కొత్త ఒరవడిని సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రీ ముఖ్య పాత్రలతో ప్రజలని అలరింపజేసిన చిత్రం “ఆరాధన”. బెంగాళీ చిత్రమైన “సాగరిక” ఈ చిత్రానికి మాతృక. ప్రేమ, త్యాగం, సంగీతం వెరసి “ఆరాధన”. సహాయ పాత్రలలో రేలంగి, గిరిజ, జగ్గయ్య, గుమ్మడి, రమణా రెడ్డి, రాజశ్రీ లు చాలా బాగా నటించారు

మీ శ్రేయోభిలాషి

నిన్న రాత్రి ఏమీ తోచక, “మీ శ్రేయోభిలాషి” సినిమా చూడటం ప్రారంభించాను. ఈ సినిమా గురించి చాలా విన్నాను. సరిగ్గా ఆడలేదనే సి సి రెడ్డి గారి ఆవేదన అప్పట్లో చదివి అయ్యో పాపం అనుకున్నాను కూడా. కానీ సినిమా వెళ్ళి చూసేంత తీరిక దొరకలేదు. ఇన్నాళ్ళకి ఆ ఆవేదన ఎంత వరకు సమంజసం అని స్వయంగా తెలుసుకొనే అవకాశం వచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే – చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా

నవతరంగం

తెలుగు సినిమా పరిశ్రమ మొదలయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది. సినిమా అనే ప్రక్రియ ఉన్న ప్రతిదేశం లోనూ సినిమాతోపాటు, సినిమాకి సంబంధించిన వ్యాసంగ రచన కూడా బాగానే జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో సినిమా గురించి ఎన్ని మంచి పుస్తకాలు ప్రచురించబడ్డాయో తెలియదు కానీ తెలుగు చిత్రసీమ లో సినిమా గురించి వ్రాసిన విశ్లేషణా వ్యాసంగం యొక్క కొరత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల (పత్రికల్లో, బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో) సినిమాల