|
మంచి సినిమా
సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. Pirates of the Caribbean సినిమా తీసుకోండి లేదా స్పైడర్మ్యాన్ (Spiderman 3) సినిమా తీసుకోండి. అందులో [...] |
|
తెలుగు సినిమా నిర్మాతలకో లేఖ
అయ్యా నిన్న తెలుగు సినిమా నిర్మాతలంతా కలిసి తెలుగు సినిమాని వుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలిసి మేమెంతో సంతోషించాము. నిజానికి తెలుగు సినిమాను రక్షించుకోవడమంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కదా.. అలాగే తెలుగు ప్రేక్షకుల్ని కూడా రక్షించినట్లే కదా.. అందుకే మాకు ఆనందం. మీరు చేసుకున్న తీర్మానాలు (ప్రతిపాదనలు) విన్నాక మా ఆనందానికి అవధుల్లేకుండా పోయినయ్. ఇక నించి తెలుగేతర భాషల్లో నిర్మాణమైన చిత్రాలు తెలుగు డబ్బింగ్ అయ్యి విడుదలయ్యే సందర్భంలో వాటిని [...] |
|
దేవుడా! ఓ మంచి దేవుడా!
కాపీ కొట్టిన సన్నివేశమే అయినా ‘ నువ్వు నాకు నచ్చావ్’ లో వెంకటేష్ లా నాకూ ఒక ప్రార్థన ఉంది. దేవుడా ! ఓ మంచి దేవుడా ! మాకు నువ్వు సిగ్గులేని హీరోయిన్లను ఇచ్చావ్ , నరంలేని హీరోలను ఇచ్చావ్ , ఇంగ్లీషు బూతులను వదిలి తెలుగు చెడ్డమాటలను కట్ చేసే సెన్సార్ ఇచ్చావ్ , పది రూపాయలకు దొంగ సీడీలు చూసి మేము కరెక్టే అని వాదించే ప్రేక్షకులను ఇచ్చావ్ , సినీ గ్లామర్ [...] |
|
వికృతి-లఘుచిత్రం
ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో దర్శకత్వ విభాగంలో పట్టభద్రుడైన మిత్రుడు, నవతరంగం సభ్యుడు విప్లవ్ దర్శకత్వం వహించిన లఘుచిత్రం-వికృతి. విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ గా ఈ సినిమా ని రూపొందించడం జరిగింది. ఈ లఘుచిత్రం చూసి మీ అభిప్రాయాలు విప్లవ్ కి తెలియచేస్తారని ఆశిస్తూ….. వికృతి-ఒక లఘుచిత్రం మీ కోసం |
|
కథాకళి
గుండెల మీద చెయ్యివేసుకుని చెప్పండి.. తెలుగు సినిమా కధ ఎప్పుడైనా మార్చటం జరిగిందా. నాకు తెల్సి చాలా కొద్దిసార్లు మాత్రమే జరిగింది..ఈమధ్య కాలంలో కణ్ణన్ తీసిన “నా ఊపిరి”, శేఖర్ తీసిన “హ్యపీ డేస్”. సి సి రెడ్డి తీసిన “మీ శ్రేయోభిలాషి” మదన్ తీసిన ” ఆ నలుగురు” క్రిష్ తీసిన “గమ్యం”ఆ మధ్య విశ్వనాధ్ సి నిమాలు. సంవత్సరానికి వచ్చే ఒకటో రెండో ఇతర సినిమాలు ..ఇదేంటి నేను అన్ని విజయవంతమైన సినిమాల గురించే [...] |
|
తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం నాటి కొన్ని పోస్టర్స్-మొదటి భాగం
తెలుగు చలనచిత్రం లో చిరకాలమూ గుర్తుండిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాల వాల్ పోస్టర్స్ ఇక్కడ పొందుపరిస్తున్నాం. తొలి తెలుగు టాకీ సినిమా ’భక్త ప్రహ్లాద’, బి.యన్.రెడ్డి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం ’బంగారు పాప’ లతో పాటు మరికొన్ని పోస్టర్స్ ఇక్కడ చూడవచ్చు.రాబోయే రోజుల్లో మరిన్ని పోస్టర్స్ అందించే ప్రయత్నం చేస్తాము. |
|
మరీ అంత ‘కొత్త బంగారులోకం’ కాదు.
ఈ మధ్య కాలం లో అంతగా సినిమాలు చూడలేదు కదాని ఇవాళ రెండు సినిమాలు చూశాను. ఒకటి సగం, రెండోది పూర్తిగానూ. సగం చూసింది ‘కష్టా చెమ్మా’. రెండోది ‘కొత్త బంగారు లోకం’. మొదటి దాని గురించి మాట్లాడి నా మూడ్ చెడగొట్టుకోలేను కానీ రెండోదే కొంచం విషయం ఉన్న సినిమా. (నిజంగానే కొంచెం విషయం. పూర్తి విషయం కాదు). సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల [...] |
|
నాకు తెలిసిన తెలుగు సినిమా
పరిచయం ఆంధ్రాలో. నా హైస్కూలు, కాలేజి చదువుల రోజుల్లో, తెలుగు వాళ్ళకు ఇష్టమైన విషయాలు రెండే అనిపించేది. మొదటిది పేకాట, రెండవది సినిమా. ఇప్పటికీ ఈ విషయంలో మార్పు ఉండక పోవచ్చు. ఇక్కడ ముచ్చటించుకొనే విషయం సినిమా కాబట్టి, ఈ సినిమా కథేమిటో చూద్దాం! నేను పుట్టి పెరిగింది, పశ్చిమ గోదవరి జిల్లాలో “సరిపల్లె” అనే ఒక పల్లెటూరులో. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న “గణపవరం” అన్న కొంచెం పెద్ద పల్లెటూళ్ళో ఒకే ఒక సినిమా [...] |
|
3:10 టు యుమా – మరో సమీక్ష
ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా [...] |
|
తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీడేస్ నిజంగానే వస్తున్నాయా?
ఉపోద్ఘాతోపోద్ఘాతము దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ [...] |
|
తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!
ఉపోద్ఘాతోపోద్ఘాతము ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |