Tag: "Tamil cinema"

సుబ్రమణ్యపురం (2008)

సుబ్రమణ్యపురం (2008)

ఎదురుచూసి, ఎదురుచూసి నేను కూడా “సుబ్రమణ్యపురం” చూసేసాను. దీనిపై వెంకట్ గారు రాస్తానన్న వివరమైన వ్యాసం ఇంకా రానేలేదు కనుక, పెద్ద వివరాలేమీ చెప్పకుండా నా స్పందన మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నా. సుబ్రమణ్యపురం ఏమిటీ? అంటారా? రెణ్ణెల్ల క్రితం వచ్చిన ఓ తమిళ సినిమా. దీని గురించి నవతరంగంలో ఇదివరలో వచ్చిన వ్యాసం ఇక్కడ.
కథ విషయానికొస్తే, 1980 లో మధురై ప్రాంతాల్లోని సుబ్రమణ్యపురం లో నడుస్తుంది కథ. ఐదుగురు అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగపు స్నేహితులు, వీళ్ళలో [...]

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul అన్నది 2008 లోనే వచ్చిన ఓ తమిళ సినిమా. దీనికి అర్థం – 305 గదిలో దేవుడు అని. దేవుడుగా ప్రకాశ్ రాజ్ నటించాడు. ఈ సినిమా గురించి ఎందుకు రాద్దాం అనుకుంటున్నా అంటే… ఇది ఒక మంచి ప్రయత్నమని నాకు తోచింది. ఏదో గొప్ప ప్రభావవంతమైన కథ అని కాదు. హాస్యం పాలు ఎక్కడా తగ్గకుండానే చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా ఎలా చెప్పొచ్చో తెలుసుకోడానికి ఈ సినిమా [...]

Kannum Kannum (2008)

Kannum Kannum (2008)

నేను ఇటీవల చూసిన సినిమాల్లోకెల్లా “ఎందుకు చూస్తున్నానో!” అనిపించిన సినిమా ఇది. ఇలా మొదలుపెట్టడం ఎందుకు? అసలు దాని గురించి రాయకుండా ఉంటే పోతుంది కదా? అని అనుకోవచ్చు. కానీ, “its a pretty neat film to watch as a family” అని వికీపీడియా లో రాసుంటే చదివి ఈ సినిమా చూసాను. ఓహో… కుటుంబ సమేతంగా చూడాలంటే ఇంత “బాగా” తీయాలా! అన్న జ్ఞానోదయం అయ్యాక ఇక ఈ సినిమా గురించి రాయడం [...]

సుబ్రమణ్యపురం - Dont miss it!

సుబ్రమణ్యపురం – Dont miss it!

తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో [...]

నా కళ్ళలో దశావతారం - 1

నా కళ్ళలో దశావతారం – 1

నేనూ “దశావతారం” చూసేసాను. సినిమా రిలీజుకి చాన్నాళ్ళ ముందునుంచీ ఎదురుచూసీ, చూసీ, విడుదలయ్యాక కథ చదవకుండా రివ్యూలు మాత్రం చదువుతూ…నేనెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తూ చివరికి….ఒక మంచిరోజున…చూసేసాను. నామటుకు నేనేమాత్రం నిరాశ చెందలేదని చెప్పుకోడానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే బోలెడు సమీక్షలూ వ్యాసాలు వచ్చేసాయి దీనిమీద. నవతరంగంలోనే రెండు మూడు వ్యాసాలు ఇదివరకే వచ్చేసాయి. మళ్ళీ నేను రాయాలా? అంటే, భిన్న దృక్కోణాలు ఉంటాయి, రాయండి అన్నారు వెంకట్ గారు. ఇది కమల్ అభిమాని (హీరోగానే [...]

Mozhi (2007)

Mozhi (2007)

ఒక మంచి తమిళసినిమా ఏదన్నా ఉంటే చెప్పు చూస్తాను అని నా తమ్ముణ్ణి అడిగితే ఇది చూపించాడు. చూశాక దీని గురించి వీలైనంతమందికి చెప్పాలి అనిపించింది నాకు. బరువైన విషయాన్ని కూడా ఎక్కడా పట్టు సడలకుండా, ఎక్కడా మనకు మరీ భారంగా అనిపించకుండా, ఎక్కడా హాస్యం పాలు తగ్గకుండా, ఇన్ని చేస్తూ కూడా కథ నుండి సైడ్ ట్రాక్ అవ్వకుండా రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ సినిమా తారాగణం: [...]