శుభలేఖ (1982)
విశ్వనాథ్ సినిమాల్లో నాకు విపరీతంగా నచ్చిన సినిమాల్లో శుభలేఖ మొదటి ఐదింటిలో ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా చాలాసార్లే చూసాను కానీ, ఈ మధ్యే మళ్ళీ చూసాను. చూసాక, ఈసారైనా దీని గురించి నా అభిప్రాయాలు రాయాలనిపించింది. నేను ఇంజినీరింగ్ చేసేరోజుల్లో మా కాలేజీ విద్యార్థుల్లో రచనాసక్తి ఉన్నవారికి ఓ వెబ్సైటు ఉండేది. అందులో దీని గురించి ఇంగ్లీషులో రాసానోసారి. కానీ, ఇప్పుడాసైటూ లేదు, ఆ వ్యాసం ఏమైందో అంతకంటే తెలీదు.
సరే, విషయానికొస్తే, వరకట్నానికి వ్యతిరేకంగా తీసిన [...]