ఉంబర్తా
ఉద్యోగస్తురాలయిన మహిళ జీవితంపైన, ఆమె ఈ వ్యవస్థలో ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవిస్తున్న సంఘర్షణలపైన భారతీయ చలనచిత్ర సీమలో నిర్మితమైన అతి కొద్ది చిత్రాల్లో “ఉంబర్తా” ప్రముఖమైంది. వర్కింగ్ ఉమన్ జీవన స్థితిగతులపైన సరైన దృక్కోణంలో మరాఠీలో నిర్మితమయిన చిత్రమిది. ఇటీవల ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్ర నిర్మాణంతో ప్రముఖ దర్శకుల జాబితాలోకి చేరిన డాక్టర్ జబ్బర్ పటేల్ 1982 లో ‘ఉంబర్తా’ కి దర్శకత్వం వహించారు. శాంతా మిసాల్ రాసిన మరాఠీ నవల ‘బేఘర్’ ఆధారంగా ఈ చిత్రం(…)
