Menu

S.Janaki Archive

జానకి గారి తక్కిన గొంతుకలు

ఈ టపా ఉద్దేశ్యం జానకి గారి పాటల గురించి మాట్లాడడం కాదు. ఆమె ప్రతిభలో ఓ కోణాన్ని తలుచుకోవడం. జానకి గారికి మాయ మామూలుగానే తెలుసు. కానీ, ఇక్కడ చెప్పబోతున్నది ఆ మాయల్లో ఇంకో ప్రత్యేకమైన మాయ. గొంతుని మార్చి పాడగలగడం. అలా పాడిన పాటలు ఎన్నున్నాయో నాకు తెలీదు కానీ, నేను విని ఆనందించి, మాయలో పడి, మునిగి – ఇన్నాళ్ళకి కొంత తేలాక ఇప్పుడు వాటి గురించి మిగితా అందరికీ చెబుదామన్న కుతూహలం ..