మేస్త్రి
మేస్త్రి లో చిరంజీవి ప్రజారాజ్యంపై సెటైర్స్ ఉన్నాయట కదా.. అనే ఒకే ఒక్క ఆసక్తి జనాల్ని కొద్దిలో కొద్ది ధియోటర్స్ వైపు లాగిందన్నది నిజం. అయితే దర్శకుడు తప్ప అన్నీ తానైన దాసరి మాత్రం ఈ విషయాన్ని (ప్రేక్షకులు ఏదైతే ఆశించి వచ్చారో) వదిలేసి పస్టాఫ్ అంతా పాతకాలం డ్రామాతో నింపేసారు. ఇక ఇందులో అలాంటివేం లేవురా వెళ్ళిపోదాం అని ప్రేక్షకుడు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ సెటైర్స్ బాణం తీసి ప్రయోగించారు. [...]