Tag: "mirch masala"

మిర్చ్ మసాలా

మిర్చ్ మసాలా

1980వ దశకంలో భారతీయ సినిమారంగంలో వెలుగు చూసిన మంచి చిత్రాల్లొ కేతన్ మెహతా నిర్మించిన “మిర్చ్ మసాలా” ఒకటి. సత్యజిత్‌రే “ఘరే బైరే”. ఆదూర్ గోపాలకృష్ణన్ “ముఖాముఖం”, అరవిందన్ “చిదంబరం” లాంటి గొప్ప చిత్రాల సరసన నిలిచే చిత్రం “మిర్చ్ మసాలా”. సమాజంలోని వాస్తవికతను ఆవిష్కరించే దిశలో ప్రేక్షకుల్ని తన వెంట లాక్కెళ్తుందీ చిత్రం. గొప్ప భావావేశంతో ఆద్యంతం చూపరుల్ని కట్టిపడేస్తుంది.
“మిర్చ్ మసాలా” చిత్రంలో ఉపయోగించిన మిర్చి రంగు గొప్ప ఉద్వేగభరితమయిన భావాల్ని ప్రస్ఫుటం [...]