Menu

Maniratnam Archive

మౌనరాగం – మనసు తీరు

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుట్టుకొస్తారు. అలా కుటుంబం ఏర్పడుతుంది.  ప్రేమ కొంచం అటూ ఇటూ అయినప్పటికీ అలవాటు అయిన అనుభంధం వివాహాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ( పటిష్టం అంటే…ఇద్దరూ కొట్టుకుంటున్నా వివాహన్ని విడిచిపోకూడదు అనుకుంటారు ) .

లే…చి…పో…దా…మా (గీతాంజలి – 2)

” నీకు Congenital హార్ట్ అంటే ఏంటో తెలుసా  ? ఉ … ఉహు.. పక్కన ఉన్న పిల్లల గ్యాంగ్ మొత్తం టకా టకా అని చెప్పేస్తారు. తెలిసి ఇలా ఉండగాలిగావా ?? హా .. ఎలా ?? ” చూడు నువ్వు చచ్చిపోతావ్ .. ఈ చిత్రా చచ్చిపోతుంది.. ఆ శారద ఉందే… అదీ చచ్చిపోతుంది.. పల్లికిలుస్తుందే,  చంటిది..ఇదీ చచ్చిపోతుంది.ఈ చెట్లూ  చచ్చిపోతాయి… ఆ తీగా చచ్చిపోతుంది…నేనూ చచ్చిపోతాను.కాకపోతే ఓ రెండురోజుల ముందే చచ్చిపోతాను.  రేపు