నవతరంగం » Making Movies

Making movies(Essay-7): ప్లీజ్ ప్లీజ్ పులి మామా!
సత్యజిత్ రాయ్ రాసిన ఏడు వ్యాసాల సంకలనం – మేకింగ్ మూవీస్ లో ఇది ఏడవ, చివరి వ్యాసం. ఆరో వ్యాసం ఇక్కడ చదవొచ్చు. ఇక్కడితో ఈ వ్యాస పరంపర సమాప్తం. మొత్తం అన్ని వ్యాసాలనూ డిసెండింగ్ ఆర్డర్ లో ఇక్కడ చదవొచ్చు.

Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

Goopy Gyne Bagha Byne సినిమా వచ్చిన చాలారోజులకి నేను దానికి కొనసాగింపుగా “హిరాక్ రాజ్య దేశే” (వజ్రాల రాజ్యం) అన్న సినిమా తీద్దామనుకున్నాను. గూపూ,బాఘా ఇద్దరూ ఈ సినిమాలో కౄరుడు, నిరంకుశుడు అయిన వజ్రాలరాజు రాజ్యంలోకి అడుగుపెట్టాక వాళ్ళ వీరగాథల గురించిన సినిమా ఇది. వజ్రాలరాజు ఖజానాలో ఓ పెద్ద పెట్టె నిండా వజ్రాలు ఉన్నాయి. గూపీ, బాఘా రాజభటులకు లంచం ఇవ్వడానికి వాటిలోంచి కొన్ని దొంగిలించాలి. కౄరుడైన రాజుని పదవీచ్యుతుణ్ణి చేయడం ఈ భటుల్ని కొనగలిగితేనే సాధ్యం. స్థానిక గురువు ఉదయన్ పండిట్ ఆలోచన ఇది. వజ్రాల రాజు నిరంకుశత్వానికి చరమగీతం పాడడానికి గూపూ, బాఘాలు ఇతనితో చేయి కలిపారు. వీళ్ళిద్దరూ ఖజానా చేరుకుంటారు. తలుపు వద్ద అటూ ఇటూ తిరుగుతున్న కాపలా భటుడు ఒకడు ఉంటాడు. కానీ, దయ్యాలరాజు ద్వారా గూపీ కి ఒక వరం దక్కి ఉంటుంది. అతను పాడుతూ ఉంటే ఎవరూ ఓ అంగుళం కూడా కదలలేరు, ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కనుక, అతను పాట పాడుతూ ఉంటే, బాఘా తేలిగ్గా కాపలావాడి చేతులు తాళ్ళతో కట్టేసి, నోరు మూసేసి అతని దగ్గర్నుండి తాళం తీసుకుంటాడు. తరువాత వాళ్ళు ఆనందంగా ఆ పెద్ద ద్వారాన్ని, దానికున్న పెద్ద తాళాన్నీ తీసి, ఇక ఏ అడ్డంకులూ లేవూ అనుకుంటూ లోపలికి అడుగుపెడతారు. అక్కడ ఆ పెట్టెకున్న తాళాలు విప్పే తాళం చెవిని ఓ పులు కాపలా కాస్తూ ఉందని వాళ్లెలా ఊహించగలరు? గూపీ పాడగలిగితే పులి కూడా స్థాణువౌతుంది కానీ, భయంతో గొంతెండిపోయిన గూపీ ఎలా పాడగలడు?

అతను ఎంతో కష్టపడి చివరికి -

“ప్లీజ్, ప్లీజ్ పులి మామా

కోపం తెచ్చుకోకు మామా

ఎలా తెలుస్తుంది మాకు నువ్విక్కడున్నావని?”

అన్న వాక్యాలు పాడగలుగుతాడు. అతని మంత్రం పనిచేసి పులి ఏమీ చేయకుండా కూర్చుంటుంది. బాఘా ముందుకెళ్ళి, ఆ పులి మీదుగా వంగి తాళాల గుత్తి తీసుకుంటాడు. తరువాత ఇక ఆ పెట్టె తెరిచి వజ్రాలు తీసుకోడమే. ఇదీ మేము తీయవలసిన దృశ్యం. హిరాక్ రాజ్య దేశే సినిమా చూసిన వాళ్ళకి ఈ దృశ్యం గుర్తు ఉండే ఉంటుంది. మేమది ఎలా తీసామో చెప్తాను ఈరోజు.

చాలా హిందీ సినిమాల్లో ఇప్పుడు పులులు, సింహాలూ కనిపిస్తూ ఉంటాయి. చాలావరకు వీటిని చెన్నై నుండి తెప్పిస్తారు. ఇప్పుడు ప్రఖ్యాతి చెందిన సర్కస్‍లు అన్నీ దక్షిణ భారతదేశానికి చెందినవే. అందుకే మేము ఈ పులి దృశ్యాన్ని చెన్నైలోని ఓ స్టూడియోలో తీద్దామనుకున్నాము. పదేళ్ళ క్రితం గూపీగైనే, బాఘా బైనే తీస్తున్నప్పుడు మేము పులిని ఒక గ్రామంలోకి తీసుకువెళ్ళాల్సి వచ్చింది, షూటింగ్ కోసం. ఇదొక మధురానుభూతి. ఇప్పుడు కూడా ఇక్కడ గుర్తుంచుకోదగ్గ అనుభవమే ఎదురైంది కానీ, వేరే తరహాది. చెన్నైలో కొన్నాళ్ళున్న ఓ బెంగాలీ ఆయన్ని పులిని అద్దెకి తీసుకుని విషయం గురించి ఆరా తీయమని అడిగాము. అతనికి చిత్ర పరిశ్రమతో సంబంధాలున్నాయి. పైగా, బెంగాల్ నుండి చెన్నైకి షూటింగ్ కోసం వచ్చిన వారికి సాయం చేస్తాడని పేరు కూడా ఉంది. నేను అసలు పేరు చెబితే ఏమన్నా సమస్యలొస్తాయేమో కానీ, మిస్టర్ బి అనుకుందాం అతన్ని. మిస్టర్ బి పులి ఉండే సన్నివేశాల గురించి వివరాలు అడిగాడు. మేము చెప్పాము. తరువాత అతను గూపీ పాడే పాట ఉండే టేప్ పంపమని అడిగాడు. పులి వద్ద ఆ పాటని ముందు నుంచే వినిపిస్తూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుంది ఏమో అని. సాధారణంగా షూటింగ్ మొదలయ్యేముందే పాటలన్నీ రికార్డు చేసి పెడతాము. కనుక అతనడిగిన – “ప్లీజ్, ప్లీజ్ పులి మామా” పాట పంపడానికి మాకేమీ అభ్యంతరం కనిపించలేదు.

షూటింగ్ ప్రారంభం కావడానికి పదిరోజుల ముందు మా యూనిట్ కి చెందిన అశోక్ బోస్ మద్రాస్ వెళ్ళి అక్కడ ప్రసాద్ స్టూడియోలో పని చేయడం ప్రారంభించాడు. అక్కడ ఖజానా సెట్ తయారు చేయడం అతని బాధ్యత. సాధారణంగా స్టూడియోల్లో సెట్లు వేయడానికి చెక్క ఫ్రేములు ఉపయోగిస్తారు. వాటికి రంగేశాక అవి వాస్తవికంగానే అనిపిస్తాయి – ఇటుకలతో, సిమెంటుతో చేసిన భవనాలలాగానే. ఓసారి దాన్ని చేత్తో కొడితేనే శబ్దం ద్వారా విషయం తెలుస్తుంది. పులి ని ఖజానా పక్క గదిలో ఉంచాలన్నది మా ఆలోచన. రెండు గదుల మధ్యా, ఒక ఆర్చ్ ఉంది. పులి పైన, గోడపై ఉన్న మేకుకి తాళం చెవి వేళాడుతూ ఉంటుంది. మేము షూటింగ్ ప్రారంభం కావడానికి రెండ్రోజుల ముందు మద్రాసు చేరుకున్నాము. అందరికీ పులిని చూడాలన్న కుతూహలం ఎక్కువైంది. ఇప్పుడు ఆ పులి భయంకరంగా కనిపించలేదంటే మా సీను అనుకున్నంత బాగా రాదు. మిస్టర్ బి మాకు ఎంత చెప్పినా కూడా, పులిని చూసేదాకా మాకు మనశ్శాంతి లేదు. అందుకే, దాన్ని చూడ్డానికి మరుసటి రోజు ఉదయం మిస్టర్ బి తో కలిసి వెళ్ళాము. అక్కడ వేరే జంతువులు కూడా ఉన్నాయి. ఒకచోట నీడలో అటూ ఇటూ ఊగుతూ ఉన్న పిల్ల ఏనుగు కనిపించింది. మిస్టర్ బి కొన్ని అరటిపళ్ళు తీసుకుని దానికి పెట్టడం మొదలుపెట్టాడు. అతనెందుకు ఇది చేస్తున్నాడు? మేము చూడాల్సింది పులిని కానీ, ఏనుగును కాదు కదా! తరువాత పులి శిక్షకుడు బైటకెళ్ళాడనీ, త్వరలోనే వస్తాడనీ తెలిసింది.

శిక్షకుడు వచాక మమ్మల్ని పులి బోను ఉన్న గదికి తీసుకెళ్ళారు. ఇది మా పాటని టేపులో మళ్ళీ మళ్ళీ విన్న పులేనని తెలిసింది. సీన్ తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉండింది. ఆ గదంతా చీకటిగా ఉంది. పులిని సరిగ్గా చూడ్డానికి సాధ్యపడలేదు. నాకు అసంతృప్తిగా అనిపించి ఆ శిక్షకుడిని – “కాస్త దాన్ని బయటకు తేగలరా?” అని అడిగితే, అతను “తప్పకుండా” అన్నాడు.

“అయితే, దయచేసి ఆ పని చేయండి, ప్లీజ్! పులిని మేము ఆ గదిలోపల కాదు, బయట చూద్దామనుకుంటున్నాము” అని జవాబిచ్చాను. కానీ, ఎందుకో కానీ, అతను ఆ పని చేయడానికి అంత సిద్ధంగా లేడు. మిస్టర్ బి కూడా నా మాటలు విని కాస్త బిగుసుకుపోయాడు. ఏం జరుగుతోందిక్కడ? మాకు విషయం కనుక్కోడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పులి ఆ బోను నుండి బయటకొచ్చి కనబడగానే మాకు అది ఎంత ముసలిదో అర్థమైంది. అది భయంకరంగా కనిపించే రోజులు పోయాయి.

Making movies(Essay-6): ఫెలూదాతో, వారణాసిలో
“With Feluda in Varanasi” అన్నది “Making movies” అన్న ఈ వ్యాస పరంపర లో ఆరవ వ్యాసం. వీటిల్లో అన్నింటి కంటే పెద్ద వ్యాసం కూడానూ.  వీలైనంత వరకు దీన్ని readable గా page break చేయడానికి ప్రయత్నించాను. ఇందులోని అన్ని వ్యాసాల్లోకీ సినిమా తీయడంలోని చాలా విషయాలని ఇది చెప్పినంతగా వేరే ఏ వ్యాసమూ చెప్పదు. ఈ సిరీస్ లోని ఐదవ వ్యాసం గత నెల్లో నవతరంగం లో వచ్చింది. దాన్ని ఇక్కడ చూడవచ్చు.ఇక చదవండి.

Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

ఇక్కడికి చివరిసారి వచ్చింది అపూతో. ఇప్పుడు ఫెలూదాతో కలిసి వారణాసికి వచ్చాను. అపరాజితో షూటింగ్ సందర్భంగా ఇరవైరెండేళ్ళ క్రితం వారణాసికి వచ్చాను. నగరంలోని చిన్న చిన్న సందులూ గొందులూ, ఇక్కడి గుళ్ళూ-ఘాట్లు, పూజారులూ-సాధువులూ, ఇక్కడి ఆవులూ-కోతులతో సహా అప్పుడు సమస్తం అపూ కళ్ళనుండి సినిమాలో చూపించాము. ఈసారి అదే ప్రదేశమైనా కూడా, సంఘటనలు చాలావరకు వేరు వేరు. ఇప్పుడు వారణాసి నగరం ఒక అపరాధ పరిశోధన కథకు వేదిక. డిటెక్టివ్ ఫెలూదా ఇక్కడికి సెలవుపై వచ్చినా కూడా, మొదట ఓ దొంగతనం కేసు పరిష్కరించడం మొదలుపెట్టి తరువాత హత్యకేసు వైపుకి వస్తాడు. వారణాసిని పూర్తిగా కొత్త కళ్ళతో చూడొచ్చు ఈ సినిమాలో. ఈ నగరంలోని ప్రత్యేకతలని ఇక్కడికి రానివారికి వర్ణించడం చాలా కష్టం. కలకత్తాలో కూడా ఘాట్ ఉంది. చిన్న చిన్న వీథులు కూడా ఉన్నాయి శ్యాంబజార్, బాగ్ బజార్, బోరో బజార్ వంటి చోట్ల. కానీ, వారణాసిలో ఉన్నవాటికి తమదైన వ్యక్తిత్వం ఉంది. అవి ఈ నగరానికే ప్రత్యేకం.

ఉదాహరణకి ఇక్కడి ఘాట్లతోనే మొదలుపెడదాం. వాటికి అంతమనేదే ఉండదు. దక్షిణాన ఆసి ఘాట్ మొదలుకుని ఉత్తరాన ఉన్న రాజ్ ఘాట్ దాకా వాటి పేర్లూ, వాటి పక్కనున్న భవనాలూ ఈ నగరానికున్న గతంలోని విభిన్నమైన ఛాయలను చూపిస్తాయి. ఉదాహరణకి దక్షిణాన ఓ చివర్న ఉన్న హరిశ్చంద్ర ఘాట్ వారణాసిలోని రెండు పెద్ద శ్మశానవాటికల్లో ఒకటి. పాతకాలంలో హరిశ్చంద్రుడు తన భార్యనీ, కొడుకు రోహితుడినీ ఓ బ్రాహ్మణుడికి అమ్మి ఓ సంవత్సరమంతా ఓ చంఢాలుడి వద్ద ఊడిగం చేసాడు. అక్కడికి దగ్గర్లోనే తులసి ఘాట్ ఉంది. తులసిదాసు రామచరితమానస్ ఈ ఘాట్ కి దగ్గర్లోనే ఉన్న ఓ ఇంట్లో రాశాడు. తులసి ఘాట్ కి ఉత్తరంగా రాజా చైత్ సింగ్ భవనం ఉంది. అది షిబల ఘాట్ పక్కనే. వారెన్ హేస్టింగ్స్ అతన్ని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు చైత్ సింగ్ తన భవనం కిటికీలోంచి సరాసరి గంగానదిలోకి దూకేసి ప్రాణం కాపాడుకున్నాడని అంటారు. ఎందరో రాజులు ఇలా ఘాట్ల పక్కగా తమ భవనాలు కట్టించుకున్నారు. అందుకే వాటికి ఆ రాజుల పేర్లే పెట్టుకున్నారు. మానసరోవర్ ఘాట్ ని అంబర్ మాహారాజా మాన్‍సింగ్ కట్టించాడు. రాణా ఘాట్ ని ఉదయపూర్ రాణా కట్టించాడు. ఇండోర్ మహారాణి అహల్యాబాయి అహల్యా ఘాట్ ని కట్టించారు. మన్ మందిర్ ఘాట్ పై గల ప్రసిద్ధి చెందిన మన్ మందిర్ ని రెండువందల యాభై ఏళ్ళ క్రితం జైపూర్ కి చెందిన మహారాజా జైసింగ్ కట్టించాడు. కానీ, వీటిలో బాగా పేరు పొందిన ఘాట్లు – వారణాసిలోని అతి పురాతనమైన శ్మశానవాటిక అయిన మణికర్ణిక మరియు బ్రహ్మ పది ఆశ్వమేధ యాగాలు చేసినట్లుగా చెప్పుకునే దశాశ్వమేధం. వాటికున్న ప్రఖ్యాతిగాంచిన వాటి పెద్దపెద్ద గొడుగుల్ని బట్టి వాటిని చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ గొడుగులను పట్టుకుని ఉండే కర్రలు పండాలనబడే అక్కడి పూజారుల చెక్క కుర్చీల పై పెట్టబడ్డ రాళ్ళకి తగిలించి ఉంటాయి. ఇవి సూర్యుడి స్థానాన్ని బట్టి మార్చేవిధంగా రాళ్ళ మధ్య అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా రోజంతా వారికి నీడగానే ఉంటుంది. ఇలాంటి గొడుగుల్ని నేనెక్కడా చూడలేదు.

ఇక్కడి సందులు అన్నింటిలోకీ సన్నగా ఉండేది విశ్వనాథ గల్లీ. నాలుగు అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఈ సందు దశాశ్వమేధ ఘాట్ నుండి బైటకి దారి చూపుతూ విశ్వనాథాలయానికి లోపలవైపుకి తీసుకెళ్తుంది. ఈ సందుకి ఇరువైపులా ఎన్నీ దుకాణాలు-ఏది వీలైతే అది అమ్ముతూ. కానీ, వారణాసి ఏ రెండు వస్తువులకైతే ప్రసిద్ధి గాంచిందో, ఆ రెండు వస్తువులు – రుబ్రి మలై, కంచు గిన్నెలు దొరికే చోటు వేరు. మొదటిది కచౌరి గలీ లోనూ, రెండవది తతేరి బజారు లోనూ. విశ్వనాథాలయంనుండి తక్కిన వీథులకి నిజానికి ప్రధాన మార్గాన్ని చేరకుండానే వెళ్ళవచ్చు. ఈ గల్లీల్లో చాలావాటికి ఏడాదిలోని ఏ కాలంలోనూ సూర్యరశ్మి అన్నదే తగలకపోవచ్చు. పెద్ద పెద్దగా, ఎన్నో అంతస్థులున్న హవేలీలు తరుచుగా కనిపిస్తూ ఉంటాయి ఈ సన్నని దారుల్లో. చాలామటుకు ఇళ్ళల్లో మధ్యభాగంలో ఒక బహిరంగ ప్రదేశం ఉంటుంది. అక్కడ నిలబడి తల ఎత్తి చూస్తే, ఆకాశం కనిపిస్తుంది. చతురస్రంగా ఉన్న ఓ నీలి గాజుముక్కలాగా. అది గనుక లేకుంటే మొత్తం భవనమంతా లాంతర్లో లేక వేరే ఏదో మార్గమో ఉపయోగించి వెలిగించాల్సిందే. ఇలాంటి ఓ వీథిలోనే మన సినిమాలోని విలన్ – మగన్‍లాల్ మేఘరాజ్ నివాసం. కనుక, ఇతనికోసం ఇల్లు వెదికే పని పడింది మాకు.

ఇక్కడ దాదాపు లక్షాయాభైవేలమంది బెంగాలీలు ఉన్నారు వారణాసిలో. చాలామటుకు అందరూ బంగాలీతోలా అన్న ప్రాంతంలోనే ఉన్నారు. ఇక్కడ బెంగాలీ ఎంత ఎక్కువగా వినబడుతుందంటే, షాపులపై బెంగాలీ రాతలు ఎంత తరుచుగా కనబడతాయంటే – మేము చూస్తున్నది బెంగాల్ లోని ఓ టౌనా? అనే సందేహం కలిగేంత! ఇక్కడి చాలా కుటుంబాలు దాదాపు పది తరాలుగా ఇక్కడే స్థిరపడ్డవి. అయినా కూడ, కొంచెం కూడా ఉత్తర భారతదేశపు యాస లేకుండా బెంగాలీ మాట్లాడతారు. చౌకంబాకి చెందిన మిట్టర్ కుటుంబాన్నే తీసుకుంటే వాళ్ళు ఎప్పుడో మొఘలుల కాలం నుండీ దాదాపు నాలుగువందల సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళింట్లో దుర్గాపూజ కూడా జరుగుతుంది. ఇక్కడి అతి ప్రాచీనమైన పూజ అది. వాళ్ళ ఇల్లు కూడా ఓ చిన్న గల్లీలోనే. బైట నుండి చూస్తే అది ఎంత పెద్దదో చెప్పడం కష్టం.

బంగారంతో చేయబడి, వజ్రం పొదిగిన ఓ వినాయకుడి విగ్రహం చోరీ కేసులో మరియు ఓ హత్య కేసులో ఫెలూదా వారణాసిలోని ఘాట్లలోనూ, వీథుల్లోనూ తిరగాలి కథ ప్రకారం – రహస్యాన్ని ఛేధించడానికి. మేము మూడురోజులకి వారణాసి వెళ్ళాము. ఎక్కడ షూట్ చేయాలి, ఏ ప్రాంతాల్లో ఏ సమయాల్లో వెలుతురు ఎలా ఉంటుంది? ఎక్కడ మాకు స్థానికులనుండి సహకారం లభిస్తుంది? వంటి విషయాలు తెలుకుకోవడానికి. చివరిది మాకు అత్యంత ముఖ్యం. అందువల్ల కొందరు స్థానికులతో మాట్లాడాము. “జయ్ బాబా ఫెలూనాథ్” (The mystery of the elephant God) అన్న కథలో చెప్పిన సంఘటనలన్నీ దుర్గాపూజ జరిగే ఐదు రోజులపాటు జరుగుతాయి.  దుర్గామాత విగ్రహానికి ఈ కథలో పెద్ద స్థానమే ఉంది. కనుక, మట్టితో చేసిన ఓ దుర్గాదేవి విగ్రహం కావాలని అర్థమైంది మాకు. అందుకే, మేము మొదట చేసిన పని బంగాలిటోలా లో గణేశ్ మొహల్లా ప్రాంతంలో ఉన్న కమ్మరివాళ్ళని గురించి ఆరా తీయడం.

ఇక్కడ ఓ సెకను ఆగి మీకు గోధూలియా గురించి చెప్పాలి. ఎందుకంటే, గోధూలియాని వదిలే నాలుగు దారుల్లో ఒకదారి గణేశ్ మొహల్లాని చేరుకుంటుంది. కలకత్తాలోని శ్యాంబజార్ వద్ద కలిసే ఐదురోడ్లు ప్రసిద్ధి చెందినట్లే, లేదా ధరంటోలా, ఛౌరింఘీ వంటి పెద్ద పెద్ద కూడళ్ళ లాగే ఇక్కడ గోధూలియా ఉంది. జనాలు ఇళ్ళలోంచి వ్యాపారాలకి వెళ్ళే సమయంలో అక్కడికి వెళ్ళి చూస్తే ఈ కూడలి వద్ద ఓ గోడ కనిపిస్తుంది. అందులో కదలిక ఉంది, అక్కడ శబ్దం కూడా వస్తుంది. ఒక్కోసారి వారణాసిలో ఉన్న పద్దెనిమిది వేల రిక్షాలూ అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. మామూలు పాదచారులకి ఈ గోడ దాటే అదృష్టం తక్కువ. ఈ గోడ కేవలం రిక్షాలే కాదు-లెక్కలేని టాంగాలూ, కార్లూ, సైకిళ్ళూ, లెక్కలేనంత మంది మనుష్యులతో కట్టినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ వాహన,మానుష సంద్రంలో ఎర్ర తలపాగాల పోలీసువాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ అటూ ఇటూ చేతులు ఊపుతూ ఉంటారు కానీ, ఎవరూ వారిని పట్టించుకోరు. పోలీసులే తమ పనిని అంత శ్రద్ధగా పట్టించుకోరు. ఎందుకంటే వారి కళ్ళ ముందే చాలా జరుగుతూ ఉంటాయి – కార్లు రిక్షాలని ఢీకొనడం, అవి వెళ్ళి సైకిళ్ళనో, పాదచారులనో ఢీకొట్టడం ఇలాంటివి. ఇలాంటి చిన్న చిన తగాదాలను గురించి ఎవరూ ఆలోచిస్తున్నట్లు అనిపించదు. పోలీసులు సరేసరి!

Making Movies(Essay-5): హల్లా రాజు సైన్యం (The army of Raja Halla)
Making Movies అన్న సత్యజిత్ రాయ్ వ్యాస సంకలనం అనువాదం నవతరంగం లో మేనెల లో మొదలుపెట్టినా కూడా, అనేక కారణాల వల్ల నత్తనడకన సాగుతూ వస్తున్నది. ఏడు వ్యాసాల ఈ సంకలనం లో నాలుగు వ్యాసాలు ఇదివరకే వచ్చాయి. వాటన్నింటినీ ఇక్కడ చదవొచ్చు. ఐదో వ్యాసం ఇక చదవండి.

“షోనార్ ఖిల్లా” తీసే సమయంలో ఒంటెలతో ఉన్న కొన్ని సీన్లను తీసేందుకే మేము ఎంత కష్టపడ్డామో ఇదివరకే “ఒంటెలు-ట్రైన్లు” వ్యాసంలో చెప్పాను. అప్పుడు మేము పని చేసిన ఒంటెల సంఖ్య అయిదు మాత్రమే. కానీ, దానికి కొన్నేళ్ళ ముందు Goopy Gyne, Bagha byne సినిమా తీసినప్పుడు మేము వెయ్యి ఒంటెలతో రాజా హల్లా సైన్యాన్ని తెరపై చూపవలసి వచ్చింది. అంతే కాదు. మాకు వెయ్యిమంది మనుష్యులు కూడా కావాలి కదా. వాళ్ళ బట్టలు, ఈటెలూ, జెండాలు, నగ్రాలూ వగైరా వగైరా. నిజం చెప్పాలంటే, అంత పెద్ద ఎత్తున పనిచేసిన అనుభవం లేదు మాకు. అందుకే ఆ సినిమా తాలూకా అనుభవాలన్నీ దానికోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ గుర్తుండిపోయాయి. అప్పటి కొన్ని అనుభవాల గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు.

ఈ సినిమా స్క్రీన్‍ప్లే ని “సందేశ్” లో వచ్చిన ఉపేంద్ర కిశోర్ రాయ్ కథ ఆధారంగా రాసాను. అప్పట్లో ఈ సినిమాలోని ప్రధానభాగాన్ని ఎక్కడ తీయాలి అన్న ఆలోచన లేదు నాకు ఇంకా. నాకు తెలిసిందల్లా హల్లా రాజు సైన్యమంతా గుర్రాలపై స్వారీ చేస్తారని. కానీ, రాజస్థాన్ లోని జైసల్మెర్ ని చూడగానే నాకు హల్లా రాజ్యాన్ని చూపడానికి ఇంతకంటే తగిన ప్రదేశం లేదేమో అనిపించింది. కానీ, అక్కడ గుర్రాల్లేవు. స్థానికులు ఒంటెలనైతే ఇస్తామన్నారు. దాంతో, గుర్రాలపై స్వారీ చేసే సైన్యం కాస్తా ఒంటెలపై నిలబడ్డది. అయితే, గుర్రాల్ని ఒంటెలని మారిస్తే నా పని పూర్తయినట్లు కాదు. అదే ఆరంభం. ఎంతో ఆలోచించి, ఎన్నో ఏర్పాట్లు చేయాలిక. మొట్టమొదట, సైనికులకి బట్టల దగ్గర్నుంచి, తలపాగాలు, కాళ్ళకి తొడుక్కునే నగ్రాలు అన్నీ డిజైన్ చేయాలి. సేనాధిపతికి మళ్ళీ వేరే వేషం ఉండాలి – కాస్త ఎక్కువ సరంజామా, వేరే రకం కిరీటం. ఈ డిజైన్ అంతా అయ్యాక బాంబే లోని ఓ కంపెనీ ని వెయ్యి జతలు తయారుచేయమని చెప్పాము. పెద్ద సైన్యం అంటే ఎక్కువ మంది సైనికులు ఉండాలి కదా మరి! ఇది పాత మరియు ప్రసిద్ధి చెందిన కంపెనీ. సినిమాలకి సంబంధించిన ఇలాంటి పనులకి పెట్టింది పేరు. వాళ్ళు చెప్పిన సమయానికి బట్టలన్నీ ట్రంకుపెట్టెల్లో పెట్టి చెప్పిన చోటికి నాలుగు లారీల్లో పంపుతామన్నారు. ఇవి బాంబే నుండి జైసల్మెర్ చేరుకున్నాకే మా షూటింగ్ మొదలుపెట్టుకుంటాము.

బట్టల సంగతి అయిపోయింది. ఇప్పుడిక సైనికులు, ఒంటెల సంగతి చూడాలి. రాజస్థాన్ లో ఒంటెలెక్కువన్న మాట నిజమే కానీ, అనుకున్న రోజు అనుకున్న సమయానికి వెయ్యి ఒంటెలు, వాటి యజమానులతో సహా ఎక్కడ్నుంచి దొరుకుతాయి? చివరికి మేము జైసల్మెర్ మహారాజాని సంప్రదించాలని నిర్ణయించుకున్నాము. మేముండే గెస్ట్ హౌజ్ జవహర్ నివాస్ నుండి ఆయన భవంతి కనిపిస్తూ ఉండేది. ఆయన్ని కలవడానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని నేను, కొద్ది మంది యూనిట్ సభ్యులూ కలిసి ఆయన్ని చూడ్డానికి వెళ్ళాము. ఆయనసలు రాజులాగే లేడు. సాధారణంగా మనం చిత్రపటాల్లో చూసే సంప్రదాయ రాజుకీ ఆయనకీ పోలికే లేదు. ఆయన పొడుగ్గా దిట్టంగా లేడు. కనీసం పెద్ద మీసాలూ, గెడ్డం కూడా లేవు. కానీ, కాసేపట్లోనే ఆయనకి ఎంత పరపతి ఉందో అర్థమైంది మాకు. “వెయ్యి ఒంటెలా? సరే, కుమార్ బహదూర్ చూసుకుంటాడు మీ పని.” అన్నాడు. కుమార్ బహదూర్ మహారాజాకు దూరపు చుట్టం. ఇరవైలలో ఉన్న యువకుడు. పెద్దగా శబ్దం చేస్తూ, రోడ్డంతా దుమ్ము లేపుతూ వెళ్ళే ఓ మోటార్ సైకిల్ నడిపేవాడు. అతను అప్పటికే జైసల్మెర్ లో సినిమా షూటింగని మహా ఉత్సాహంగా ఉన్నాడు. మేము మా అవసరం గురించి చెప్పగానే వెంటనే మాకోసం వెయ్యి ఒంటెల్ని సిద్ధం చేయడానికి ఒప్పుకున్నాడు.

హల్లా రాజు సైన్యం సినిమాలో ఒకే దృశ్యంలో కనిపిస్తుంది. కానీ, ఆ దృశ్యంలోనే బోలెడు విషయం ఉంది. హల్లా రాజు షుండి రాజ్యంపై యుద్ధం ప్రకటించిన విషయం తెలుపడానికి మొత్తం సైన్యాన్నీ పిలిపిస్తాడు. సీను మొదలయ్యేసరికి ప్రతి సైనికుడూ, అతని ఒంటెతో సహా నేలపై కూర్చుని ఉంటాడు. సేనాని “ఊంట్ ఉటావో” అన్నాకూడా ఎవరూ లేవరు. ఎందుకంటే రాజు యొక్క దుష్ట మంత్రి  సైనికుల్ని మాడుస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఈ ఆజ్ఞని పట్టించుకోకుండా అలాగే కూర్చుని ఉంటారు. దిక్కుతోచని సేనాని హడావుడిగా మంత్రి దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరిస్తాడు. మంత్రి బర్ఫీ అన్న ముసలి మాంత్రికుణ్ణి పిలిపిస్తాడు. తనలో ఇంకా మిగిలున్న శక్తితో బర్ఫీ మాయచేసి, సైన్యంలోని జడత్వాన్ని వదిలించి, వాళ్ళ కోపాన్ని మరిచిపోయేలా చేసి వాళ్ళని లేచి నిలబడేలా చేస్తాడు. కానీ, సైన్యం షుండి వైపు వెళ్ళే సమయానికి గూపీ, బాఘా ఉన్నట్లుండి సీనులోకి వచ్చి పాట పాడటం మొదలుపెడతారు. సైన్యం ఆగిపోతుంది. పాట ఆపగానే ఆకాశం నుండి మిఠాయిల కుండలు రాలిపడటం చూస్తారు సైనికులు. అవి మెల్లిగా నేలపై పడగానే, ఆకలి గుర్తొచ్చి, యుద్ధం సంగతి మరచి, సైనికులందరూ వాటిమీద పడతారు. మంత్రి కూడా కక్కుర్తి పడతాడు కానీ, ఈ గొడవలో ఎవరి కాళ్ళ మధ్యనో నలిగి అతని కుండ విరిగిపోతుంది. గూపీ, బాఘా ఇదే అవకాశం చూసుకుని, హల్లా రాజుతో కలిసి, షుండికి ఎగిరిపోతారు. – ఇదీ సీను.

జైసల్మెర్ కోటకి తూర్పు దిశగా ఓ అద్భుతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాం సైన్యం పోగయ్యే ఈ దృశ్యం తీయడానికి. కనుచూపుమేరవరకూ ఇసుకతో నిండి ఉంది. ఎక్కడా పచ్చదనమే లేదు. ఇక్కడి ఇసుక ఎడారిలోని మిగితా ప్రాంతాల్లోలా నడుస్తూ ఉంటే కూరుకుపోయేలా లేదు. నడకకి అనువుగా ఉంది. ఉత్తరదిశలో ఓ రాతి కొండ ఉంది. ఓ మైలు దూరం వరకు పొడిగింపబడి, సహజసిద్ధమైన గోడలా ఉంది. ఈ కొండపైన చదునుగా ఉంది. పదకొండో శతాబ్దంలో ఈ కొండపై భాటీ రాజ్‍పుట్ వీరులు వాళ్ళ కోట కట్టుకున్నారు. రాజస్థాన్ లో ఇలాంటి కొండలు చాలా ఉన్నాయి. వీటినే “టేబుల్ మౌంటైన్స్” అంటారు. జైసల్మెర్ కోటలాగానే చిత్తోఢ్ లో కూడా కోట, నగరం ఓ కొండపైని చదునైన ప్రదేశంలో కట్టినవే. షూటింగ్ కోసం ఎంచుకున్న ప్రదేశం దగ్గర్లో రాజ్‍పుట్ వీరుల స్మశాన వాటిక ఉంది. రెండొందల యార్డుల వరకు రకరకాల సైజుల్లోని స్మారక చిహ్నాలున్నాయి. అన్నీ yello sandstone తో చేసినవి. ఇది చూసాక నాకో ఆలోచన కలిగింది. గూపీ బాఘాలను యుద్ధం వల్ల నష్టాల గురించి చెప్పే ఓ వాక్యం వచ్చినప్పుడు ఇక్కడ నడుస్తూ పాడుతున్నట్లు చూపించాలని.

Making Movies:వ్యాసం 4 – ఒంటెలు-ట్రెయిన్లు
Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

షోనార్ ఖిల్లా (The golden fortress) సినిమా చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది అందులోని ఆసక్తికరమైన ఒంటెల ఎపిసోడ్. క్రైమ్ థ్రిల్లర్ల రచయిత, లాల్ మోహన్ గంగూలీ అలియాస్ జటాయూ కి తరుచుగా ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసినట్లు కలవచ్చేది. సినిమా చివరికి వచ్చేసరికి ఆ కల అనూహ్యమైన రీతిలో నిజమౌతుంది. ఈ సినిమాలో విలన్ మందార్ బోస్ ని డిటెక్టివ్ ఫెలూదా కారులో వెంటాడుతూ ఉంటాడు. కానీ, మందార్ బోస్ ఎలాగో ఫెలూదా కారుని ఒకసారి కాదు రెండు సార్లు పంచర్ చేయిస్తాడు. దాంతో వీళ్ళకి జైసల్మెర్ కి రోడ్డు మార్గంలో వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. ఎటూకాని చోట మధ్యలో ఆగిపోయినా ఫెలూదా, అతని మనుషులకి ఒక రాజస్థానీ గుంపు కనిపిస్తుంది-ఒంటెల స్వారీ చేస్తూ. ఫెలూదా వాళ్ళని లిఫ్ట్ అడిగి అక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న రైల్వేస్టేషన్ అయిన రాందేవ్రా కి చేరుకుందాం అని నిర్ణయిస్తాడు. అక్కడ్నుంచి జైసల్మెర్ కి ట్రైన్ పట్టుకోవాలి. ఆ ట్రెయిన్ రాందేవ్రా కి అర్థరాత్రికి గానీ రాదు.

ఫెలూదా, తోప్చే ఇద్దరికీ పెద్ద దిగులేమీ లేదు. ఇద్దరూ యువకులు, వ్యాయామాలు చేసేవారు. కానీ, జటాయూ? నిజజీవితంలో ఒంటెలని చూసేసరికి అతని కల కాస్తా పీడకలగా మారుతుంది. “ఎంత వింత జంతువులివి! మత్తు పదార్థాలకి బానిసలైన వాళ్ళలా సగం తెరిచి, సగం మూసి…వాలిపోతున్నట్లు ఉన్న కళ్ళూ, ఎగుడుదిగుడుగా ఉన్న పెద్ద పెద్ద పళ్ళూ, రోజంతా ఏదో నముల్తూనే ఉంటాయి. పైగా కదుల్తున్నప్పుడు ఎలా ఊగుతాయంటే, ఎక్కిన వాడి శరీరంలోని ఎముకలన్నీ కదిలి బైటకి వచ్చేస్తాయి. ఇక ఇలాంటి జీవాలపై స్వారీ చేయాలంటే, ఆ దురదృష్టకర అనుభవం ఎలా ఉంటుందో దేవుడికే తెలియాలి!” అన్నది జటాయూ అభిప్రాయం. కానీ, జటాయూ ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే అప్పటికే ఫెలూదా,తోప్చే ఇద్దరూ ఒంటెపైకి ఎక్కేస్తారు, ఎటువంటి సమస్యా లేకుండా. లాల్ మోహన్ బాబు ఎక్కడానికి ప్రయత్నించి, పట్టు తప్పి కింద పడబోయి ఎలాగో ఎక్కుతాడు చివరికి. ఫెలూదా ఆ రాజస్థానీ గుంపు నాయకుడితో “ఛలియే జీ రాందేవ్రా!” అనడంతో బయలుదేరతారు. వాళ్ళు బయలుదేరాక, లాల్‍మోహన్‍బాబు ఇంకా భయపడుతూ ఉండగానే, తోప్చే దూరంలో ట్రైన్ ని చూస్తాడు. ఇప్పుడా ట్రైన్ ని ఆపగలిగితే వీళ్ళు రాందేవ్రా లో పది గంటలు ఎదురుచూసే సమయం అంతా మిగులుతుంది. దాంతో ఒంటెలు ఆ ట్రైన్ వైపుకి పరుగెత్తి త్వరగానే రైల్వే లైను చేరతాయి. ఫెలూదా తన జేబులోంచి తెల్ల రుమాలు తీసి అదేపనిగా ఊపడం మొదలుపెడతాడు, డ్రైవర్ తనని చూసి ట్రైన్ ఆపుతాడు ఏమో అని. కానీ, అది జరగదు. డ్రైవర్ అతన్ని పట్టించుకోడు. ట్రైన్ పెద్దగా శబ్దం చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఫెలూదా పళ్ళు కొరుక్కుంటూ “శభాష్!” అని అరుస్తాడు. అప్పటికే జటాయూ సగం చచ్చిపోయి ఉంటాడు. ఈ అనుభవం అతను జీవితాంతం మరిచిపోలేడు. ఇలా జరగడంతో ఈ గుంపు వెనక్కి తిరిగి రాందేవ్రా వైపు ప్రయాణం మళ్ళీ కొనసాగిస్తుంది.

- ఇదీ మేము తీయాల్సిన సన్నివేశం. ఇప్పుడు నేను ఇది తీయడంలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెబితే మీకు ఓ ఆంచనా వస్తుంది సినిమా తీయడం ఎంత పెద్ద పనో అన్నది.

రాజస్థాన్ లో ఒంటెలకి కొరతలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. గూపీ గైనే, బాఘా బైనే తీస్తున్నప్పుడు మేము రెండు మూడ్రోజుల్లోనే వెయ్యి ఒంటెల్ని తెచ్చుకోగలిగాము. షోనార్ ఖిల్లాకి అయితే అంత అవసరం లేదు. కానీ, సమస్యేమిటంటే మేము ఎంచుకున్న ప్రదేశం జనావాసాలకి చాలా దూరంలో ఉంది. కనుచూపు మేరలో ఇసుక, ముళ్ళపొదలూ, ఎండిపోయిన గడ్డీ తప్ప మరేం లేదు. ఎడారిమీదుగా ఓ మీటర్ గేజ్ రైల్వేలైను ఉంది – మొదలూ,తుదీ రెండూ లేనట్లుందది చూట్టానికి. ఈ రైల్వేట్రాక్ కి సమాంతరంగా జైసల్మెర్ కి రోడ్డు దారి ఉంది. అది ఇంకాస్త దూరంలో ఉండి ఉంటే, ఇక్కడ ఒక్క దృశ్యం కూడా తీయలేకపోయేవారం. మేము జైసల్మెర్ లో మకాం వేశాం. కనుక అక్కడ్నుంచి సరంజామా అంతా ఇక్కడికి పట్టుకురావాలి. కెమెరామెన్ ఒక ఓపెన్-టాప్ జీప్‍లో నిలబడి కెమెరా పట్టుకోవాలి – ఒంటెలు ట్రైన్ వైపు వెళ్ళడాన్ని తీయడానికి. కనుక, దగ్గర్లో ఓ రోడ్డు ఉండటం అవసరం. జోధ్‍పూర్ నుండి జైసాల్మెర్ దాకా వందమైళ్ళలోని ప్రతి అంగుళాన్నీ వెదికాము ఇలా అన్నింటీకీ అనువైన ప్రదేశాన్ని కనిపెట్టడానికి. ఇది జైసల్మెర్ కి తూర్పుగా,సుమారు 70 మైళ్ళదూరంలో ఉంది, జోధ్‍పూర్ వెళ్ళే మార్గంలో. ఒంటెలు ఇంకో ఏడు కిలోమీటర్లు తూర్పు దిక్కుగా వెళితే వచ్చే ఖాచీ అన్న ఊరు నుండి తెప్పించాము. వాటి యజమానులకి వాటిని బాగా తయారుచేయమని చెప్పాము. మనకి ఒంటెలకి అలంకారాలు, వాటి శరీరాకృతి చూస్తే నవ్వొస్తుందేమో కానీ, ఒక రాజస్థానీకి ఒంటెలు మంచి స్నేహితులు. కొన్నిసార్లు ఎడారుల్లో ఒంటెలొక్కటే వీళ్ళలో ప్రాణాలు నిలుపగలిగేవి. అందుకే పాతకాలం నుండీ ఒంటెల్ని రంగురంగుల దుస్తుల్లో అలంకరించడం జరుగుతోంది. ఇక్కడి ఎండిపోయిన భూమిపై ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఎడారిలోని భూస్వరూపానికి ఒంటెలు సరిపోయినంతగా ఇంకే జంతువూ సరిపోలదు. ఈ ఒంటెల యజమానులు మధ్యాహ్నానికల్లా ఆ ప్రదేశాన్ని చేరుకుంటామని చెప్పారు. మా వాళ్ళు కొందరు వారి కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉండాలని నిశ్చయించబడింది. లేకుంటే వాళ్ళు ఈ ప్రదేశం కనుక్కోలేరు. ఒంటెలు దొరికాయి..ఇప్పుడు ట్రైన్ కావాలి. మేము అనుకున్న ట్రైను జోధ్‍పూర్ నుండి పోఖ్రాన్ దాకా ఉదయంపూట వెళుతుంది. పోఖ్రాన్ జోధ్‍పూర్ జైసల్మెర్ ల మధ్యలో ఉంది. మేము షూటింగ్ తీస్తున్న ప్రదేశం పోఖ్రాన్ కి పడమరగా ఇరవై మైళ్ళ దూరంలో ఉంది. కానీ, అధికారులు మమ్మల్ని ఆ ట్రైన్ ని కావాల్సినప్పుడూ వాడుకోనిస్తారని మాకు నమ్మకంగా ఉండింది.

మేము అసలు రోజుకోసం సిద్ధమౌతూ ఉండగా జరిగిన ఓ సంఘటన దాదాపు మా ప్లానంతా పాడుచేసింది. బొగ్గు ధరలు పెరగడంతో ఒకరోజు నోటీసుతో మేము ఉపయోగిద్దాం అనుకున్న ట్రైను కాస్తా కాన్సిలయింది. ఎంత పనైంది! నేనెంతో జాగ్రత్తగా రాసాను ఈ సన్నివేశాన్ని. ఇక ఇపుడు ఫెలూదా, అతని జట్టూ ఎడారిలో ఒంటెల స్వారీ చేస్తూ ట్రైన్ ఆపేందుకు ప్రయత్నించే దృశ్యం తీసేయాలేమో స్క్రిప్టు నుండి? లేదు…అలా జరగనివ్వకూడదు. నేను ఆరోజే రైల్వే అధికారుల వద్దకు వెళ్ళి పరిస్థితులని వివరించాను. ఈ సీన్ తీయకుంటే మేము రాజస్థాన్ వచ్చిన పని అవనే అవదని చెప్పాను. అదృష్టం కొద్దీ అక్కడి అధికారుల్లో కొందరు అర్థం చేసుకున్నారు. ఒక మార్గం చూపించారు. వాళ్ళు మాకు ఓ పూర్తి ట్రైన్ – ఆరు భోగీలు, గార్డ్ కేబిన్, బొగ్గు వేసే మనిషి, ఇంజిన్ – అన్నింటితో ఇస్తామన్నారు. అందులో ఉపయోగించిన బొగ్గుకి మాత్రం మేము డబ్బులివ్వాలి, అంతే. ఈ సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమవడంతో చాలా హాయిగా అనిపించింది. ఇది శాపం రూపంలోని వరంలా అనిపించింది. ఎందుకంటే, ఇప్పుడు ట్రైన్ మా చేతుల్లోనే ఉంటుంది కద, ఆ కొద్ది గంటలూ. దాన్ని ఆపడం, పంపడం, ముందుకీ, వెనక్కీ పంపడం – అంతా మా చేతుల్లోనే ఉంది ఇప్పుడు!

Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-2)
ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ:

Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

వాళ్ళిద్దరూ కాళ్ళు విదుల్చుకుంటూ ప్రకటించారు – “మా చెప్పులు ఆ మంచులో గల్లంతయ్యాయి” అని.

“ఎప్పుడు? ఎక్కడ? ఎలా?”

“మీరు షాటు తీయడం మొదలుపెట్టగానే..” వాళ్ళు ఎగరగానే చెప్పులు జారిపోయాయట. ఇప్పుడవి మంచులో పాతిపెట్టబడ్డాయి. తరువాత ఓ అరగంట మంచుని తవ్వుతూ కూర్చున్నాము కానీ, అవి దొరకలేదు. బహుశా వేసవిలో ఈ మంచు కరిగాక కనిపిస్తాయేమో. అప్పుడు పెద్ద పెద్ద దయ్యాల కళ్ళతో ఉన్న ఈ రెండు జతల నల్లటి చెప్పుల్ని చూసి ఆ గ్రామస్థులు ఎలా స్పందిస్తారో తలుచుకుంటే నవ్వొచ్చింది. పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉండేవేమో గానీ, మాకు కాస్త తెలివి పనిచేసి రెండేసి జతల చెప్పులు చేయించాము. కనుక, ఈ జత పోయినా పర్వాలేదు. రెండో జత చెప్పులున్నాయి ఇద్దరికీ. తరువాతి దృశ్యాలన్నీ బాగా వచ్చాయి. గూపూ,బాఘా ఇద్దరూ చలికి వణుకుతూ కాస్త వెచ్చగా ఉండే దుస్తుల కోసం అడిగారు. వెంటనే వారికి టిబెట్ ఉన్ని దుస్తులని ఇచ్చాము. కలకత్తాలో ఓ యూరోపియన్ వద్ద కొన్నాము వాటిని. బాఘా కి ఒళ్ళు కాస్త వెచ్చబడగానే అసహనం మొదలైంది. గుప్పిళ్ళలో మంచుముద్దల్ని తీసుకుని గూపీ పై చల్లుతూ – “ఇదేనా నీ ఝుండీ? ఇక్కడా ఆ పోటీ జరుగుతున్నది?” అని అరిచాడు. గూపీ కాస్త సిగ్గుపడుతూ – “సరే, హుండీ కి వెళదాం ఐతే” అన్నాడు. ఇక్కడ మచాన్ ని మంచులో నిలిపాము. మళ్ళీ వీళ్ళిద్దరూ ఇదివరకటి పనులన్నీ చేసారు – మచాన్ ఎక్కి దూకడం, వాళ్ళు పైకి ఎగురుతున్న భ్రాంతి కలిగించడం – ఇదంతా మళ్ళీ జరిగింది. అంతే, ఖుఫ్రీలో షూటింగ్ ఐపోయింది. ఇక రాజస్థాన్ ఏడారుల్లోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది.

ఈ దేశంలో ఎడారి అంటూ ఉన్నది థార్ ఒక్కటే. అది పశ్చిమ రాజస్థాన్ లో ఉంది. కానీ, మేము చూడాల్సిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. గూపీ గైనే కథలో ఇద్దరు రాజులుంటారు. ఒకరు-షుండీ ని పాలించే రాజు, మంచివాడు. ఇంకొకరు-హల్లా రాజ్యాన్ని పాలించే వాడు, చెడ్డవాడు. షుండీ కోసం మేము బుండీ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. చెట్లూ,చేమలూ, పొలాలు, చెరువులు, కొండలూ – ఈ విషయంలో రాజస్థాన్ లో బుండీ ని మించిన అందమున్న ప్రాంతాలు చాలా తక్కువ. చెడ్డరాజు రాజ్యమైన హల్లాకోసం జైసల్మెర్ ని ఎంచుకున్నాం. బుండీ కి సరిగ్గా వ్యతిరేకం ఇది. ఇది కూడా అందంగానే ఉంటుంది కానీ, దీని అందంలో ఓ కౄరత్వం ఉంది. దాదాపు ఆ ప్రాంతం మొత్తంలో పచ్చదనమనేదే లేదు. అయినప్పటికీ, నిజమైన ఎడారి జైసల్మెర్ లో లేదు. అక్కడికి చేరాలంటే పశ్చిమంగా మరో పాతిక కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పారు మాకు. ఒకరోజు గూపీ బాఘా లతో కలిసి వెళ్ళాము మేము, వాళ్ళు మంచు ప్రాంతం నుండి వెంటనే దిగడానికి అనువైన ప్రదేశాన్ని వెదకడానికి. జైసల్మెర్ ని వదిలి వెళ్ళడానికి ఎంతో సేపు పట్టలేదు. ఓ మైలు దూరం వెళ్ళాక, ఒక రాళ్ళతో నిండిన ప్రాంతం దాటాక, జీపు తప్ప మరే వాహనమూ వెళ్ళలేని దారి చేరుకున్నాము. మాకిది పెద్ద సమస్య కాలేదు, ఎందుకంటే ఇది ముందే ఊహించి మేము జీపులోనే వచ్చాము కనుక. కానీ, జీపు సాఫీగా ఉన్న రోడ్డు మీద నడవలేదు కొన్నిసార్లు. మా డ్రైవర్ వాలకమెలా ఉండిందంటే, అయితే ఇతనికి దారి క్షుణ్ణంగా తెలిసుండాలి, లేకుంటే అసలేమీ తెలీదు అన్నట్లు. అందుకే ఏమో, అతను తన చిత్తానికి తోచినట్లు తీసుకెళ్తున్నాడు బండిని. బహుశా అతనికి అల్లా మీద బాగా నమ్మకమేమో, ఆయనే తనని తీరం చేరుస్తాడని!

మెల్లగా నేలపై ఇసుక తగ్గుతూ ఉండటం గమనించాను. ప్రతి పదినిముషాలకు మాలో ఎవరో ఒకరు “ఎక్కడుంది ఎడారి?” అనడమూ, అతను “వచ్చేస్తుంది” అనడమూ జరిగింది. మాకు తెలిసిందల్లా మేము మోహన్‍గఢ్ అన్న ప్రాంతానికి వెళ్ళాలని. “గఢ్” అనగానే నాకు అక్కడేదో కోట ఉందేమో అనిపించి, ఆసక్తికరంగా ఉండింది. పైగా, నేను రాజస్థాన్ గురించి చదివిన ఏ పుస్తకంలోనూ మోహన్‍గఢ్ ప్రస్తావన లేదు. మేము ఇంకో పది పన్నెండు మైళ్ళు ప్రయాణించాక ఇక చెప్పుకోదగ్గ రోడ్డంటూ లేని ప్రాంతానికి చేరుకున్నాము. రోడ్డొక్కటే కాదు మాయమైంది.. చెట్లూ, ఇళ్ళూ, కొండలూ…అక్కడక్కడా కనబడ్డ చిన్న చిన్న మట్టిదిబ్బలు కూడా మాయమయ్యాయి. ఇంకా..ఇసుక? అసలు ఇసుక కూడా పూర్తిగా మాయమైపోయింది. నేను ఈ దేశంలో సుమారుగా ప్రయాణాలు చేసాకానీ, ఎప్పుడూ ఇలాంటి ప్రదేశానికి రాలేదు.

తొందరగానే ప్రకృతి మారింది. ఒక నిముషం మేము పూర్తి రాళ్ళబాటలో ఉన్నాము – రాళ్ళు రప్పలూ తప్ప ఏమీ లేవు. మరు నిముషంలో మేము విరిగిన మట్టి కుండల ముక్కల గుట్టలు. వెంటనే మేము సన్నటి చిల్లులున్న రాళ్ళ మధ్య ఉన్నాము. ఒక్క ప్రాంతం కూడా చదరంగా లేదు. మా జీపు చాలా వంపులు, గతుకులూ మధ్య నడిచింది. ఎటు చూసినా కూడా ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద కదలిక లేని అలలు నిండినట్లు అనిపించింది. మాకు సరైన ఎడారి కావాలి. లేకుంటే, మంచుకీ, ఇసుకకీ మధ్య ఉన్న తేడాని ఎలా చూపిస్తాం? గూపీ బాఘా అతి చల్లని ప్రాంతం నుండి అతి వేడి ప్రాంతానికి వెళ్ళారని చూపొద్దూ! అల్లాహ్ పుణ్యమా అని చివరికి మోహన్‍గఢ్ చేరాము. నిజంగానే అక్కడో “గఢ్” ఉంది కానీ, అది చాలా చిన్న, ఆధునిక భవంతి..రాజస్థాన్ లోని తక్కిన కోటలతో దానికి పోలికే లేదు. అది గౌరవానికంటే కూడా కాస్త నవ్వుని కలిగించింది. కానీ, లోపల చూడకుండా వెనక్కి రాలేము కనుక లోపలికి వెళ్ళి చూస్తే తెలిసింది – అక్కడ బహిరంగ ప్రదేశంలో పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి అని. ఇక్కడే యుద్ధమూ జరగలేదని మాకు ఎవరూ చెప్పకుండానే అర్థమైంది.

ఇరవై మైళ్ళు ప్రయాణం చేసాము..కానీ, ఇప్పటిదాకా ఎడారి ఛాయలే లేవు. అంటే, ఈ ప్రయాణమంతా దండగేనా? పెట్రోలు పై పెట్టిన డబ్బూ, సమయమూ, జీపులో కూర్చుని అనుభవించిన ఎగుడుదిగుళ్ళూ-అన్నీ దండగేనా? చివరికి ఆ ఊరు మనిషి ఒకతను కనబడి చెప్పాడు ఏమైందో. అసలు మేము మొదట్నుంచే తప్పుదారిలో వచ్చాము. ఎడారి పూర్తి అవతలి దిక్కులో ఉందట! నేనక్కడ నిలబడి ఈ విషయాన్ని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ ఉండగా మా జీపు డ్రైవర్ ఒక సలహా ఇచ్చాడు – ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇప్పుడు వెనక్కి తిరిగే బదులు, ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాం, అప్పుడూ దొరక్కపోతే జైసల్మెర్ వెళ్ళిపోదాం అని. సరే, మళ్ళీ ముందుకు కదిలాము మేము. ఈసారి, ఒక మైలు దూరం వెళ్ళాక మాకు ఓ ప్రదేశం కనిపించింది. ఇది పూర్తిగా ఎడారి అనలేము కానీ, ఆ దృశ్యం తీయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం లేదనిపించింది. ఈ ప్రదేశానికి ఓ పేరుంటే, అది మాకిప్పటికీ తెలీదు. ఇక్కద బోలెడు ఇసుక ఉంది, కానీ ఏడారుల్లో ఉండే ఇసుక అలలు లేవు. కనుచూపుమేర ఇసుక నేలపై చదరంగా పరిచి ఉంది. దీని పై నడుస్తూ ఉంటే కింద నీళ్ళు ఉన్నాయి అని కూడా ఎవరికీ అర్థం కాదు. అక్కడక్కడా పొడి ఇసుక ఉంది- రంగు కాస్త తక్కువగా ఉంది మిగితా ఇసుకతో పోలిస్తే. మధ్యాహ్న సూర్యుడు ఇక్కడ పడ్డప్పుడల్లా ఆ వెలుగు ఇసుకనుండి మా కళ్ళలో వెలిగేది. ఫిబ్రవరి నెలాఖరు-అక్కడ మరీ వెచ్చగా లేదు కానీ, ఈ ప్రాంతం సహారా కి ఏమాత్రం తీసిపోదు అనడం లో నాకే అనుమానమూ లేదు.

ఈ ప్రదేశం చూడగానే డ్రైవర్ ని ఆపమన్నాను. వెదుకుతున్నది ఉన్నట్లుండి దొరికేసరికి కలిగే ఆనందంలో కాసేపు నాకు మాటలు రాలేదు. అప్పుడోసారి పడమటిదిక్కుకు చూసిన నాకు గుండె ఆగినట్లైంది. “ఎక్కడున్నాం మనం?” రాజస్థాన్ లో ఇంతపెద్ద చెరువుందని నాకెవరూ చెప్పలేదు. అసలు దాన్ని మహాసముద్రమనొచ్చు. కానీ, అందులో నీరు చాలా స్థిరంగా ఉంది. ఓ చిన్న చలనం కూడా లేదు. మాకు నీరు స్పష్టంగా కనిపించింది, ఆ ఇసుక ప్రాంతం చివరిదాకా. వాటిలో ఆకాశంలోని మేఘాల నీడలు కూడా కనబడ్డాయి. కుడిపక్కనున్న చెట్ల వరుసల నీడలు కూడా కనిపించాయి. కొన్ని సెకన్ల పాట నాకు నోట మాట రాలేదు. తరువాత అర్థమైంది మాకు, అది నిజం చెరువు కాదు, ఎండ మావి అని. ఇలాంటి అచ్చమైన ఎండమావులు ఎడారుల్లో అంత తేలిగ్గా కనబడవు.

తరువాత మాకు గూపూ, బాఘా ఎడారి చేరడం, విడువడం చూపే ఒకటిన్నర నిముషాల దృశ్యం తీయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మేము సాయంత్రం జైసల్మెర్ చేరుకున్నాక అక్కడి ప్రజలలో కొందరన్నారు – ఈ ఎండమావి గురించి తెలుసని. ఒక్కోసారి మనుషులే కాదు, జంతువులు కూడా మోసపోయాయట. ప్రతి ఏడూ జింకల గుంపులు నీటిని వెదుకుతూ, ఆశగా అటువైపు నడుస్తూ ఉంటాయట-కానీ, చివరికి ప్రతి ఒక్కటీ చచ్చిపోతుంది-ఒక్క చుక్కైనా నీరు తాగకుండానే!

Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-1)
Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

ముందు మాట: ఈ వ్యాసం “Goopy Gyne, bagha byne” అన్న సినిమా షూటింగ్ సమయంలోని విశేషాల గురించి. ఇక చదవండి.

గూపీ,బాఘా ఇద్దరికీ దయ్యాల రాజు మూడు వరాలను ఇచ్చాడు. మొదటిది వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ తిండీ-బట్టా ఇచ్చేది. రెండవది వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనేది. వాళ్ళూ ఆ దయ్యాలరాజు ఇచ్చిన మంత్రించిన చెప్పులేసుకుని చేతులు కలిపి చప్పట్లు కొడితే చాలు. మూడోది చెవిటివాడైన గూపీని గాయకుడిగా మార్చింది, బాఘా ని మంచి డప్పుకొట్టేవాడిగా మార్చింది. గూపీ గైనె బాఘా బైనే చూసిన ఎవరికన్నా తరువాత ఏమైందో తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ చప్పట్లు కొట్టగానే మాయ లాగా విందు భోజనం వచ్చేస్తుంది. వాళ్ళు తినడం ముగుస్తూ ఉండగా ఒక శాస్త్రీయ సంగీతకారుడు తన పటాలంతో పల్లకిలో వెళుతూ ఉండటం కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళలో ఒకరు గూపీకీ, బాఘాకీ వాళ్ళు శుండి వెళ్తున్నట్లూ, అక్కడ ఒక సంగీత పోటీ ఉందనీ చెబుతాడు. తమ ఉస్తాద్ అందులో పాల్గొనబోతున్నట్లు కూడా చెబుతాడు. ఆ గుంపు అటువెళ్ళగానే గూపీ బాఘాలకి అర్థమౌతుంది-తాము కూడా ఆ పోటీలో పాల్గొనడాన్ని ఎవరూ ఆపలేరు అని. రాజుగారికి తమ పాట నచ్చితే ఆస్థాన గాయకులుగా ఉండమనే అవకాశం కూడా ఉంది. దయ్యాలరాజు ఇచ్చిన చెప్పుల పుణ్యమా అని ఆ ప్రదేశానికి వెళ్ళడం పెద్ద సమస్య కాదు. కానీ…ఆ ఊరి పేరేమిటి? గూపీ బాఘాలు ఇద్దరికీ గుర్తులేదు. గూపీ ఏమో ఆ మనిషి ఝుండి అన్నాడంటాడు. బాఘా ఏమో ఆ మనిషి హుండి అన్నాడంటాడు. కాసేపు గొడవపడ్డాక బాఘా తన చేతిని గూపీతో కలిపి ఝుండీ అని అరుస్తూ చప్పట్లు కొడతాడు. మరుక్షణంలో వాళ్ళు మంచులో ఉంటారు, చలికి వణుకుతూ, పళ్ళు పటపటా కొరుకుతూనూ. వాళ్ళు చేసే మొదటి పని చప్పట్లు కొట్టి వెచ్చని బట్టలు తెప్పించుకోవడం. తరువాత గొడవ పడ్డం మొదలుపెడతారు. ఝుండి అన్నది తప్పు పేరన్నది అర్థమౌతుంది. “సరే, హుండి” అంటాడు గూపీ. మరుక్షణంలో వాళ్ళు ఓ ఎడారిలో ఉంటారు, వాళ్ళు వేసుకున్న దుస్తులు చంపేస్తూ ఉంటాయి. అవి విప్పేసి విసిరేస్తున్నప్పుడు ఇద్దరికి సరైన పేరు గుర్తు వస్తుంది – “శుండి”.

ఇందులోని మొదటి కొన్ని సీనులు బిర్బూం జిల్లాలోని నోతున్ గ్రాం లో తీసాము. ఇందులో గూపీ బాఘా కలిసి భోంచేయడమూ, ఉస్తాద్,అతని పరివారం రావడం, “ఝుండి” అంటూ మొదటి సారి చప్పట్లు కొట్టడమూ – ఈ సీనులు ఉన్నాయి. ఈ చప్పట్లు కొట్టగానే ఇద్దరూ మెల్లిగా పైకి ఎగురుతూ గాల్లోకి మాయమవాలి. ఇది జరగడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎనిమిదడుగుల ఎత్తున్న వెదురు మచాన్ తయారుచేసి దాని కింద కెమెరా పెట్టాము. గూపీ,బాఘాలని నిచ్చెన సాయంతో మచాన్ పైకి ఎక్కి దూకమని చెప్పాము – అప్పుడు కెమెరా ముందు పడతారని. ఈ షాటు తీస్తున్నప్పుడు కెమెరా ఫిల్మ్ వెనక్కి నడిచేలా చూసుకున్నాము. అప్పుడిది మళ్ళీ మామూలుగా చూసినప్పుడు స్క్రీన్ పై ఉన్న బొమ్మలు కెమెరా తీసిన వరుసతో పోలిస్తే ముందునుండి వెనక్కి వస్తాయని మాకు తెలుసు. అంటే, ఈ రెండు పాత్రలూ కిందకి పడుతున్నట్లు కాక, పైకి ఎగురుతున్నట్లు కనిపిస్తారు అనమాట.

తరువాతి దృశ్యంలో వాళ్ళు నదికి దూరంగా, వాళ్ళ ఊళ్ళోని చెట్లూ పొలాలకి దూరంగా మంచు చుట్టుముట్టిన ఓ ప్రదేశంలో ఉంటారు. ఇంత మంచు ఇచ్చే ప్రదేశమేది? తరువాత మాకు తెలిసింది ఫిబ్రవరి నెలలో సిమ్లా వెళితే కావాల్సినంత మంచు మిగిలే ఉంటుందని. సిమ్లాకి ఎనిమిది మైళ్ళ దూరంలో ఇంకో వెయ్యి అడుగుల ఎత్తులో ఖుఫ్రీ అన్న ప్రదేశం ఉంది. ఇక్కడ ఇళ్ళూ, మనుష్యులున్న ఛాయలూ లేవు. ఉన్నదల్లా ఉత్త మంచే. గూపీ-బాఘాలతో ఇక్కడ కొన్ని దృశ్యాలు తీద్దాం అనుకున్నాం. దానితో కలకత్తానుండి ఢిల్లీ గుండా సిమ్లా చేరుకున్నాం. మా జట్టులో కొంతమంది ఢిల్లీలోనే ఉండిపోయారు, ఎందుకంటే మేము వెనక్కిరాగానే మేము ఎడారి సన్నివేశాలకోసం రాజస్థాన్ వెళ్ళాలి- శుండీ,హల్లా రాజ్యాలకి సంబంధించిన దృశ్యాలు తీయడానికి. సిమ్లా-ఖుఫ్రీ వచ్చిన గుంపు చాలా చిన్నది -ఇద్దరు నటులూ కలిపి కూడా పదిమందికి మించరు.

నేను ఇదివరలో సిమ్లా వెళ్ళాను కానీ వేసవిలో. ఇప్పుడు ఆ ప్రదేశమంతా గుర్తు పట్టడం కష్టంగా ఉంది. నగరమంతా చర్మ వ్యాధి వచ్చినట్లు ఎటు చూసినా తెల్ల తెల్ల మచ్చలతో ఉన్నట్లు అనిపించింది. ఎక్కడ చూసినా తెల్లటి మంచు-ఇళ్ళపైనా, వీథుల్లో,కొండలపైనా, ఆఖరుకి చెట్ల కొమ్మలపైన కూడా! అక్కడక్కడా వీథుల్లోని మంచు కరగడం మొదలైంది. దానితో అక్కడంతా జారడం ఎక్కువగా ఉంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. మాకు ఎక్కువ సమయం లేదు కనుక భోజనం చేయగానే టాక్సీ తీసుకుని ఖుఫ్రీలో సరైన ప్రదేశాన్ని అన్వేషిస్తూ బయలుదేరాము. తరువాతి రోజు మా సరంజామా అంతా తీసుకుని ఇక్కడికి రావాలి. కెమెరాతో పాటు ఎనిమిదడుగుల మచాన్ ఒకటి. ఇది వెదురుది కాదు. స్టీల్ తో చేసినది. ఈ దృశ్యం చివర్లో కూడా గూపీ,బాఘా పైకి ఎగురుతున్నట్లు కనిపించాలి. కనుక, వాళ్ళిద్దరూ ఇంకోసారి పైన్నుంచి దూకడం తప్పనిసరి.

ఎనిమిది మైళ్ళే అయినా ఖుఫ్రీ చేరుకోడానికి దాదాపు గంటపట్టింది మాకు. మేము వెళ్ళిన రోడ్డులో ఎనిమిది అంగుళాల మేర మంచు పేరుకుని ఉంది. పర్వతం పక్కన ఉండటంతో ఎన్నో మలుపులు రోడ్డుపై. మా టాక్సీ చక్రాలు ఈ మంచుని కోస్తూ వెళ్ళాలి. అప్పుడప్పుడూ చక్రాలు ఎంత లోతుకి వెళ్ళాయంటే ఎంత వేగంగా తిరిగినా కూడా మంచు అన్ని వైపులా పడ్డదే కానీ టాక్సీ మాత్రం ముందుకు కదల్లేదు. ఆకాశం ఓ పక్క మేఘావృతమై ఉంది కానీ, మేము ఖుఫ్రీ చేరే సరికి సూర్యుడు బయటకొచ్చాడు. ఖుఫ్రీ నిజంగా ఓ పల్లెటూరే. చలికాలంలో ఇక్కడికి స్కీయింగ్ కి వచ్చేవారి కోసం సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఒక క్లబ్బు, బంగళా, ఒక రెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. మాకిదంతా వద్దు కనుక జనావాసానికి దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశం కోసం వెదకడం మొదలుపెట్టాము. అది మెయిన్ రోడ్డుకి కాస్త దగ్గరగా ఉండాలి – లేకుంటే మా సామానంతా తీసుకుని అక్కడికి వెళ్ళడం అసాధ్యం. మేమొక రెండొందల అడుగులు పైకి ఎక్కి ఓ ప్రదేశాన్ని చేరుకున్నాము. అది మూడు వైపులా బహిరంగ ప్రదేశం. మేము చుట్టుపక్కల చూడగానే దట్టమైన మంచుతో నిండిన పర్వత శ్రేణులు కనిపించాయి. మా కుడివైపుకి ఓ తెల్లటి కొండ. మేము కారు ఆపి బయటకు వచ్చాము. అంత మంచు ఉన్నాకూడా మరీ చలిగా లేదు. నిజానికి సూర్యుడు వచ్చాక చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ.

ఇంతలో మళ్ళీ మంచు కురవడం మొదలైంది, సూర్యుడు ఉండగానే. ఆకాశం నుండి పొడిపొడిగా మంచు రాలడం మొదలైంది. ఎవరన్నా చేయి చాస్తే, కొది నిముషాల్లో చేయి తెల్లగా మారి ఉండేది. మంచు ఎంత నిశబ్దంగా కురిసిందంటే అంతా ఓ విధమైన మిస్టరీలా అనిపించింది. పైగా, మేఘాలైనా లేని ఆకాశం నుండి ఏదో రాలి పడటం చూడటం కాస్త వింతగా ఉండింది. మాకు ఎక్కువ సమయం లేదు. ఆ ప్రాంతాన్ని అన్వేషించడం ప్రారంభించాం. మంచు ఉన్నాకూడా మాకు కావాల్సింది దొరికింది. మాకు సుమారు పదడుగుల ఎత్తులో కొండమీద ఓ సహజ సిద్ధమైన ప్రదేశం ఉంది – గూపీ,బాఘా ఇద్దరూ నిలబడేందుకు. అది చూడగానే నేను నిర్ణయించేసుకున్నాను వాళ్ళిద్దరూ బెంగాల్ లోని పల్లె నుండి సరాసరి ఇక్కడే దిగాలి సినిమాలో అని. చుట్టుపక్కల ఏమీ కనబడ్డం లేదు – మంచూ, దాని మధ్యలోంచి తొంగిచూస్తున్న నల్లటి రాళ్ళూ తప్ప. మాకు సరైన స్థలమైతే దొరికింది కానీ ఇప్పుడు వేరే సమస్య వచ్చి పడింది.

గూపీ,బాఘా ఇంకా వాళ్ళ పల్లెటూరిలోనే ధోతీ కుర్తా వేసుకుని ఓ చిన్న, సన్నటి కాటన్ శాలువా మాత్రం వేసుకుని ఉన్నారు. మంచులో దిగినప్పుడు అవే దుస్తులు వేసుకుని ఉన్నట్లు చూపాలి. కానీ, ఇక్కడ చూస్తే మరీ చల్లగా ఉంది. ఏం చేయాలి? గూపీ, బాఘా పాత్రధారులు ఉత్సాహంగా మాకేం పర్వాలేదు, ఆ బట్టలతోనే మంచులోకి దూకేస్తాం అన్నారు కానీ, మాకది కష్టంగా తోచింది. చివరికి కుర్తా కింద చేతుల్లోని స్వెటర్లు వేసుకోవాలని నిర్ణయం జరిగింది. వాళ్ళ కాళ్ళు కప్పడానికి నైలాన్ దుస్తులని ఉపయోగించాము. ఆ దుస్తుల రంగు వాళ్ళ కాళ్ళ రంగులో కలిసిపోయి కాస్త దూరం నుండి చూస్తే వాళ్ళు అవి తొడుక్కున్నట్లు తెలిసే వీలు లేకపోయింది. ఇవి కాక, కాళ్ళకి ఆ మాయా చెప్పులు ఉన్నాయి. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా చేయించాము వాటిని. ఈ దృశ్యం మరింత బాగా రావాలని మేము ఈ రెండు పాత్రలూ మంచులోకి పడగానే కిందకి దొర్లుతూ పడుతున్నట్లు చూపుదాం అనుకున్నాం. ముందునుండే ఉత్సాహంగా ఉన్న నటులిద్దరూ దీనికి ఒప్పుకున్నారు కూడా. కానీ, నాకు ఈ ఐడియా నచ్చినా కూడా, ఆలోచించేకొద్దీ బెంగ మొదలైంది. ఇదివరలో ఎప్పుడూ వాళ్ళు ఇలా మంచు చేత కప్పబడిన కొండల పైన దొర్లలేదు. ఏమైనా దెబ్బలు తగిలితే? లోపల పైకి కనబడని రాళ్ళూ-రప్పలూ ఉండొచ్చేమో..ఎవరికి తెలుసు? మేము ఇది మాట్లాడుకుంటూ ఉండగా అది విన్న స్థానికుడొకరు వచ్చి అలాంటివేమీ లేవని భరోసా ఇచ్చారు. మేము ఎన్నుకున్న ప్రదేశం అలాంటి రాళ్ళూ-రప్పలకి దూరంగా ఉందని చెప్పాడు. ఆ మనిషి నమ్మకంగా చెబుతూ ఉండటంతో మేము మా ఐడియా అలాగే కొనసాగిద్దామని నిర్ణయించుకున్నాము. కెమెరా సిద్ధమయ్యాక గూపీ,బాఘా కొండ పైకి అక్కడక్కడా కనిపిస్తున్న రాళ్ళ సాయంతో ఎక్కి, వాళ్ళు చేరవలసిన ప్రదేశానికి చేరారు. నేను కెమెరా ఆన్ చేసాను. అక్కడ రిహార్సల్ కి తగిన సమయం కూడా లేదు. మా అదృష్టం బాగుండి ఐదు నిముషాల్లో మాకు కావాల్సిన దృశ్యాలన్నీ తీసేసుకున్నాము. బహుశా సినిమాలో మీరు ఆ ఇద్దరూ మంచుపై దొర్లే దృశ్యం చూసే ఉంటారు. కానీ, తరువాత ఏమైందో మీరు ఊహించలేరు.

Making Movies – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (రెండో భాగం)
Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

మొదటి భాగం ఇక్కడ. రెండో భాగం చదవండి..

థోరట్ దీనికో పరిష్కారం చెప్పాడు -

“పులి మెడచుట్టూ ఓ తాడు వేస్తాను. అది సన్నగా ఉన్నా కూడా బలమైనది.” అని.

“బానే ఉంది కానీ, దానికోసం చాలా పెద్ద తాడు కావాలి.”

“అదేం పెద్ద సమస్యకాదు. అవతలి కొస ను ఒక ఇనుపకడ్డీకి కట్టేస్తాం”.

ఆ తాడు అంత సన్నగా ఉంటే, కెమెరా కళ్ళకి కనబడదేమో. కానీ, ఈ తాడు వల్ల పులి చర్మం పై తేడా తెలిసిపోతుంది కదా. కాస్త ఆలోచించాక ఓ ఆలోచన వచ్చింది.

“పులి చర్మంతో చేసిన బెల్టు ఒకటి దాని మెడకి వేసి, ఆ బెల్టుకి ఈ తాడు చుడితే ఎలా ఉంటుంది?” అని అడిగాను. థోరట్ ఒప్పుకున్నాడు. అంతా పదినిముషాల్లో తేలిపోయింది. థోరట్ కి ఓ తేదీ చెప్పాము – శియురి కి రావడానికి. కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చాము.

“ఏం దిగులు పడకండి సార్. అంతా బానే జరుగుతుంది.” థోరట్ ధీమా వ్యక్తం చేసాడు. మేము మేనేజర్ కి ధన్యవాదాలు తెలుపుకుని బయలుదేరాము. అక్కడ్నుంచి వచ్చేసేముందు మేనేజర్ ఒక విషయం అడిగాడు – “సినిమా క్రెడిట్లలో భారత్ సర్కస్ పేరు వేస్తారా?” అని.

శియురి, రామ్పూర్‍ఘాట్ ల వద్ద దృశ్యాలు షూట్ చేసుకుంటూ కొన్నాళ్ళు గడిపాము. గూపీ ఉన్న ఊరు కోసం నోతున్ గ్రాం అన్న ఊరు ఎంపిక చేసాము. అక్కడ్నుంచి సుమారు పదిహేను మైళ్ళ దూరంలో, మయూరాక్షి నది ఒడ్డులో ఒక వెదురుచెట్ల తోట కనిపించింది…గూపీ,బాఘా ల తొలి పరిచయం, ఇంకా పులి ఆగమనం సీన్లు తీయడానికి. ముందురోజు సాయంత్రం థోరట్ కలకత్తా నుండి బయలుదేరాడని, సరైన రోజున షూటింగ్ ప్రదేశం చేరుకున్నాడని మాకు కబురందింది. దాంతో వాళ్ళని కలవడానికి మేము కూడా త్వరగా వెళ్ళాము. మా యూనిట్ లో సుమారు పాతికమంది ఉన్నారు. కొంతమంది ఆ ఊరిజనాలు కూడా మా అనుమతి తీసుకుని మాతో వచ్చారు-పులితో మేమెలా పనిచేస్తామో చూడ్డానికి. లారీలో ఉన్న బోను కప్పేసి ఉంది. మమ్మల్ని చూసిన థోరట్ కవర్ని తీసాడు. అతను తన రెండు పులులనీ తెచ్చాడని అర్థమై ఆశ్చర్యపోయాము మేము. ఎందుకలా చేశాడు? ఒకటి సరిపోయి ఉండేది కదా.. “మన జాగ్రత్తలో మనం ఉందామని… ఒక వేళ ఒక పులి అనుకున్నట్లు చేయకపోతే ఇంకోటి ఉంటుంది కదా అని.” – థోరట్ వివరణిచ్చాడు. నాకు ఇది పెద్దగా నచ్చలేదు కానీ, “రెండోది కూడా సరిగా చేయకుంటే ఏమి చేస్తారు?” అని అడగడానికి ధైర్యం చాలలేదు. దాంతో, నేను ఆయనకి అంతా సిద్ధమయ్యేవరకు ఆగమని మాత్రం చెప్పగలిగాను. నేను ఇదివరలో చూసిన సర్కస్ పులులన్నీ బక్కచిక్కి ఉండేవి కానీ, ఈ రెండూ బాగా పుష్టిగా అనిపించాయి.

కెమరా ని ట్రిపోడ్ మీద పెట్టి దాన్ని వెదురుచెట్ల వైపుకి నిలిపాము. ఇప్పుడు థోరట్ కి సిద్ధమని చెప్పాము. చూస్తున్న జనాలని కెమెరా వెనక్కి వెళ్ళి వీలైనంత దూరంగా నిలబడమని చెప్పాము. మేము అక్కడే దగ్గర్లోనే ఉన్నాము. గూపీ, బాఘా కెమెరాకి సమీపంలోనే ఉన్నారు-ఎందుకంటే, కనీసం ఒక దృశ్యం అన్నా ఉండాలి కదా వారికి, పులితో. ఇలా మా ఏర్పాట్లలో మేముంటే థోరట్ మనుష్యులు పులి నడవబోయే ప్రాంతానికి సుమారు ముప్ఫై అడుగుల దూరంలో ఒక ఐదడుగుల ఇనుప కడ్డిని నేలలో పాతారు. అరవైశాతం కడ్డీ నేలలో ఉండిపోయింది. తర్వాత ఓ పొడుగ్గా,సన్నగా ఉన్న తాడు తీసుకుని, ఒక చివరని పులి చర్మంతో చేసిన ఓ బెల్టు కీ, మరో చివర ఈ ఇనుపకడ్డీకీ కట్టారు. ఆ బెల్టుని పులి ధరించింది. మేము సిద్ధమయ్యాము. ఆ రెండుబోన్లలో ఒకదాని తలుపు తెరిచారు. థోరట్ పులిని పిలిచాడు. అది వెంటనే స్పందించి ఖాళీ స్థలంలోకి దూకింది. తర్వాత జరిగింది మేమెవరం ఊహించనిది. థోరట్ మొహంలోని ఆ ఆశ్చర్యాన్ని, నిస్సహాయతనీ చూస్తేనే అర్థమైంది అతను కూడా మాలాగే ఆశ్చర్యంలో ఉన్నాడు అని. ఏదో నెమ్మదిగా,రాజసంగా నడవడం కాకుండా, అది అత్యుత్సాహంతో గంతులేయడం మొదలుపెట్టింది. ఎగిరింది..దూకింది…అటూ ఇటూ పొర్లాడింది – అంతా తన గురువు గారిని లాక్కుంటూ. థోరట్ దానికి కట్టిన తాడుని వదల్లేదు…ఎప్పటికైనా దాన్ని మళ్ళీ స్వాధీనంలోకి తేవాలని. మేము పిచ్చివాళ్ళలాగా చూస్తూ నిలబడ్డాం – ఇదొక కొత్త తరహా ఉచిత సర్కస్ అన్నట్లు! కెమెరా ఇంకా ఆన్ చేసే ఉంది, చెట్ల వైపుకి చూస్తూ. కానీ, ఈ పులి వాలకం చూస్తే అక్కడికి వచ్చే సూచనలేం లేవు.

సుమారు ఐదునిముషాల “పిచ్చి” తరువాత పులి చివరికి కాస్త మెత్తబడింది. థోరట్, అతని సహాయకులను చూస్తే జాలేసింది. రింగ్-మాస్టర్ ఎండిపోయిన పెదాల మధ్య నుండి ఈ పులి ఎప్పుడూ ఇలాంటి చోటుకి రాలేదనీ, అది సర్కస్ లోనే పుట్టి పెరిగిందనీ, బోను నుంచి బయటకు వెళ్ళిందే చాలా తక్కువనీ, ఉన్నట్లుండి ఈ సహజ వాతావరణంలోకి వచ్చేసరికి కాస్త ఉద్రేకపడిందనీ -ఓ వివరణ వచ్చింది. పులి కాస్త మెత్తబడ్డాక మాకు కావాల్సిన సీనులు తీసుకున్నాము. కానీ, ఇప్పుడో కొత్త సమస్య. బోను తలుపులు తెరిచి ఉన్నాయి. లారీ దగ్గర ఒక స్టూల్ వేసి ఉంది. ట్రైనర్ వెళ్ళమనగానే పులి ఆ స్టూల్ మీదకి ఎక్కి బోనులోకి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ తలుపు మూసేస్తారు. కానీ, థోరట్ “వెళ్ళు” అని అరిచాక కూడా ఆ పులి అతన్ని పట్టించుకోలేదు. దానికి అక్కడ కూర్చుని ఆకులు నమలడం బాగా నచ్చినట్లుంది బోనులో కూర్చోడం కంటే. థోరట్ కి ఇది పూర్తి కొత్తగా ఉంది. కానీ, పులి ప్రవర్తన మా ఆందోళనను దూరం చేసింది. వెదురు చెట్ల ఆకులు తినే పులి అయితే మనుష్యుల్ని తినదు కదా. నేను కెమెరాని పులికి కాస్త దగ్గరగా తీసుకెళ్ళి ఈ వింత ప్రవర్తనని షూట్ చేసాను. కానీ, ఇంతలోనే ఉన్నట్లుండి, కెమెరా ఇంకా తిరుగుతూ ఉండగానే పులి గబుక్కున లేచి ఒక్క దూకులో వెళ్ళి బోనులో కూర్చుంది. లారీకీ వెదురుచెట్లకీ మధ్య ఉన్న సుమారు అరవై అడుగుల దూరాన్ని సుమారు ఒక సెకనులోనే దూకేసింది.

ఇక్కడితో కథ ముగిసి ఉండాలి కానీ, మేము కలకత్తా వెళ్ళిపోయి ఈ సీన్లను వేసి చూసుకుంటే కెమెరా సరిగా పనిచేయలేదు అని అర్థమైంది. దృశ్యాలన్నీ ఎంత చీకటిగా ఉన్నాయంటే పులి కూడా ఆకులూ,చెట్లలో కలిసిపోయినట్లు అనిపించింది కొన్ని చోట్ల. ఇప్పుడేం చేయాలి? మేము ఓడిపోయామని ఒప్పుకుని ఈ సీన్లు తీసేయాలా సినిమా నుండి? వీల్లేదు. భారత్ సర్కస్ ఇంకా కలకత్తా లోనే ఉంది. మేము మళ్ళీ వెళ్ళి థోరట్ తో మాట్లాడాము. ధైర్యం గల మనిషి – మళ్ళి ప్రయత్నించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మంచి విషయమేమిటంటే వీళ్ళు శియురీ దాకా రానక్కరలేదు. కలకత్తా దగ్గర్లోని బోరాల్ అనే పల్లెటూరిలోనే మాకు కావాల్సిన వెదురు పొదల్ని కనిపెట్టాము. పథేర్ పాంచాలీ చాలా భాగం బోరాల్ లో తీసినందున అది మాకు బాగా పరిచయమైన ప్రదేశమే. అపూ, దుర్గా, ఇందిర థాకురన్ – వీళ్ళతో చాలా దృశ్యాలు తీసాము అక్కడ. ఇప్పుడు మాతో గూపీ, బాఘా, పులిగారు ఉంటారు. మరోసారి లారీ వచ్చింది – థోరట్, పులి, తాడు, ఇనుప కడ్డీ, ఆ తోలు బెల్టులతో సహా. మళ్ళీ ఈ లారీతో ఆ పల్లె పల్లెంతా కదిలొచ్చింది. ప్రతి ఒక్కరూ – చిన్నా పెద్దా తేడా లేకుండా షూటింగ్ చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. గతంలో పులితో కలిగిన అనుభవం ఇంకా మా అందరి జ్ఞాపకాల్లో కొత్తగానే ఉండటంతో మేము ఆ పల్లెజనాలకి కెమెరా దగ్గరికి రావద్దని చెప్పాము. కనీసం డెబ్భై అడుగుల దూరంలో నిలబడమని చెప్పాము-ఏం జరుగుతోందో సరిగా కనబడకపోయినా కూడా. సినిమా రిలీజైతే ఎలాగో తెలుస్తుంది ఏ సీనులు తీస్తున్నామో. కానీ, ఎవరూ చెప్పింది వినలేదు. జనమంతా కెమెరాకి వీలైనంత దగ్గరగా నిలబడ్డారు. మేము ఇక వీళ్ళకి వివరంగా చెప్పడంలో సమయం వృధా చేసుకోదల్చుకోలేదు. అందుకని కెమెరా సిద్ధం చేసుకుని థోరట్ కి సంకేతం అందించాము. గూపీ,బాఘా వాళ్ళ స్థానాల్లోకి వచ్చారు. థోరట్ బోను తలుపులు తెరిచాడు.

తర్వాత జరిగింది ఇంతకు ముందు కనీవినీ ఎరుగనిది. ఆ తలుపు తెరిచిన క్షణంలో పులి పెద్దగా అరుస్తూ బయటకు వచ్చి సరాసరి కెమెరా వెనుక నిలబడ్డ పల్లెప్రజల వైపుకి వెళ్ళింది. మొదటిసారి మేము పులి అరసెకను కాలంలో అడవిలోంచి బోనులోకి వెళ్ళిపోవడం చూసాము. ఇపుడు మా కళ్ళముందే దాదాపు నూటయాభై మంది ఏదో మంత్రం వేసినట్లు మాయమైపోయారు. నిజంగా, ఓ క్షణంలో అంతా ఉన్నారు. మరు క్షణంలో ఎవరూ లేరు. పులి మరీ దూరం వెళ్ళలేదు. దాని శిక్షకుడు తాడు పట్టి లాగి దాన్ని వెనక్కి తెచ్చేసాడు. కానీ, ఇది ఎవరూ ఊహించలేదు. మెరుపు వేగంతో అంత మంది మనుష్యులు మాయమవడం గానీ, వాళ్ళ కళ్ళలోని భయం కానీ – నేను బహుశా మర్చిపోనేమో. వింత ఏమిటంటే, ఈ శక్తి ప్రదర్శన తరువాత పులి త్వరగానే మెత్తబడింది. చెప్పింది వినే పిల్లవాడిలాగా చెప్పిన ప్రదేశంలో నడిచి, మళ్ళీ శిక్షకుడివైపు నడిచి వెళ్ళిపోయింది. ఈసారి కెమెరా కూడా సరిగానే ఉంది అన్న విషయం మాకు రెండ్రోజుల తర్వాత కలకత్తా తిరిగి వచ్చి ఈ సీన్లు వేసుకుని చూస్తూ ఉంటే తెలిసింది.

మేకింగ్ మూవీస్ – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (మొదటి భాగం)
Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

జంతువులని పెట్టి సినిమాలు తీయడంలో హాలీవుడ్ కి సాటిలేదు. నా చిన్నప్పుడు సినిమాల్లో రిన్‍టిన్‍టిన్ అనే అల్సేషన్ ఉండేది. సుమారు సినిమాలు ఉన్నాయి ఇవి. ఆ కుక్క నటన మనిషి నటనకన్నా కూడా ఆకట్టుకునేది. తరువాత కోలీ జాతి కుక్క అయిన లాసీ నటించిన మూడు నాలుగు సినిమాలు చూసాము. ఆ దర్శకుడు లాసీ చేత ఏదైనా చేయించగలడు అనిపించింది. ఈ శిక్షణ పొందిన కుక్కలకి కూడా ఓ స్టార్ ఇమేజీ ఉండేది. అవి సంపాదించే డబ్బు నిజజీవితంలో ఫిల్మ్ స్టార్ సంపాదనకి ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒక సినిమానుంచే వాటి యజమానులు చాలా తేలిగ్గా కనీసం లక్షరూపాయలన్నా సంపాదించేవారేమో. ఈ జంతువులని ఎంత గౌరవంగా చూస్తారో హాలీవుడ్ లో నేను డిస్నీ స్టూడియో లో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఓ షూటింగ్ చూసినప్పుడు అర్థమైంది నాకు. ఆ సినిమాలో ముఖ్య పాత్ర ఓ పెద్ద కుక్క – అమెరికాలో షాగీ డాగ్ అంటారు. నేను స్టూడియో చేరేసరికి ఇంకా షూటింగ్ మొదలవలేదు. కెమరామెన్ లైట్లు సిద్ధం చేసుకుంటున్నాడు. సాధారణంగా ఈ సమయంలో నటవర్గం కూడా ఉంటారు – కెమరామెన్ కు తాము ఎలా నడుస్తారు, ఆ సీనులో ఎక్కడ నిలబడతారు వంటివి చూపడానికి. పెద్ద పెద్ద తారలకి ఈ పనిని వాళ్ళ బదులు వాళ్ళ stand-ins చేస్తారు. అంటే, భౌతికంగా ఆ తార వంటి స్వరూపం కల వారు. అసలు తారలు మాత్రం లైట్లు రెడీ అయ్యాక షాటుకి ముందు వస్తారు. ఈ డిస్నీ స్టూడియోలో కొందరు నటులు సెట్ల మీద కదులుతూ ఉంటే, ఒక వైపు మన హీరో-ఈ కుక్క..నిశ్శబ్దంగా నిలబడి ఉన్న విషయం నేను గమనించాను. కెమెరామెన్ అందర్నీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లోకి రమ్మని అరిచాడు. కానీ, ఈ కుక్క కదల్లేదు. నాకు అర్థం కాలేదు. ఒక వేళ తరువాతి షాటుకి అది అవసరంలేదేమో? నేను ఎవరినన్నా అడుగుదాం అనుకునేలోగానే అక్కడో వింత జరిగింది. ఎక్కడ్నుంచో ఓ చిన్న మరుగుజ్జు వచ్చాడు. అతని వెనుకే బాగా బొచ్చు ఉన్న కుక్క చర్మాన్ని పట్టుకుని మరో మనిషి. తరువాత, నా ఆశ్చర్యానికి అవధుల్లేవు – ఆ మరుగుజ్జు నాలుగు కాళ్ళమీద ఆ నేలపై గీసి ఉన్న గుర్తుల వెంట ఆ కుక్క చర్మం కప్పుకుని ఓ జంతువు నడిచినట్లే నడిచాడు. అలా ఒక చోటినుండి మరో చోటికి నడుస్తూ ఉంటే కెమెరామెన్ లైట్లతో బిజీ అయ్యాడు. అప్పుడు అర్థమైంది నాకు – ఆ మరుగుజ్జు ఆ కుక్కకి stand-in గా నియమితుడైన మనిషి అని!!

హాలీవుడ్ సినిమాలోని ప్రతి జంతువూ సుశిక్షితమైనది. ఓ గుర్రానికో, కుక్కకో అలా శిక్షణ ఇప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ, పక్షులకి శిక్షణ ఇవ్వడం గురించి విన్నారా? ఒకటీ రెండూ కాదు -వందలకొద్దీ. సినిమా చరిత్రలో అత్యుత్తమ సస్పెన్స్ సినిమాల సృష్టికర్త అయిన ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ “బర్డ్స్” అన్న సినిమా తీద్దాం అనుకున్నప్పుడు హాలీవుడ్ లో ఇది కూడా సాధ్యమైంది. ఈ కథలో ప్రపంచంలోని పక్షులన్నీ మనుష్యులమీద దాడి చేయడం మొదలుపెడతాయి. హిచ్‍కాక్ కి రకరకాల పక్షులు కావాల్సి వచ్చాయి. కానీ, అన్నిటికంటే పెద్ద సంఖ్య లో ravens కావాల్సి వచ్చాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అంతా ఎక్కడికక్కడ నోటీసులు పంపబడ్డాయి-సుశిక్షితులైన రావెన్లు సుమారు వందదాకా దొరికే మార్గం తెలిసిన వారు దర్శకుడిని సంప్రదించాలి అని. ఎవరో కొద్ది రోజుల్లో జవాబిచ్చారు. అతన్ని పక్షుల్ని పట్టుకు రమ్మంటే దాదాపు వంద పక్షులతో వచ్చాడు. అయితే, ఈ శిక్షణ ఎక్కువ దూరం వెళ్ళలేదు. అంటే, అక్కడ అద్భుతం అనదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. కానీ, సుమారు యాభై రావెన్లు ఒక వరుసలో నిశ్శబ్దంగా చెప్పినచోట నిలబడమని చెప్పగానే నిలబడగలిగితే – అది కూడా చెప్పుకోదగ్గ విషయమే కదా..

మన దేశంలో అయితే, శిక్షణ పొందిన జంతువులని దొరకబుచ్చుకోవడం కష్టం. అయినప్పటికీ బాంబే మద్రాస్ లలో ఏనుగులూ,గుర్రాలూ,పులులతో కొన్ని సినిమాలు తీసారు. వాటి నటన చూస్తే, అవి ఆజ్ఞ ఇస్తే పాటించడానికి అలవాటు పడినవే అని తెలుస్తుంది. బెంగాల్ లో కొన్ని సార్లు తెలివైన పోలీసు కుక్కలు దొరికేవి. ఓపికుంటే, వాటి నుంచి మంచి ప్రదర్శనను రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు – మేము పథేర్ పాంచాలి కోసం బూలో నుంచి రాబట్టినట్టు. ఒక కుక్కతో పని చేయడం – కష్టమేమో కానీ అసాధ్యం కాదు. మీ సినిమాలో పులి కావాల్సి వస్తే ఏమి చేస్తారు? మేము “goopy gyne, bagha byne” సినిమా తీస్తున్నప్పుడు అది కూడా అనుభవించాము. ఆ సినిమా కథ ఇలా ఉంటుంది – గూపీ ని రాజు ఊరు విడిచి వెళ్ళమని శాసిస్తాడు. గూపీ ఓ గాడిదమీద బయలుదేరి ఒక అడవిని చేరుకుంటాడు. రాత్రి అక్కడ గడపాలి. అక్కడ పులి కనబడ్డానికి చాలా అవకాశం ఉంది. కాస్త భయపడుతూ, కాస్త కంగారు పడుతూ, గూపీ తన గాడిదపై నుంచి దిగి గొణిగాడు – “ఇప్పుడు చీకటి పడ్డాక పులి కంటబడితే? గూపీ చనిపోతే?” అని. అతను అడవిలో ఓ దారి కనుగొని దాని వెంట నడుస్తూ ఉంటే అతనికి బాఘా ఎదురౌతాడు. అతను కూడా అడవి వైపుకి వెళ్ళగొట్టబడ్డవాడు. వీళ్ళిద్దరూ మాటామంతీ మొదలుపెట్టగానే ఓ పులిని చూసి ఇక అవాక్కవుతారు. కానీ, ఆ పులి ఊరికే అలా అడవిలో నడుస్తూ ఉంటుంది, వీళ్ళ ఉనికినే పట్టించుకోకుండా. మళ్ళీ వచ్చిన దారి వెంటే వెనక్కి వెళ్ళిపోతుంది.

ఈ సీను గురించి ఆలోచించాక దీన్ని షూట్ చేయాలంటే, పులి కావాలి కద! ఎక్కడ్నుంచి? సర్కస్ లో చూడ్డం అన్నది అన్నింటికన్నా మొదట వచ్చే ఆలోచన. ఆ సమయంలో భారత్ సర్కస్ కలకత్తాలోనే ఉంది. మార్కస్ స్క్వేర్ లో ప్రదర్శనలు ఇస్తూ ఉండింది. తమిళుడైన దాని మేనేజర్ తో మాట్లాడడానికని మేము మనిషిని పంపాము. తరువాత అతన్ని కలవడానికని వెళ్ళాము ఓ ఉదయం. ప్రదర్శనకారులంతా విశ్రమిస్తూ ఉండగా సర్కస్ కు వెళ్ళడం అదే మొదటిసారి నాకు. మేము సరాసరి మేనేజర్ గది…అదే టెంటుకి…వెళ్ళాము. నేను ముఖ్య టెంటుకి మూడు దిక్కులా చిన్న చిన్న టెంట్లు ఉన్నాయని గమనించాను. మేనేజర్ టెంట్ సుమారుగా పెద్దది. లోపల బట్టలూ, వస్తువులూ అవీ..కావాల్సినన్ని ఉన్నాయి. అతను మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మాకందరికి దక్షిణ భారతపు కాఫీ తెమ్మని పురమాయించాడు. అక్కడే గుర్రాలు స్వారీ చేసే అమ్మాయిలూ, ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే వారు – కాఫీ చేసేది వీరే. మేనేజర్ మా రాకకి కారణం విని థోరట్ అన్న ఆయన్ని పిలిపించాడు. అతనే రింగ్-మాస్టరట. అతను కూడా దక్షిణ భారతీయుడే. మంచి శరీరాకృతి, కొంతవరకూ నేపాలీలాగా అనిపించాడు. నలభైకి మించి ఉండకపోవచ్చు వయసు. అతను మాకు అతని మోచేతి మీద ఉన్న గాయాన్ని చూపించాడు – పులి చేసిన గాయం అది!

మేము అతనితో మాకు ఏమి కావాలో చెప్పాము. షూటింగ్ బీర్బూమ్ దగ్గర్లోనీ శియురి లో. మేము పులి ని ఓ వెదురు చెట్ల అడవిలో చూపాలి అని అనుకుంటున్నాము. అది చేయాల్సిందల్లా ఈ వెదురుపొదల మధ్య నుండి ఖాళీ మైదానంలోకి నడిచి వచ్చి, కాసేపు అటూ ఇటూ నడిచి, వీలైతే కెమెరా వైపు చూసి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. “భారత్ సర్కస్ పులి ఈ పని చేయగలదా?” థోరట్ తల ఊపాడు. “మీకు ఎంతకాలం కావాల్సి ఉంటుంది?” మేనేజర్ అడిగాడు. “కొన్ని గంటల షూటింగ్ సమయం. ఇక ఇక్కడ్నుంచి శియురి కి వెళ్ళడానికి,రావడానికి పట్టే సమయం అదనం” – నేను జవాబిచ్చాను. ప్రయాణం రెండ్రోజులకంటే పట్టదు అని తెలిసాక మేనేజర్ ఆ పులిని ఓ బోనులో పెట్టి లారీలో పంపడానికి ఒప్పుకున్నాడు. ఆ రెండ్రోజులూ వాళ్ళు తమ ప్రదర్శనలో ఈ పులి ఉండే అంకం చేయలేరు. ఇదంతా అయాక, థోరట్ లేచి నిలబడి – “రండి, ఓ సారి పులిని చూడండి” అన్నాడు. మేము ఆయన వెంట మేనేజర్ టెంటు వెనుకవైపుకి వెళ్ళాము. మార్కస్ స్క్వేర్ లో ఒక చిన్నసైజు జూ తయారైందని అర్థమైంది మాకు. మా దృష్టిని వెంటనే ఆకర్షించినది హిప్పోపొటమస్. దానికోసం భూమిలో ఓ ట్యాంక్ తవ్వి నీటితో నింపారు. దీన్ని ఆనుకుని ఓ బోను ఉంది, లారీలో. లారీ నుండి ట్యాంక్ వద్దకు ఓ చెక్క ఉంది. సర్కస్ కలకత్తాలో ముగియగానే హిప్పో ఆ చెక్క ఎక్కి బోనులోకి వెళ్ళిపోవాలి, వేరే చోటికి తీసుకువెళ్ళబడేందుకు…వేరే మార్గం లేదు.

అక్కడ ఇంకా వేరే జంతువులు కూడా ఉన్నాయి – ఒక సింహం, ఒక ఎలుగుబంటి ఇంకా కొన్ని జాతుల పులులు. థోరట్ అక్కడున్నా బెంగాల్ పులులని చూపి వాటిలో ఏదన్నా మాకు కావాల్సినప్పుడు శియురి కి తీసుకెళ్ళొచ్చని చెప్పాడు.

“ఈ జంతువుని షూటింగ్లో ఆ పొదల్లో స్వేచ్ఛగా వదిలేస్తే సమస్యలేమీ రావనుకుంటున్నారా?” – అడక్కుండా ఉండలేకపోయాను.

థోరట్ కనుబొమలు ముడిచి, “అంత ఖచ్చితంగా చెప్పలేను. దాన్ని తనకుతానుగా బోను నుంచి బయటపడేలాగ ఎప్పుడూ చేయలేదు నేను. కనుక, నేను చెప్పలేను.” అన్నాడు.

అదేమిటి!! మా ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా? పులితో పాటు దాని ట్రైనర్ ని ఎలా చూపిస్తాము సినిమాలో? గూపీ,బాఘా – పులి పక్కనే ఈ మనిషి కూడా ఉంటే ఇక ఈ ఇద్దర్లో భయం ఎలా కనిపిస్తుంది? లేదు..అలా జరగడానికి వీల్లేదు.

వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు – రెండో భాగం
Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

చివరికి మాకు ఒక మనిషి దొరికాడు కానీ, అతనికి, పాత చూనీబాల్ కూ ముఖంలో పోలికలేమీ లేవు. ఎటొచ్చీ, శరీరాకృతి ఒకలాగే ఉంది-అంతే. ఇక తక్కిన దృశ్యాలన్నీ అతనితో షూట్ చేసాము. సినిమాలో, పాట చునీబాల్ తోటలోంచి బయటకి వస్తున్నట్లు చూస్తారు మీరు. తరువాతి షాటులో చూనీబాల్ ముఖర్జీల గేటు తీస్తూ ఉండటం. అప్పుడు కెమెరా అతని వెనుకభాగాన్ని చూపుతూ ఉంటుంది. చాలా మంది పథేర్ పాంచాలి సినిమాని ఒకటి కంటే ఎక్కువసార్లే చూసారు కానీ, ఈ ఎత్తుని ఎవరూ గమనించినట్లు నాకు తెలియలేదు. ఈ సీన్లు తీస్తున్నప్పుడే మాకు ఇంకో సమస్య ఎదురైంది. మళ్ళీ, ఆ కుక్క బూలోవల్లనే. ఒక సన్నివేశంలో మిఠాయి కొట్టు అతను ఓ చిన్న చెరువు పక్కగా నిలబడి ఉంటాడు. అపూ, దుర్గా ఇద్దరూ దానికి అవతల వైపు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి అతను తెచ్చిన మిఠాయిల వైపు ఆశగా చూస్తూ ఉంటారు. కానీ, అతను “కావాలా?” అని అడిగితే వద్దు అని చెప్పాలి. చూనీబాల్ తరువాత ముఖర్జీల ఇంటి వైపుకి దారి తీస్తాడు. దుర్గా అపూ తో – “పద!” అనగానే, ఇద్దరు పరుగు తీస్తారు. నాకు ఏమనిపించిందంటే, ఈ సన్నివేశం లో కుక్క కూడా వారి వెంట పరుగెడితే బాగుంటుందని. కనుక, మొదటి సన్నివేశంలో అపూ-దుర్గా ఇద్దరూ చునీబాల్ ని గోడ దగ్గర నిలబడి చూస్తూ ఉంటే, కుక్క పక్కనే ఉన్న జామ చెట్టు కింద కూర్చుని ఉన్నట్లు చూపాలి అనుకున్నా. అతను వెళ్ళగానే మొదట దుర్గా, ఆమె వెంట అపూ, తరువాత కుక్కా-పరుగెత్తాలి.

మేము కుక్క యజమానిని పిలిచి అతన్ని కెమెరా వెనుక కుడిపక్కగా నిలబడమని చెప్పాము. “అపూ అతని అక్క వెంట పరుగెత్తడం మొదలుపెట్టగానే నువ్వు నీ కుక్కని పిలువు… అలా పిలిస్తే అది వస్తుందంటావా?” అని అడిగాను. అతను నవ్వి, “వస్తుందండీ…మీక్కావాలంటే పరీక్షించుకోండి” అన్నాడు ధీమాగా. మేము ఒక రిహార్సల్ వేసుకున్నాము. అంతా బాగా జరిగింది. అతను పిలవగానే కుక్క పరుగెత్తింది. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు అనుకున్నాము. ఇక నేను షాటు తీయడం మొదలుపెట్టాను. దుర్గ పరుగెత్తడం మొదలుపెట్టింది. అపూ కూడా మొదలుపెట్టాడు. కుక్క యజమాని దాన్ని పిలవడం మొదలుపెట్టాడు. ఒకసారి..రెండు సార్లు..మూడుసార్లు.. కెమెరా తిరుగుతోంది. మా విలువైన ఫిల్ము వృధా ఐపోతోంది. వెయ్యి అడుగుల ఫిల్మ్ అప్పట్లో దాదాపు నూటాయాభై రూపాయలు. ఈ షాట్లో ఇప్పటికే సుమారు పది రూపాయల విలువున్న ఫిల్మ్ ఉపయోగించాము. కానీ, ఆ కుక్క ఊరికే తన యజమానివంక చూసి తల పక్కకి తిప్పుకుంది…ఒక్క అంగుళం కూడా కదల్లేదు. కట్! కట్! కట్!

వెంటనే కెమెరా ఆపేసాము. అయినా ఆ కుక్క కదల్లేదు. పాపం దానికి తెలీదు మా ప్లాన్లన్నీ అది ఎంత పాడుచేసిందో. కానీ, మేము ఈ విషయం వదిలేయలేకపోయాము. సన్నివేశం బాగా రావాలంటే, ఈ కుక్క నిజంగానే అపూ-దుర్గాల అపురూపమైన బూలో లాగా అనిపించాలి కదా. ఇప్పుడు నమ్మశక్యంగా లేకున్నా కూడా, ఆ తెలివితక్కువ,సోమరి కుక్క ఆ రోజు పదకొండు టేకుల దాకా స్వాహా చేసి, వెయ్యి అడుగుల ఫిల్మ్ తినేసింది. పన్నెండో టేకులో అంతా సవ్యంగా జరిగింది. మిగితా దృశ్యాలు ఆ మిఠాయికొట్టతను తోటలోంచి నడవడం, అతని వెంటే అపూ, దుర్గా, కుక్కా ఒకళ్ళవెనుక ఒకళ్ళు ఒకటే వరుసలో వెళ్ళడమూ. సినిమా చూసినవాళ్ళెవరూ ఆ కుక్క అలా అనుభవమున్న నటుడిలా చేయడం వెనుకున్న కారణం తెలుసుకోలేకపోయారు. అసలు విషయమేమిటంటే, దుర్గ తన చేతులు వెనక్కి కట్టుకుని నడుస్తున్నప్పుడు ఆ చేతుల్లో ఓ మాంసం ముక్క ఉండటమే!!

డబ్బుల్లేకపోవడంతో వర్షం సన్నివేశాలు తీయలేకపోయాము. వానలొచ్చేసి వెళ్ళాయి కానీ, డబ్బుల్లేవు కనుక మేమేమీ చేయలేదు. మళ్ళీ డబ్బు పోగయ్యేలోపు అక్టోబర్ వచ్చేసింది. అక్టోబర్ ఎండలో నేను నా యూనిట్ వారితో, అపూ-దుర్గలతో కలిసి, సరంజామా అంతా తీసుకుని ఆ పల్లెకి షూటింగ్ కి వెళ్లాను… వర్షం రావాలన్న ఆశతో. ఆకాశంలో ఓ చిన్ని నల్ల మేఘం కనబడ్డా కూడా మేము నోరు తెరిచ్ చూసేవాళ్ళం – ఏదో అద్భుతం జరిగి అది ఆకాశమంతా వ్యాపించి కిందకి కురుస్తుందేమో అని. చివరికి, ఒక రోజు మా ప్రార్థనలు ఫలించాయి. ఆకాశమంతా దట్టంగా మేఘాలు కమ్మి పెద్ద వర్షం పడింది. దుర్గా పరుగెత్తుకుంటూ వెళ్ళి తన తమ్ముణ్ణి కలిసింది చెట్టు కింద. ఇద్దరూ కాస్త నీడకోసం వెదుక్కుంటూ, ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకూంటూ ఉన్నారు. వర్షం ఆగుతుందేమో అని పంటిబిగువున ఓ పిల్లల పాట పాడింది – “ఓ నిమ్మ ఆకులూ, పళ్ళూ-ఫలాలూ…ఈ వర్షం ఓసారి ఆగిపోనీ” అని. ఆరోజు చాలా చలిగా ఉండింది. నేను కెమెరాలోంచి ఓ ఆల్కాథీన్ షీట్ కింద నిలబడి చూస్తూ ఉన్నా – పై భాగం లో ఎలాంటి ఆచ్చాదనా లేని అపూ శరీరం వణుకుతూ ఉండింది. షాట్ ఐపోగానే పిల్లలిద్దరికీ వేడి పాలు – ఓ చుక్క బ్రాందీ కలిపి ఇచ్చాము. చలికి వణికి, వానకి తడిసిన వాళ్ళ శరీరాల్లోకి కాస్త వేడి రావాలని. ఆ సీను చాలా బాగా వచ్చింది. ఆ సినిమా చూసిన వాళ్ళెవరైనా ఆ విషయం ఒప్పుకుంటారు.

పథేర్ పాంచాలి తీయడానికి బోరాల్ సరైన స్థలమని అర్థమైంది మాకు – అపూ-దుర్గల ఇల్లు, అపూ స్కూలు, పొలాలు, వాగులు, వెదురు చెట్లు, మామిడి తోటలు – బోరాల్ మరియు దాని చుట్టుపక్కల ప్రదేశల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే అక్కడ విద్యుత్తు ఉంది, రోడ్లేసారు, ఇళ్ళన్నీ సిమెంటు-ఇటుకలతో కట్టి ఉన్నారు కానీ, అప్పట్లో పరిస్థితి అలా కాదు. మేము చాలా సార్లు ఈ పల్లెకి వస్తూ పోతూ ఉండటంతో అక్కడి కొందరి నివాసులతో బాగా పరిచయం ఏర్పడింది. వీళ్ళలో సుబోధ అనే వాడు కాస్త విచిత్రమైన మనిషి. అరవైల్లో, బట్టతలతో ఉండే సుబోధ ఓ చిన్న గుడిసెలో ఒక్కడే ఉండేవాడు. ఎప్పుడూ తనలో తానే గొణుక్కుంటూ వాళ్ళింటి బయట కూర్చుని కనిపించేవాడు. అతనికి మొదటి మేము అక్కడ సినిమా తీద్దామని వచ్చాము అని తెలిసిన రోజు ఆ విషయం నచ్చలేదు. మమ్మల్ని చూసిన మరునిముషం లో అరిచేవాడు – “సినిమావాళ్ళు వచ్చేసారు..మీ బరిసెలు తీసుకుని దాడి చేయండి” అని. అతనికి కాస్త మతిస్థిమితం లేదు అని చెప్పుకుంటారని మాకు తరువాత తెలిసింది. అయితే, కాలం గడిచేకొద్దీ అతనితో మాకు స్నేహం కుదిరింది. ఒక్కోసారి మమ్మల్ని అతని ఇంటి ఆవరణలో కూర్చోబెట్టుకుని తన వయొలిన్ పై పాత జాతరల నాటి సంగీతం వినిపించేవాడు. అప్పుడప్పుడు అతని మొహాన్ని నా చెవికి దగ్గరగా తెచ్చి – “అక్కడ సైకిల్ లో వెళుతున్నాడు చూసావా….అతనెవరో తెలుసా? రూజ్వెల్ట్. పెద్ద వెధవ” అనేవాడు. మిగితా వాళ్ళు – చర్చిల్, హిట్లర్ లేదా అబ్దుల్ గఫార్ ఖాన్. ప్రతి ఒక్కరూ వెధవే..ప్రతి ఒక్కరూ శత్రువే.

మేము ఉపయోగిస్తున్న ఇంటి పక్కనే ఓ చాకలతను ఉండేవాడు. అతను కూడా కాస్త తిక్కమనిషి. అతనికి కాస్త గొంతు పెంచి – “ప్రియమైన స్నేహితులారా!” అని అరిచే అలవాటొకటి ఉండేది…తరువాత ఓ పేద్ద రాజకీయ ఉపన్యాసం ఇచ్చేవాడు. వేరే సమయాల్లో పట్టించుకునేవాళ్ళం కాదు కానీ, పన్లో ఉన్నప్పుడు అతను మొదలుపెడితే అది మా సౌండ్‍ట్రాక్ ని దెబ్బతీసేది.అతని కుటుంబసభ్యులు సహకరించకపోయి ఉంటే ఇదో సమస్యగా మిగిలిపోయి ఉండేది. మేము ఎంపిక చేసుకున్న ఇల్లు మాకు దొరికే నాటికి చాలా పాడయ్యి ఉంది. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు. ఇంటి యజమాని కలకత్తాలో ఉన్నాడు. అతనికి మేము నెలసరి అద్దె ఇచ్చాము దీన్ని ఉపయోగించుకునేందుకు. అక్కడున్న పిచ్చి చెట్లన్నీ తొలగించి కావాల్సిన రిపేర్లు చేసుకుని మా పని మొదలుపెట్టేసరికి దాదాపు ఓ నెల రోజులు పట్టింది. ఈ ఇంట్లో ఒక వాటాలో వరుసగా కొన్ని గదులున్నాయి. సినిమాలో ఆ వాటా చూపించలేదు. దాన్ని మేము సామాన్లు పెట్టుకోవడానికి వాడుకున్నాము. ఈ రూముల్లోనే ఒక దానిలో మా సౌండ్ రికార్డిస్టు భూపేన్ బాబు ఉండేవాడు. అతన్ని చూడలేకున్నా అతని గొంతు వినిపిస్తూ ఉండేది మాకు. ప్రతి షాటు ముగిసాక – “సౌండ్ ఓకేనా భూపేన్ బాబూ?” అని అరిస్తే అతను జవాబిచ్చేవాడు. ఒకసారి ఇలాగే అరిచిన అరుపుకి జవాబు రాలేదు. నేను మళ్ళీ అరిచాను – “సౌండ్ ఎలా ఉంది భూపేన్ బాబు? ఓకేనా?” ఐనా జవాబు లేదు. “ఏమై ఉంటుంది?” చాలా కుతూహలం కలిగి అతని గదిలోకి అడుగుపెట్టాను. లోపల ఓ పెద్ద నాగుపాము వెనుకవైపు కిటికీల దగ్గర పాకుతూ ఉంది! అది చూసిన భూపేన్ బాబు కి సహజంగానే నోటమాట రాలేదు. నిజానికి మేము పాముని ఇక్కడికి వచ్చిన కొత్తల్లోనే చూసాము. చంపాలనుకున్నాం కానీ, స్థానికులు వద్దన్నారు. అది పాత, ముసలి పాము అనీ, ఆ పాడుబడ్డ ఇంటిని నమ్ముకుని చాలా కాలం నుండీ ఉంటోందని అర్థమైంది. అలాంటి పాముని చంపడం సబబు కాకపోవడమే కాదు…శుభకరం కూడా కాదు అనుకున్నాము.

వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు – మొదటి భాగం
Disclaimer:

The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

పథేర్ పాంచాలీ సినిమా తీయడానికి దాదాపు రెండున్నరేళ్ళు పట్టింది. అంటే, ఆ సమయంలో ప్రతీరోజూ షూటింగ్ చేసామని కాదనుకోండి. అప్పట్లో నేనొక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లో పనిచేసేవాణ్ణి. నాకు సెలవుల్లోనే షూటింగ్ వీలుపడేది లేదంటే పని వేళల్లోనే కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చేది. పైగా, మా వద్ద అంత డబ్బుకూడా ఉండేది కాదు. ఉన్న కాస్తా అయిపోతే, మళ్ళీ డబ్బులు పోగయ్యేదాకా ఎదురుచూడ్డం తప్ప ఇంకేమీ చేయగలిగేవాళ్ళం కాము. అసలు షూటింగ్ మొదలయ్యేముందు అన్నింటికన్నా కష్టమైన పని సరి అయిన నటులని వెదకడం. అపూ పాత్ర వేయడానికి ఆరేళ్ళ పిల్లవాడు దొరకడం మాకు సాధ్యం కాకపోయేసరికి పేపర్లో ప్రకటన ఇచ్చాము.

కోల్‍కతాలోని రాసబిహారీ అవెన్యూలో ఓ గది అద్దెకి తీసుకున్నాము. ప్రతి సాయంత్రం ఆ వయసున్న పిల్లలు వచ్చేవారు మా దగ్గరికి. ఎంతో మందిని చూసాము కానీ, మాకు తగినవారెవ్వరూ దొరకలేదు. ఒకరోజు మెడమీద టాల్కం పౌడర్ చల్లుకున్న కుర్రవాడొకడు వచ్చాడు. నాకెందుకో అనుమానమొచ్చి వాడిని పేరడిగాను. “తియా” – ఆ పిల్లవాడు పీల గొంతుతో జవాబిచ్చాడు. “ఈ జుట్టు ఇప్పుడే కత్తిరించారు కదా?” అని అడిగాను ఆ పిల్లవాడితో వచ్చిన పెద్దాయనతో. అతనికి అర్థమయింది-దొరికిపోయాననీ, నిజం దాచలేననీ. అసలు విషయమేమిటంటే అబ్బాయిగా వచ్చిన మనిషి అసలుకి అమ్మాయి! ఆమె తాలూకా పెద్దాయన ఆమె జుట్టు కత్తిరించి తీసుకువచ్చాడు -ఆమె కి అపూ పాత్ర వేసే అవకాశం వస్తుంది ఏమో అని. మాకు ప్రకటన ఇచ్చాక కూడా ఎవరూ తగిన వాళ్ళు దొరక్కపోయేసరికి మేము దాదాపు ఆశలు వదిలేసుకున్నాము. అప్పుడు, ఒకరోజు కాసేపు ఇంటి మేడపైకని వెళ్ళిన నా భార్య కిందకు దిగి వచ్చి నాతో అన్నది – “పక్కింటి కప్పుపై ఓ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఓసారి అతన్ని పిలవొచ్చుకదా?” అని. చివరికి, ఆ పక్కింటి అబ్బాయే – సుబీర్ బెనర్జీ-అతనే నా సినిమాలో అపూ. మేము సినిమా తీయడం మొదలుపెట్టినప్పుడు అది ఇలా రెండేళ్ళు సాగుతుందని అనుకోలేదు. నెలలు గడిచేకొద్దీ మాలో చింత మొదలైంది – అపూ, దుర్గా ఇద్దరూ తొందరగా పెద్దవాళ్ళైపోతారేమో, అలా అయితే ఆ మార్పులు సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తారేమో అని. కానీ, ఇద్దర్లో ఎవరూ అంత ఎదగలేదు. ఇందిరా థాకురున్ పాత్ర వేసిన ఎనభయ్యేళ్ళ చున్నీబాలాదేవి ఈ షూటింగ్ శ్రమనంతా తట్టుకుని సినిమా తీయడం ముగిసేదాకా బ్రతికుండడం మాకు తెరిపినిచ్చింది.

షూటింగ్ మొదలుపెట్టిన తొలిరోజుల్లోనే మాకొక కష్టమొచ్చి పడింది. చిన్నారి అపూ, దుర్గలను కలకత్తాకి 70 మైళ్ళ దూరంలో ఉన్న బుర్ద్వాన్ దగ్గరి పల్సిత్ అన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాము. అక్కడ రైలు పట్టాల పక్కగా కష్ అన్న రకం పొడవైన గడ్డితో నిండి, బెంగాల్ లో బాగా దొరికే ఒక విధమైన తెల్లటి పూల తోనూ నిండి ఉన్న పెద్ద మైదానాలు ఉన్నాయి. పిల్లలిద్దరు మొదటిసారి ట్రెయిన్ ని చూసే దృశ్యాన్ని ఇక్కడ తీయాలి అనుకున్నాము. అది పెద్ద సీను కనుక కనీసం రెండు రోజులన్నా పడుతుంది అన్ని షాట్లూ తీయాలంటే అని అనుకున్నాము. మొదటి రోజు జగద్ధాత్రి పూజ-సెలవు రోజు. మేం రోజంతా పని చేసి సగం షాట్లు తీసేసుకున్నాము. ఈ సీనులో అపూ-దుర్గా మధ్య చిన్న గొడవ జరుగుతుంది. దుర్గా పారిపోతే అపూ ఆమెని వెంబడిస్తూ ఆ కష్ నిండిన మైదానంలోకి పరుగుతీస్తాడు. యూనిట్ లో అందరూ-డైరెక్టర్, కెమరామాన్, ఈ ఇద్దరు పిల్లలు -అంతా కొత్తవాళ్ళే. జనానికి కాస్త ఇబ్బందిగా ఉండింది అప్పుడప్పుడూ. కానీ, వాళ్ళలో ఉత్సాహానికేం కొదవలేదు. ఆరోజు పని ముగించుకుని మేం కలకత్తా తిరిగి వచ్చాము. ఓ వారం తరువాత మళ్ళీ వెళ్ళాము పల్సిత్ కి. కానీ, నిజానికి అది-ఆ ప్రదేశమేనా? కష్ అంతా ఏమైంది? అసలా ప్రదేశం గుర్తుపట్టలేనట్లు గా ఉంది ఇప్పుడు. అక్కడి జనాల్ని అడిగితే తెలిసింది – అక్కడి ఆవులకి కష్ అంటే చాలా ఇష్టం లాగుంది. ఈ వారంలో అవి మొత్తం గడ్డిని తినేసాయి! ఇప్పుడిక్కడ షాట్లు తీసుకున్నా కూడా పోయినవారం తీసిన వాటికి సరిపోలవు. ఇక, ఆ సీనులోని మిగితా భాగం ఓ సంవత్సరం తరువాత తీయాల్సి వచ్చింది-మళ్ళీ ఆ ప్రాంతమంతా కొత్త కష్ గడ్డితో నిండాక. ఈసారి కొన్ని ట్రెయిన్ షాట్లు కూడా తీసుకున్నాము. కానీ, చాలా షాట్లు ఉన్నాయి-ఒక ట్రెయిన్ సరిపోదు. మూడన్నా కావాలి. రైల్వే టైంటేబుల్ చూస్తే తెలిసింది అక్కడి ట్రెయిన్లు నడిచే వేళలు. మళ్ళీ ఇవన్నీ ఒకే వైపు నుండి రావాలి-ఎదురెదురు దిక్కుల్లో వచ్చే ట్రెయిన్లు మాకు పనికిరావు. మా యూనిట్ లో ఒకరైన అనిల్ బాబు ని స్టేషన్ లో ఉండమన్నాము. అతను డ్రైవర్ తో ఇంజన్ వద్ద కూర్చున్నాడు-ట్రెయిన్ మా వైపు వచ్చేసరికి బాయిలర్ లో బాగా బొగ్గు వేయమనీ. ఇది అవసరం ఎందుకంటే, లేకుంటే పొగ ఎక్కువ రాదు. తెల్లటి కష్ వెనుక నల్లటి పొగని చూపిస్తే కదా ఆ సన్నివేశం హత్తుకునేలా వచ్చేది? సినిమా చూస్తున్నప్పుడు ఆ సన్నివేశంలో – మూడు వేర్వేరు సమయాల్లో వచ్చిన మూడు వేర్వేరు ట్రెయిన్లను ఉపయోగించాము అని కనుక్కోవడం సాధ్యం కాదు ఎవరికీ. అదే సీను ఈ కాలంలో తీయాల్సి వస్తే, ఇప్పుడు అంతా డీజిలో, విద్యుత్తో ఉపయోగిస్తున్నాయి కదా… ఆ షాట్లు అలా తీయగలిగే వాళ్ళమే కాము అసలు.

డబ్బులు ఐపోతూ ఉండడమూ, ఎప్పుడూ మారుతూ ఉండే ఈ షెడ్యూలూ – వీటి వల్ల రకరకాల ఇతర ఇబ్బందులు కలిగాయి. అలాంటి కొన్నింటి గురించి చెబుతాను ఇపుడు. పథేర్ పాంచాలీ నవలలో అపూ-దుర్గల పెంపుడు కుక్క బూలో గురించిన ప్రస్తావన ఉంది. మేమెలాగో ఒక కుక్కను సంపాదించాము. అది మా అందరికీ బాగా మాలిమి అయింది. సినిమాలో ఒక దృశ్యంలో అపూ తల్లి సర్బొజయ అతనికి అన్నం తినిపిస్తూ ఉంటే, బూలో ఇంటి ఆవరణలో కూర్చుని అతన్ని చూస్తూ ఉంటుంది. అపూ చేతిలో విల్లంబులు…అతను వెనక్కి తిరిగి కూర్చుని ఉంటాడు. నిజానికి అతనికి తినాలన్న ఆసక్తి ఉండదు. ఎప్పుడు తనని అమ్మ వదిలేస్తుందా, ఎప్పుడు వెళ్ళి బాణాలతో ఆడుకుందామా..అన్నట్లు ఉంటుంది అతని వైఖరి. తినడం అయ్యేలోపే ఓ బాణం వేసేస్తాడు..దాన్ని తెచ్చుకోడానికి లేచి వెళతాడు. వాళ్ళమ్మ ఓ చేతిలో పళ్ళెం, ఓ చేతిలో గుప్పెడు అన్నం తో అతని వెంట పరుగెడుతుంది. అక్కడ అపూ ఇక తినడు అన్నది ఖచ్చితం. బులో కూడా రెడీ ఔతుంది లేవడానికి. దాని చూపులన్నీ ఆ అన్నం ప్లేటు పైనే. తరువాతి సీను ఏమిటీ అంటే, సర్బొజయ ఆ అనాన్ని చెత్తకుప్పలో పడేస్తుంది, బూలో దానితో పండగ చేసుకుంటుంది. కానీ, ఆ సీను ఆరోజు తీయలేకపోయాము. ఎందుకంటే, వెలుతురు లేకపోవడం ఓ కారణమైతే, జేబులు ఖాళీ అవడం మరోటి. మళ్ళీ డబ్బులు పోగయ్యేసరికి ఆరు నెలలు పట్టింది. అప్పుడు మేము తిరిగి బోరాల్ వెళ్ళాము (ఈ షూటింగ్ జరిగింది అక్కడే) మిగితా దృశ్యాలను తీయడానికి. కానీ, వెళ్ళాక తెలిసింది-బూలో ఇక లేదు అని. ఈ ఆర్నెల్లలో అదెప్పుడో చనిపోయిందట! ఇప్పుడేమిటి చేయడం? అలాంటిదే ఇంకో కుక్క ఉందని అక్కడెవరో అన్నారు. సరే చూద్దామని, మేము ఆ కుక్కని తీసుకు రమ్మని చెప్పాము. మాకు ఈ విషయం చెప్పినతను సరిగానే చెప్పాడు. ఆ రెండో కుక్కకీ బూలో కీ చాలా పోలికలు ఉన్నాయి. దీనికీ దానికి ఒకే రకం చర్మం ఉండటమే కాదు, తోక అంచులో తెల్లరంగు కూడా అలానే ఉంది. చివరికి ఈ “డూప్లికేట్” బూలో నే సినిమాలో సర్బొజయ వెంటవెళ్ళి ఆమె పడేసిన అన్నాన్నంతా గుటకాయస్వాహా చేసే సన్నివేశం లో నటించింది. ఇవి రెండు కుక్కల్ని ఆ సినిమాలో వాడామని చెప్తే కానీ గుర్తించడం కష్టం.

కానీ, ఈ కుక్క కాదు మాకు సమస్య…ఇలాంటి సమస్యే ఒక నటుడితో కూడా వచ్చింది. సినిమాలో ఓ సీనులో చూనీబాల్ అనే మిఠాయి కొట్టు అతని పాత్ర ఉంది. అపూ-దుర్గాలకి అతన్నుంచి ఏమీ కొనే స్తోమత లేదు. కనుక, ఈ సన్నివేశంలో వీళ్ళిద్దరూ అతని వెంటాడి ముఖర్జీల ఇంటికి వెళతారు.. వాళ్ళు మిఠాయిలు కొంటారు అని వీళ్ళకి తెలుసు. దూరం నుంచి ఆ దృశ్యం చూడటంలోనే ఆనందం ఈ పిల్లలిద్దరికీ. అప్పటిలాగే ఇప్పుడుకూడా మా వద్ద సగం సీను తీసేసరికి డబ్బులైపోయాయి. మళ్ళీ షూటింగ్ ప్రారంభించేసరికి చాలా నెలలు గడిచాయి. మేము చివరికి సిద్ధమయ్యేసరికి చూనీబాల్ పాత్ర వేసినతను చనిపోయాడన్న వార్త అందింది. కుక్కల మధ్య తేడాలు పసిగట్టలేరేమో కానీ, ఇప్పుడు చూనీబాల్ లాగే ఉన్న ఇంకో మనిషిని ఎక్కడ్నుంచి తేవడం?