కేట్ చదివించింది
కేట్ విన్‍స్లెట్ గొప్ప అందగత్తె.
ఈ విషయం కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు. ఆనాటి టైటనిక్ నుంచీ ఈనాటి ద రీడర్ వరకూ ఏ సినిమా చూసిన అర్ధం అవుతుంది. కేవలం కేట్ కోసమే సినిమాలని చూసే వాళ్ళున్నారు. సరే అసలు విషయం. కేట్ కేవలం అందమే కాదు. నటనా ఉన్న నటి. (నటించేవారే నటులు అంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలియానా, అనుష్క, త్రిష, జెనీలియా, ప్రియమణి ఎట్సెట్రాదులు కేవలం అందంతోనే నెట్టుకొస్తున్నారు యువరానర్. అందుకే నటన లేక [...]