The Kid (1921)
“ది కిడ్” 1921 నాటి చార్లీ చాప్లిన్ మూకీ సినిమా. అప్పటి సినిమాల్లో అత్యంత ప్రాచూర్యం పొందినవాటిలో ఇదీ ఒకటి. ఇప్పటికీ “ది కిడ్” అభిమానులు చాలా మంది ఉన్నారు. సినిమా విడుదలై తొంభై ఏళ్ళౌతూ ఉంటే ఇంకా ఆ సినిమా పేరు జనాల మధ్య ఉండటం అంటే మాటలు కాదు. అదొక్క విషయం చాలు ఈ సినిమా చారిత్రక విలువను తెలియజెప్పడానికి.
కథ: ప్రేమలో మోసపోయిన ఓ యువతి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బాబునేం చేయాలో [...]