Posts Tagged ‘ french cinema ’


న్యూవేవ్ సినిమా

ఉపోద్ఘాతం
అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి?
నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. [...]