|
బాగలేదు అని చెప్పలేని సినిమా: దేవస్థానం
ప్రస్తుత తెలుగు సినిమా ట్రెండ్ కి భిన్నంగా ఏ మాత్రం స్టార్ లు లేని సినిమా, అదీ కథను నమ్ముకున్న సినిమా రావటం అరుదుగా జరుగుతుంది. కానీ అలాంటి ప్రతి సినిమా శంకరాభరణం కాలేదు. ఇప్పుడు దేవస్థానం పరిస్థితి కూడా అంతే. కే. విశ్వనాధ్, యస్పీబీ, ఆమని వంటి దిగ్గజాలు వున్నారు, మానవ జీవితం గురించి ముఖ్యంగా మానవత్వం గురించి మంచి కథ వుంది – ఇన్ని వున్నా మంచి సినిమా చూశాం అన్న తృప్తిని పూర్తిగా ఇవ్వలేకపోయిన [...] |
|
ఒక “గుప్త దాత” కథ – విక్కీ డోనార్
దానం చేసే దాతల్లో కొంతమంది గొప్పగా చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకుండా గుప్తంగా వుండటానికి ఇష్టపడచ్చు. కానీ చేసిన దానమే నలుగురికీ చెప్పుకోలేనిదైతే ఆ దాత “గుప్త దాత” గా వుండిపోవాల్సిందేనా? అతను చేసిన దానం గురించి తెలిసిన తరువాత అతని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇలాంటి కథాంశంతో రూపొందించిన చిత్రమే విక్కీ డోనార్. ఇంతకీ అతను అంత గుప్తంగా చేసిన దానం ఏమిటనా మీ అనుమానం? అయితే వినండి. విక్కీ ఒక sperm donor. [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Pirates of Silicon Valley
ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసించినవాళ్ళు ఇద్దరున్నారు. స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ అంటే ఏమిటో తెలిసినవాళ్ళకి ఈ పేరు తెలియకుండా వుండే అవకాశమే లేదు. ఆయన పేరు తెలియకపోయినా కనీసం ఐపాడ్, ఐఫోన్ అనే పేర్లు విని వుండకపోతే ఆ వ్యక్తిని సాంకేతిక నిరక్షరాస్యుడని (technology illiterate) ప్రకటించేయచ్చు. బిల్ గేట్స్ కంప్యూటర్ల గురించి తెలియని సాంకేతిక నిరక్షరాస్యుడికి అయినా ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా బిల్ గేట్స్ సుపరిచితుడు. ఇక కంప్యూటర్ అంటేనే విండోస్ అనేంతగా చొచ్చుకుపోయిన [...] |
|
వై దిస్ గోల “వెర్రి” థ్రీ?
గత కొంతకాలంగా వేలంవెర్రిలా పాకిన కొలవెరి పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి పాటను రూపకల్పన చేసినవాళ్ళు తీసిన సినిమా అంటే అంచనాలు వుండటం సహజం. అందునా ఈ మధ్యకాలంలో వైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన తమిళ పరిశ్రమ చిత్రం కావడంతో ఆ అంచనాలు మరో నాలుగింతలయ్యాయి. అయితే నిన్న విడుదలైన “3” చిత్రం ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. గత కొంతకాలంగా తమిళ సినిమాని తెగపొగిడేసిన మా లాంటి వారి కళ్ళు తెరిపించేలా [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Kung Fu Panda
సినిమాల ద్వారా చదువులు చెప్పచ్చని అనగానే అదేదో సీరియస్ సినిమాలతోనే సాధ్యం అని అనుకోకూడదు. సరదాగా సాగిపోయి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాల్లో సయితం ఎన్నో పాఠాలు వుంటాయి. ఎటొచ్చీ అవి తెలుసుకోడానికే కొంత ప్రయత్నం చెయ్యాలి. అలా సరదాగా సాగే పిల్లల సినిమా “కుంగ్ ఫూ పాండా” చిత్రంలో వున్న మేనేజ్మెంట్ పాఠాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం వ్యాసం. కుంగ్ ఫూ పాండా కథ చాలా మందికి తెలిసే వుంటుంది. Underdog తరహాలో సాగే [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 O Clock High
మేనేజెంట్ పాఠాలు నేర్పించే సినిమాలలో గతవారం చర్చించిన 12 Angry Men అత్యంత ప్రముఖమైనది అయితే, ఆ తరువాత చెప్పుకోదగ్గ చిత్రం 12 O Clock High. ఈ రెండు చిత్రాలు 12తో మొదలవటం కేవలం కాకతాళీయమే. పైగా రెండు చిత్రాలు Leadership కి సంబంధించినవి కావటం మరో విచిత్రం. 1949 లో నిర్మాణమైన ఈ War Cinema నాజీలకు వ్యతిరేకంగా అమెరికా వైమానికసేవ చేసిన యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. 918 Bomb Group అనే పేరుగల [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 Angry Men
మేనేజ్మెంట్ పాఠాల చెప్పే సినిమాల గురించి ఎక్కడ ప్రస్తావించినా ఈ సినిమా పేరు వినపడకుండా వుండదు. ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్లలో, వర్కషాప్ లలో, ఎంబీయే కాలీజీలలో ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా ప్రదర్శించడం నాకు తెలుసు. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతూనే, అంతర్లీనంగా Leadership పాఠాలు బొధించే ఈ సినిమాని సాధారణ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా చూసేట్లు వుండటమే అందుకు కారణం అనుకుంటాను. 1957లో నిర్మాణమైన ఈ చిత్రం Reginald Rose రాసిన ఒక నాటకం ఆధారంగా [...] |
|
విద్యా (బాగ్చీ) + విద్యా (బాలన్) = నేషనల్ అవార్డ్… అదీ “కహానీ”
గుప్పిట మూసి వుంచితే మిస్టరీ. అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం థ్రిల్లర్. కాని ఇలాంటి కథల్లో ఒక చిక్కు వుంది. గుప్పిట తెరవగానే అప్పటిదాకా థ్రిల్ కి గురైన ప్రేక్షకులే “ఓస్ ఇంతేనా” అంటూ పెదవి విరిచేస్తారు. లేదా పొరపాటున ఎక్కడైనా Loose Ends దొరికిపోతే “నాకర్థమై పోయిందోచ్” అంటూ అరిచేస్తారు. అలా దొరికీ దొరక్కుండా, విప్పీ విప్పకుండా అనుక్షణం Thrill Ride ఇవ్వగలిగిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ఆణిముత్యం, ఆద్యంతం కట్టిపడేసే [...] |
|
మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు
పాఠం ఎంత గొప్పగా వున్నా, చెప్పడం బాగలేకపోతే ఎలా విసుగనిపిస్తుందో అలాగే ఎంటర్టైన్మెంట్ లేని డాక్యుమెంటరీ కూడా చప్పగా వుంటుంది. ఈ విషయం ఎం.బీ.యే. లాంటి ప్రొఫెషనల్ పట్టా పుచ్చుకున్నవారికీ, తరచూ కార్పొరేట్ ట్రైనింగ్లలో కూర్చునేవారికి ప్రత్యక్షంగా అనుభవం అయ్యే వుంటుంది. అలా బోరు కొట్టే డాక్యుమెంటరీలతో కాకుండా సినిమాల ద్వారానే కార్పొరేట్ పాఠాలు ఎందుకు చెప్పకూడదు? ఒకవేళ అలా చెప్పాలనుకుంటే అలాంటి సినిమాలు వున్నాయా? అన్న ప్రశ్నలకు నేను వెతుక్కున్న సమాధానమే ఈ వ్యాసం. [...] |
|
The Dirty Picture – When Silk is not Silk.
A few weeks ago, I was watching Merchant–Ivory’s early film, Bombay Talkies, starring Sashi Kapoor and Jennifer Kendall. One of the bonus features on the DVD was a documentary, “The Queen of Nautch Girls”, directed and narrated by Anthony Komer, a 30 minute feature on Helen, the original item dance queen. This thoroughly enjoyable, nostalgia [...] |
|
అద్భుతానికి అడుగుదూరంలో “రాక్‌స్టార్”
సినిమా చూస్తున్నంతసేపు ఆహా ఎంత గొప్పగా తీశాడు అని అనిపిస్తుంది. రణ్‌బీర్ నటన చూసినప్పుడల్లా ఇతనిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ఆశ్చర్యమేస్తుంది. కథ, కథనం కొత్తగా కనిపిస్తుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వ ప్రతిభతోపాటు, అతని సినిమాలలో ఎప్పుడూ ఆసక్తికరంగా వుండే హీరోయిన్ కేరక్టరైజేషన్ కట్టిపడేస్తుంది. ఢిల్లీలో మొదలై కాష్మీర్, ప్రాగ్ తదితర ప్రదేశాలలో అందాలు కెమెరా అందంగా పట్టుకుందని తెలుస్తూనే వుంటుంది. ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం ఎప్పటిలాగే వీనులవిందుగా సాగుతుంది. అయితే సినిమా అంతా అయిన [...] |
|
శ్రీరామరాజ్యం
ఈ పోస్టర్ చూశారా ఎంత బావుందో? విశ్వ హిందూ పరిషత్ రాముడి బొమ్మ ఆధారంగా రూపొందించారో లేదో కానీ, ఆ మొహంలో శౌర్యం, నిలబడ్డం లో రాజసం …. అద్భుతంగా రూపొందిన పోస్టర్! ఈ ఒక్క పోస్టర్ చూసి ఆలస్యం చెయ్యకుండా సినిమాకెళ్ళాను. ఇంతకంటే మంచి ఫొటో బాల కృష్ణకు ఇంతకు ముందూ, ఈ తర్వాతా కూడా ఉండబోదు కాబట్టి దీన్ని లైఫ్ సైజ్ చేయించి హాల్లో పెట్టుకుంటే బాగుంటుందని బాలకృష్ణకి నా సలహా! శ్రీరామ రాజ్యం [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |