Menu

Dutch Archive

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి