మనోభావాలు దెబ్బతినడం,ఆత్మాభిమానాలు అనేవి మురికి వాడల వారిక్కూడ వుంటాయి.
ఏందుకో జీర్ణించుకోలేకపోతున్నాను.కడుపు కుతకుత ఉడికిపొతుంది. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా చాలా బావుంది.మనం చూడడానికి నిరాకరించే ముంబాయిని వాస్తవానికి దగ్గరగానే కాకుండా చాలా ఆశావాద దృక్పధంతో చాలా చక్కగా చూపించారు.రెహమాన్ ఎప్పటిలాగే అదిరిపొయే డిస్కొల్లో గెంతులేసేందుక్కూడ పనికొచ్చేల చాల చక్కని సంగీతాన్నిచ్చారు.కాని ఒక్క విషయం మాత్రం అస్సలు సమజ్ కావడం లేదు.
అంతా బాగానే ఉంది. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతి [...]