Tag: "Classical Music In Indian Movies"

గాన గంధర్వుడి గానవర్షం

గాన గంధర్వుడి గానవర్షం

మూడున్నరదాటి పదినిముషాలైనా బస్సు ఇంకా కదలలేదు. వేడిగానేకాదు ఉక్కగా కూడా ఉంది లోపల. ఫిబ్రవరి వచ్చింది కదా మా ఊరికి వేసవి వచ్చేసింది అనుకున్నాను. ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని ఎఫ్ఫెమ్ రేడియో వినడం మొదలుపెట్టా.
“…బాలసుబ్రహ్మణ్యం” అన్నది మాత్రం అర్ధమైంది, ఆ రేడియోజాకీ మాటల్లో. బాలుగారి గాత్రం వినబడడం మొదలైంది. సన్నగా ఏదో రాగాలాపన మొదలైంది. మనస్సులో కాస్త ఉత్సాహం కూడా. పాట మొదలయ్యేప్పటికి బస్సుకూడా కదిలింది. “ఉమండు ఘుమండు ఘన్ గర్‌జే…” అంటూ హిందీలో సాగుతోంది పాట. [...]