|
కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి-పుస్తక పరిచయం
కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.అవాంచనీయ సన్నివేశాల ద్వారా, అశ్లీల సంభాషణల ద్వారా, అసభ్యమైన పాటలు, నృత్యాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులను రెచ్చగొట్టకూడదు. కళాత్మక సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినిమా రంగ ప్రవేశం చేసి, జీవితాంతం అదే మాటపై నిలబడి తను రూపొందించిన చిత్రాలన్నింటిలోనూ ఈ ఉత్తమ విలువలకు స్థానం కల్పించిన మహనీయుడు బి.యన్.రెడ్డి. ఈ సంవత్సరం [...] |
|
వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం
కథాసంగ్రహం: గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘు పట్టభద్రుడు.తల్లిదండ్రుల కట్నం ఆశను ఎదిరించి అతను జానకిని వివాహమాడతాడు. కాపురానికి వచ్చిన జానకిని అత్తగారు అడుగడుగునా ఆరడి పెడుతుంటుంది. నోరులేని మావగారు నిస్సహాయంగా చూస్తుంటాడు. పేదరాలైన జానకి అన్నీ భరిస్తుంటుంది.అత్తింట ఆమెకు భర్త ప్రేమే స్వాంతన. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘుకు ఓ పట్టాన ఉద్యోగం దొరకదు. చివరికి అతను ఉద్యోగాన్వేషణలో బస్తీ బయలుదేరి వెడతాడు. అక్కడ మోసానికి గురవుతాడు. ఇక్కడ జానకికి [...] |
|
నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం
చలనచిత్రాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గ్రహించి, తమ చలనచిత్రాల ద్వారా ప్రేక్షకుల ఉత్తమాభి రుచులను, లలితకళాసక్తిని పెంపొందించి, సంఘంలో ఉన్న దుష్టసంప్రదాయాలకు, ఆవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బి.యన్.రెడ్డి అగ్రగణ్యులు. చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీత, సాహిత్య శిల్పాది లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. అయిదేళ్ళ పిల్లలనుండి వృద్ధుల వరకు, పామరులనుండి పండితులవరకు, మనదేశంలోని అన్ని తరగతుల కుటుంబాలకు అతితక్కువ [...] |
|
షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని – స్వర్గసీమ
నిర్మాణం: వాహినీ ఫిలింస్ కథ:చక్రపాణి స్క్రీన్‍ప్లే:బి.యెన్.రెడ్డి మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు,బాలాంత్రపు రజనీకాంతరావు ఫోటోగ్రఫీ:మార్కస్ బార్ట్లే ఎడిటింగ్:మణి నృత్య దర్శకుడు:వేదాంతం రాఘవయ్య కథాసంగ్రహం: వీధి భాగవతులతో తిరిగే సుబ్బి చాలా అందగత్తె. మంచి మాటకారి కూడా. జీవితంలో చాలా వేగంగా ఎదగాలనే తహతహ వున్నమనిషి. అందలాన్ని అందుకోవడంలో ఎటువంటి మార్గాన్ని తొక్కేందుకయినా వెరవని ఆడది. మగవాడిని తన స్వార్థానికి ఉపయోగించుకుని వదిలేయడంలో అందె వేసిన చెయ్యి. మూర్తి వివాహితుడు.భార్య కళ్యాణి, ఇద్దరు బిడ్డలతోఆనమ్దంగా కాపురం చేసుకుంటున్న [...] |
|
దేవత-కథ,కథనాల్లో వైవిధ్యం
నిర్మాణం:వాహినీ ఫిలింస్ కాలం: 1941 కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ:కె.రామ్‍నాథ్ మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్ ఎడిటింగ్:నారాయణన్ నటీనటవర్గం:నాగయ్య,కుమారి కథాసంగ్రహం: ఇంగ్లండ్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని సొంతవూరు వస్తాడు వేణు . తల్లి, చెల్లెలు సీత ఆనందానికి అవధులు లేవు. లక్ష్మి వాళ్ళింట్లో పనిమనిషి. కానీ, ఇంట్లో వాళ్ళంతా ఆమెను సొంతమనిషిగానే చూస్తుంటారు.లక్ష్మి తమ్ముడు కూడా ఆమెతోటే ఆ ఇంటిలో పనిచేస్తుంటాడు. మద్రాసులో వుంటున్న వేణు మేనమామకు అతన్ని తన అల్లుడిని చేసుకోవాలని ఆశ.అతనికి ఒక్కతే కూతురు. పేరు [...] |
|
అంతర్జాలంలో బి యెన్ రెడ్డి
ఈ నెల ఫోకస్ విభాగంలో బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గురించిన సమాచారం అందించాలన్న ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ నెలలో సాధ్యమైనంత సమాచారం సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక వేళ వీలు కాకపోతే రాబోయే రోజుల్లో కూడా బి యెన్ రెడ్డి సినిమాల గురించి, ఆయన గురించి వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ’కథను గాలికొదిలేసిన తెలుగు సినిమా’ అనే వ్యాసంలో రాజేంద్ర గారు బి యెన్ రెడ్డి గారి ఆలోచనలను పంచుకున్నారు. బియెన్ గురించి అంతర్జాలంలోనూ [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |