|
Werckmeister Harmonies – ఒక చింతన
పరిచయం: నా జీవితంలో చాలా సినిమాలు చూసాను కానీ, కొన్ని సినిమాల గురించి రాయడానికి కొంత ధైర్యం కావాలి; దానికి మించి ఎంతో అవగాహన కావాలి. ఉదాహరణకి, Tarkovsky సినిమాలు. ఇప్పటికి నేను ఆయన సినిమాలు దాదాపు అన్నీ రెండు మూడూ సార్లు చూశాను కానీ ఆ సినిమాల గురించి రాయాలంటే మాత్రం తెల్ల కాగితం పై ఒక్క అక్షరం పెట్టాలన్నా వీలుకాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న ’వర్ణణాతీతం’ అనే పదం ఇలాంటి సినిమాలు చూసినప్పుడే నిజంగా [...] |
|
Damnation
నరక కూపంలాంటి జీవనశైలి కలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తన జీవితాన్ని స్వర్గమయం చేసుకొనే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే అనుభవించే ఒకరకమైన భావనను damnation అంటారు. ఇలాంటి బాధను ఒకసారి రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తే bela tarr తీసిన damnation చూసి ఆ కోరిక తీర్చుకోవచ్చు. స్వార్ధం అనే పదానికి అర్ధంలా కనిపించే Karrer అనే ఒక నిరుద్యోగి కధే ఈ damnation. రోజూ సాయంత్రం ఊళ్ళోని బార్లమీద పడి పీకలదాకా తాగడం, టిటానిక్ [...] |
|
వర్షంలో విహారం – Damnation
పరిచయం: Bela Tarr నా జీవితంలోకి ప్రవేశించి ఆయన సినిమాలతో నన్ను కట్టిపడేసాలా చేసిన సినిమా Damnation. ఇది నేను చూసిన మొదటి బెలా టర్ సినిమా. ఈ సినిమా చూసాకే ఆయన సినిమాలన్నీ వరుసగా చూడడం మొదలుపెట్టాను. ఈ సినిమా అంత గొప్ప సినిమా కాదని Bela Tarr స్వయంగా చెప్పినా నాకు మాత్రం ఆయన సినిమలన్నింటిలో విపరీతంగా నచ్చిన సినిమా ఇది. నేను చదివిన చాలా సమీక్షల్లో ఈ సినిమాలో కథ లేదు అన్న [...] |
|
బెలా టర్ – ఫిల్మోగ్రఫీ
Családi tűzfészek (Family Nest,1977) కమ్యూనిస్టు పరిపాలనలో హంగరీ ప్రజలనుభవించిన కష్టాలను కళ్ళకు కట్టేలా Family Nest చిత్రాన్ని రూపొందించారు. ఇళ్ళు కొరత కారణంగా పెళ్ళై పిల్లలు కలిగిన ఒక భార్యాభర్తల జంట, భర్త తల్లిదండ్రుల ఇంట్లో ఆవాసం పొందాల్సి వస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఎక్కడికో వెళ్తుందని, ఎవరితోనో తిరుగుతుందని తన కొడుకు తలకెక్కిస్తాడు తండ్రి. దీని ఫలితంగా ఆ భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలోని ముఖ్య కథ. Családi [...] |
|
Long Live Cinema
Bela Tarr లాంటి వారు సినిమాకోసమై తమ జీవితాలంకితం చేయబట్టే మంచి సినిమా ఇంకా బతికే ఉంది.కమర్షియల్ ఒరవడీలో కొట్టుమిట్టాడుతున్న సినిమాలు , మార్కెట్ ఎకానమీలో కూరుకుపోయిన మన జీవితాలు ఒకదానికొకటి పొంతన లేకుండా పోయాయి. సినిమా జీవితం యొక్క ప్రతిబింబమవ్వాల్సిన అవసరంలేదు కానీ మనకలివిగాని వేగంతో కరిగిపోతున్న మన జీవితాలని సినిమా రూపంలో పదిలపరిచే బాధ్యత ప్రతి సినిమా దర్శకుని పైనా ఉంది. మూడు సినిమాలు తీసాక కూడా నిర్మాతలు దొరక్క , తన భావాలు [...] |
|
Cinema is Truth 24fps
హంగరీ దేశానికి చెందిన Bela Tarr తన సినిమాల్లో ఎక్కువ నిడివి గల షాట్లు ఉపయోగించి ప్రేక్షకులకు బోరు కొట్టిస్తాడని ఒక అపవాదు వుంది. కానీ నా దృష్టిలో అది కేవలం అపవాదు మాత్రమే. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఒక సీను long shot లో చిత్రీకరించ వచ్చు, లేదా closeup లో చిత్రీకరించవచ్చు. అలాగే ఒక షాట్ long take లో తీయవచ్చు లేదా వివిధ కోణాల్లో, వివిధ పాత్రల points of [...] |
|
బెలా టర్ – ఒక పరిచయం
హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 20 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ గతసంవత్సరం Cannes లో తన సినిమా Man from London ప్రదర్శనతో ప్రపంచం కళ్ళల్లో పడ్డాడు. 1955లో హంగరీ దేశంలో జన్మించిన [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |