Tag: "animation"

రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

మును మాడగాస్కరను పుర
మును, తమ పట్టణపు హొయల ముంచిన వైన
మ్మును గని నగి జనిన జన
మ్ము నుల్లసమున మలి ముంచి ముదమందించే
***
పని తలపెట్టి, కితకితల
పనితనముకు సానపెట్టి, పసతో గురిత
ప్పని హాస్యము సంధించియు,
పనితములయిన పనులన్ సఫలముగ సలిపే
***
నలుగురు ముందు కురికి, కో
నులు కానలు తిరిగి యాతనల బడినా, పి
న్నల పెద్దల కొరకై, చి
న్నెలు చిందించి యలరింప నేర్చిరి భళిరా!
***
మునుపటి స్నేహితుల్ హితులు మూగిరి సాయముసేయ సంబరమ్మున సరి క్రొత్త జంతువుల మూకలు వచ్చెను తోడు సంతసమ్ము నినుమడింపజేయ.
***
“గొప్పమాటలింత లప్పజెప్పుచునుంటి [...]

రాటటూయీ (2007)

రాటటూయీ (2007)

రాటటూయీ అకాడెమీ అవార్డు అందుకున్న యానిమేషన్ చిత్రం. ఇలా చెప్పడం మీలో కాస్త కుతూహలం కలిగించవచ్చు. మినిమమ్ గ్యారంటీ నమ్మకం కలిగించవచ్చు. ఇది పిక్సార్ సంస్థ తీసింది అనగానే యానిమేషన్ ప్రియులకి అయితే, “అయితే ఓకే” అనిపించి ఉంటుంది. అలా అనుకున్నా కూడా, ఎలుకల మీద సినిమా అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇన్నాళ్ళూ చూడలేదు. చివరికి తెగించి చూసాక గానీ అర్థంకాలేదు ఈ సినిమాని వీలుంటే చూసి తీరాలి అని. యానిమేషన్ ఎలుకలకూ, నిజం ఎలుకలకూ చాలా [...]