Posts tagged as: adoor back to homepage

stromboli స్ట్రోంబోలియన్ సినిమా

ముందుమాట: చాలా రోజుల తర్వాత ఈ మధ్యనొకసారి గిరీశ్ షంబు గారి బ్లాగ్ సందర్శించాను. అప్పుడే తెలిసింది ఈ స్ట్రోంబోలియన్ సినిమా గురించి. అసలేంటీ స్ట్రోంబోలియన్ సినిమా అని అర్జంటుగా తెలుసుకోవాలనుకుంటే గిరీశ్ గారి బ్లాగులోని ఈ పోస్టు చదవండి. అర్జంటేమీ లేదనుకున్న వాళ్ళు ఈ వ్యాసం తీరిగ్గా చదవొచ్చు. తీరిగ్గా ఎందుకన్నానంటే ఇక్కడ స్ట్రోంబోలియన్ సినిమాల గురించి కాకుండా చాలా విషయాలను చర్చిస్తూ, కొత్త విషయాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలీ వ్యాసాన్ని నేను గతంలో ఎప్పుడో, [...]

adoor అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం

ప్ర: తిరువనంతపురంలోనా? అడూర్: జోనల్ కార్యాలయం తిరువనంతపురంలోనే కానీ పని కోసం కేరళ అంతా తిరగాల్సి వచ్చేది. పని కూడా ఆసక్తి కరంగానే ఉండేది. ఏమంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాలకి వెళ్ళి, అక్కడక్కడా కొన్నాళ్ళైనా ఉండి వచ్చే అవకాశం అది. ఇలాంటి మారుమూల చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఏదైనా కొట్టు పైన చిన్న గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నెలకి ఆరొందలంటే, మంచి జీతమే. ఒక కాలేజి [...]

adoor3-1 అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం

ప్ర: కళాశాలలో ఉండగా ఎటువంటి నాటికల్లో ఆసక్తి ఉండేది? అడూర్: ఎక్కువ సాంఘికాలే. తొప్పిల్ భాసి, ఎస్సెల్ పూరం ప్రభ్రుతుల నాటికలు వేసేవాళ్ళం. అప్పట్లో చాలా బహుమతులు కూడా సంపాయించాను. గాంధీగ్రాంలో చదువుతుండగా అనియార అని ఒక నాటిక చేశాను. అది ఆ రోజుల్లో నాటికల పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. అదొక తమాషా ఇతివృత్తం. నాటిక వెయ్యడానికి సిద్ధపడుతున్న ఒక ఎమెచ్యూర్ ట్రూపు కథ .. నాటిక అంతా గ్రీన్ రూములో జరుగుతుంది. నాటికలో నాటిక [...]

adoor3 అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం

ప్ర: బహుశా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కావచ్చు. ఒక సాంస్కృతిక బీజం నించి పుట్టిన మర్రి చెట్టు బలంగా వేళ్ళూనుకుని మిగతా చిన్న చిన్న సంస్కృతిక మొక్కల్ని బతకనీయకుండా చేస్తున్నది. అడూర్: అవును. ఇవ్వాళ్ళ మనం డబ్బు తెచ్చి పెట్టేవి మాత్రమే ముఖ్యమైనవని అనుకుంటూన్నాం. ఈ క్రమంలో మన ఉనికినే మనం మర్చిపోతున్నాం. అంతే కాకుండా .. ఈ చిన్న సంస్కృతులు తమని తాము తక్కువగా, కించపరుచుకుంటూ చూసుకునే పరిస్థితి తయారవుతున్నది. వలసవాద పిచ్చి [...]

adoor అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం

ప్ర: సమకాలీన భారతీయ కళ ఈ సంప్రదాయానికి దీటుగా ఎదిగిందా? అడూర్: అసలు మనం మనదైన, మన స్వంతమైన ఒక సంప్రదాయం అనేదాన్ని ఎరిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇటీవలి కాలాన్ని దాటి చూస్తున్నామా? అసలు మన చుట్టూనే రోజూ జరిగే సంఘటనలనే ఒక తదేక దృష్టితో పట్టించుకుంటున్నామా? నా సినిమాల్లో కాకులు, కుక్కలు, బల్లులు ఇలాంటి వాటినన్నిటినీ అనేక రకాలుగా ఉపయోగించుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా గమనించారో అర్ధం చేసుకున్నారో లేదో [...]

adoor-lead2 అడూర్ తో ముఖాముఖి-రెండవ భాగం

ప్ర: మీరు సినిమా తీసే పద్ధతి మీద కథకళి ప్రభావం ఉండనిపిస్తుంది .. దాని మూలాంశాలు, ఒక రంగ దృశ్య రచన (mise-en-scene), స్టేజిమీద పాత్రలు స్పష్టమైన విభజనతో గుర్తించబడుతూనే, అందులోనే తాత్కాలిక సృజనకి అవకాశం ఇవ్వడం. అంటే, ఒకే సారి వంగగలిగేలా ఉండటమూ దృఢంగా ఉండటమూ కనిపిస్తాయి. ఈ లక్షణం మీ సినిమాలకి కూడా వర్తిస్తుంది .. పాత్రల పరిచయంలో, దృశ్యాల అమరికలో. అడూర్: కావచ్చు. ఒక డొంక తిరుగుడు పద్దహ్తిలో అలాంటి ప్రభావం ఏవన్నా [...]

నిషల్కూత్తు – షాడో కిల్

ఈ మధ్య భారతీయ కళాత్మక చలన చిత్రాల మీద కొంచెం దృష్టి పెట్టాను. ముందుగా సత్యజిత్ రే గారి చారులత చూశాను. నా ఖర్మకాలి అదొక దిక్కుమాలిన డీవీడీ. సినిమానించి డీవీడీలోకి జరిగిన మార్పు పరమ దరిద్రంగా జరిగింది. నలుపు తెలుపు చిత్రమేమో, కాంట్రాస్టు సరిగ్గా లేకపోయేప్పటికి అస్సలు చూడలేక పోయాను. అతి ఘనత వహించిన రే గారి ప్రముఖ చిత్రం గతే ఇలా ఉంటే ఇక మిగతా పాత చిత్రాల పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించవచ్చు? [...]

ghatak-1 రిత్విక్ ఘటక్ – ఒక పరిచయం

దేశ విభజన, దాని పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థుతుల నేపథ్యంలో అత్యంత దయనీయమయిన, వేదనా భరితమయిన జీవితాన్ని పరిశీలిస్తూ చలన చిత్రాలు రూపొందించిన వాడు రిత్విక్ ఘటక్. సత్యజిత్ రేకు సమకాలీనుడయిన ఘక్ తమకు జన్మనిచ్చిన నేలకు దూరమైన ఎన్నో జీవితాల్ని అత్యంత ప్రతిభావంతంగా తన చిత్రాల్లో పాత్రలుగా చిత్రించాడు. ’హై వోల్టేజ్ టాలెంట్’ గా చిత్ర రంగంపై తిరుగులేని ప్రభావాన్ని కలిగించాయి. 1925 లో ఢాకాలో జన్మించిన రిత్విక్ ఘటక్ జీవితమంతా సినిమా, నాటక రంగాల్లో కృషి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories