|
అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం
ప్ర: తిరువనంతపురంలోనా? అడూర్: జోనల్ కార్యాలయం తిరువనంతపురంలోనే కానీ పని కోసం కేరళ అంతా తిరగాల్సి వచ్చేది. పని కూడా ఆసక్తి కరంగానే ఉండేది. ఏమంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాలకి వెళ్ళి, అక్కడక్కడా కొన్నాళ్ళైనా ఉండి వచ్చే అవకాశం అది. ఇలాంటి మారుమూల చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఏదైనా కొట్టు పైన చిన్న గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నెలకి ఆరొందలంటే, మంచి జీతమే. ఒక కాలేజి [...] |
|
అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం
ప్ర: కళాశాలలో ఉండగా ఎటువంటి నాటికల్లో ఆసక్తి ఉండేది? అడూర్: ఎక్కువ సాంఘికాలే. తొప్పిల్ భాసి, ఎస్సెల్ పూరం ప్రభ్రుతుల నాటికలు వేసేవాళ్ళం. అప్పట్లో చాలా బహుమతులు కూడా సంపాయించాను. గాంధీగ్రాంలో చదువుతుండగా అనియార అని ఒక నాటిక చేశాను. అది ఆ రోజుల్లో నాటికల పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. అదొక తమాషా ఇతివృత్తం. నాటిక వెయ్యడానికి సిద్ధపడుతున్న ఒక ఎమెచ్యూర్ ట్రూపు కథ .. నాటిక అంతా గ్రీన్ రూములో జరుగుతుంది. నాటికలో నాటిక [...] |
|
అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం
ప్ర: బహుశా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కావచ్చు. ఒక సాంస్కృతిక బీజం నించి పుట్టిన మర్రి చెట్టు బలంగా వేళ్ళూనుకుని మిగతా చిన్న చిన్న సంస్కృతిక మొక్కల్ని బతకనీయకుండా చేస్తున్నది. అడూర్: అవును. ఇవ్వాళ్ళ మనం డబ్బు తెచ్చి పెట్టేవి మాత్రమే ముఖ్యమైనవని అనుకుంటూన్నాం. ఈ క్రమంలో మన ఉనికినే మనం మర్చిపోతున్నాం. అంతే కాకుండా .. ఈ చిన్న సంస్కృతులు తమని తాము తక్కువగా, కించపరుచుకుంటూ చూసుకునే పరిస్థితి తయారవుతున్నది. వలసవాద పిచ్చి [...] |
|
అడూర్ తో ముఖాముఖి-రెండవ భాగం
ప్ర: మీరు సినిమా తీసే పద్ధతి మీద కథకళి ప్రభావం ఉండనిపిస్తుంది .. దాని మూలాంశాలు, ఒక రంగ దృశ్య రచన (mise-en-scene), స్టేజిమీద పాత్రలు స్పష్టమైన విభజనతో గుర్తించబడుతూనే, అందులోనే తాత్కాలిక సృజనకి అవకాశం ఇవ్వడం. అంటే, ఒకే సారి వంగగలిగేలా ఉండటమూ దృఢంగా ఉండటమూ కనిపిస్తాయి. ఈ లక్షణం మీ సినిమాలకి కూడా వర్తిస్తుంది .. పాత్రల పరిచయంలో, దృశ్యాల అమరికలో. అడూర్: కావచ్చు. ఒక డొంక తిరుగుడు పద్దహ్తిలో అలాంటి ప్రభావం ఏవన్నా [...] |
|
అడూర్ తో ముఖాముఖి-మొదటి భాగం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ ముఖాముఖి [...] |
|
ఆడూర్ గోపాలకృష్ణన్-మరో పరిచయం
1941 లో జన్మించిన ఆదూర్ గోపాలకృష్ణన్ గారు ఎనిమిదేళ్ళ అతి చిన్న వయసునుండే నాటక రంగం లోకి అడుగుపెట్టారు. తన చదువు పూర్తయే నాటికి దాదాపు 20 కి పైగా నాటకాలను రచించి దర్శకత్వం వహించారు. ఆర్ధిక మరియూ రాజనీతిఙ్ఞ శాస్త్రముల లో పట్టా పుచ్చుకున్న ఆయన అతి కొద్ది రోజులు కేరళ ప్రభుత్వొద్యోగిగా భాద్యతలు నిర్వహించి, తరువాత పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నందు చేరి 1965 లో స్క్రిప్ట్ మరియూ దర్శకత్వ శాఖలందు డిప్లొమా సంపాదించారు. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |