Posts tagged as: adoor gopalakrishnan back to homepage

adoor అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం

ప్ర: తిరువనంతపురంలోనా? అడూర్: జోనల్ కార్యాలయం తిరువనంతపురంలోనే కానీ పని కోసం కేరళ అంతా తిరగాల్సి వచ్చేది. పని కూడా ఆసక్తి కరంగానే ఉండేది. ఏమంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాలకి వెళ్ళి, అక్కడక్కడా కొన్నాళ్ళైనా ఉండి వచ్చే అవకాశం అది. ఇలాంటి మారుమూల చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఏదైనా కొట్టు పైన చిన్న గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నెలకి ఆరొందలంటే, మంచి జీతమే. ఒక కాలేజి [...]

adoor3-1 అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం

ప్ర: కళాశాలలో ఉండగా ఎటువంటి నాటికల్లో ఆసక్తి ఉండేది? అడూర్: ఎక్కువ సాంఘికాలే. తొప్పిల్ భాసి, ఎస్సెల్ పూరం ప్రభ్రుతుల నాటికలు వేసేవాళ్ళం. అప్పట్లో చాలా బహుమతులు కూడా సంపాయించాను. గాంధీగ్రాంలో చదువుతుండగా అనియార అని ఒక నాటిక చేశాను. అది ఆ రోజుల్లో నాటికల పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. అదొక తమాషా ఇతివృత్తం. నాటిక వెయ్యడానికి సిద్ధపడుతున్న ఒక ఎమెచ్యూర్ ట్రూపు కథ .. నాటిక అంతా గ్రీన్ రూములో జరుగుతుంది. నాటికలో నాటిక [...]

adoor3 అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం

ప్ర: బహుశా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కావచ్చు. ఒక సాంస్కృతిక బీజం నించి పుట్టిన మర్రి చెట్టు బలంగా వేళ్ళూనుకుని మిగతా చిన్న చిన్న సంస్కృతిక మొక్కల్ని బతకనీయకుండా చేస్తున్నది. అడూర్: అవును. ఇవ్వాళ్ళ మనం డబ్బు తెచ్చి పెట్టేవి మాత్రమే ముఖ్యమైనవని అనుకుంటూన్నాం. ఈ క్రమంలో మన ఉనికినే మనం మర్చిపోతున్నాం. అంతే కాకుండా .. ఈ చిన్న సంస్కృతులు తమని తాము తక్కువగా, కించపరుచుకుంటూ చూసుకునే పరిస్థితి తయారవుతున్నది. వలసవాద పిచ్చి [...]

adoor అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం

ప్ర: సమకాలీన భారతీయ కళ ఈ సంప్రదాయానికి దీటుగా ఎదిగిందా? అడూర్: అసలు మనం మనదైన, మన స్వంతమైన ఒక సంప్రదాయం అనేదాన్ని ఎరిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇటీవలి కాలాన్ని దాటి చూస్తున్నామా? అసలు మన చుట్టూనే రోజూ జరిగే సంఘటనలనే ఒక తదేక దృష్టితో పట్టించుకుంటున్నామా? నా సినిమాల్లో కాకులు, కుక్కలు, బల్లులు ఇలాంటి వాటినన్నిటినీ అనేక రకాలుగా ఉపయోగించుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా గమనించారో అర్ధం చేసుకున్నారో లేదో [...]

adoor-lead1 అడూర్ తో ముఖాముఖి-మొదటి భాగం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ ముఖాముఖి [...]

adoor-lead3 ఆడూర్ గోపాలకృష్ణన్-మరో పరిచయం

1941 లో జన్మించిన ఆదూర్ గోపాలకృష్ణన్ గారు ఎనిమిదేళ్ళ అతి చిన్న వయసునుండే నాటక రంగం లోకి అడుగుపెట్టారు. తన చదువు పూర్తయే నాటికి దాదాపు 20 కి పైగా నాటకాలను రచించి దర్శకత్వం వహించారు. ఆర్ధిక మరియూ రాజనీతిఙ్ఞ శాస్త్రముల లో పట్టా పుచ్చుకున్న ఆయన అతి కొద్ది రోజులు కేరళ ప్రభుత్వొద్యోగిగా భాద్యతలు నిర్వహించి, తరువాత పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నందు చేరి 1965 లో స్క్రిప్ట్ మరియూ దర్శకత్వ శాఖలందు డిప్లొమా సంపాదించారు. [...]

shadowkill నిషల్కూత్తు(షాడో కిల్)-మరో సమీక్ష

ఉపోధ్ఘాతం: హత్యచేయడం నేరమే!కాని ఒక వ్యక్తిని చంపిన కారణంచేత హంతకుణ్ణి చంపేస్తే, అతన్ని చంపినందుకు ఎవర్ని శిక్షించాలి? చావుకు చావే సమాధానమా? ఒక వేళ మరణశిక్ష అమలయ్యాక హంతుకుడు నిర్దోషి అని తెలిస్తే పోయిన ప్రాణాన్ని తిరిగి తేగలమా? అసలు మరణశిక్ష అవసరమా? ఇలాంటి ప్రశ్నలు మీ మస్కిష్తంలో ఏప్పుడైనా ఉదయించాయా? అయితే అదూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వం వహించిన నిళల్ క్కుత్తు (shadow kill)సినిమా చూడండి.పై ప్రశ్నలన్నంటికీ ఈ సినిమాలో సమాధానం దొరక్కపోవచ్చు గానీ, మనసున్న [...]

సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్

సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా. ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories