Black & White (2008)
ఇది కాస్త లో ప్రొఫైల్గా వచ్చి వెళ్ళిన తెలుగు సినిమా అనుకుంటా. టీవీలో యాడ్స్ చూసి సినిమా ఏదో ఆసక్తికరంగా ఉండేలాగుందే అనుకున్నాను. అయితే, ఇంకా రిలీజ్ కాలేదేమో అనుకున్నాను. ఆగస్టులోనే రిలీజైందని తెలుగుసినిమా.కామ్ సైటులో ఈ సినిమా గురించి రాసిన వ్యాసంతో అర్థమైంది. ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు.
కథ: భరత్ (రాజీవ్ కనకాల) ఓ సాఫ్ట్‍వేర్ ఇంజినీరు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో నక్సల్స్ లాండ్‍మైన్ అటాక్ నుండి కొంతమంది పోలీసులను కాపాడి [...]