Tag: "39th-IFFI"

గోవా బంగారాలు ఇవే ..

గోవా బంగారాలు ఇవే ..

గోవాలో నవంబరు 22న మొదలైన 39వ ఇఫి చిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి నటుడు కమల్‌హాసన్‌, గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ హాజరయ్యారు. ఈ ముఫ్ఫై తొమ్మిదివ ‘ఇఫి’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ముగింపు రోజు అవార్డుల ప్రకటన జరిగింది. అందులో కజకస్థాన్‌ చిత్రం ‘తల్పన్‌’ బంగారు నెమలి(గోల్డెన్‌ పీకాక్‌) పురస్కారాన్ని గెలుచుకుంది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, రష్యా, పోలెండ్‌ సహకారంతో దీన్ని నిర్మించారు.సెర్గి డివోర్ట్‌ సెవాయ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఔత్సాహిక [...]

IFFI - రిపోర్టు -1

IFFI – రిపోర్టు -1

గోవా లో జరుగుతున్న 39వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈరోజు ప్రదర్శించిన కొన్ని సినిమాల వివరాలు:
భారతీయ సినిమాలు:
పులిజన్మం:మలయాళీ సినిమా. ప్రియనందన్ ఈ సినిమాకి దర్శకుడు. 54 వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టులో ఈ సినిమా ఉత్తమ సినిమాగా ఎన్నుకోబడింది.
Pulijanmam is about people who are haunted by justice and social good, people who can’t turn away from their world, life and times. At one level the film [...]

Waltz with Bashir-వీడియోస్

Waltz with Bashir-వీడియోస్

ఈ సంవత్సరం విడుదలయిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటయిన waltz with Bashir గురించి వినే ఉంటారు. ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ, యానిమేషన్ చిత్రం. ఈ సంవత్సరం అస్కార్ నామినేషన్స్ లో ఈ సినిమాని ’best foriegn language film’, ‘Best animation’, మరియు ’best documentary’ విభాగాల్లో నామినేట్ చేస్తారని విన్నాను. ఏదో ఒక దాంట్లో మాత్రం అవార్డు గ్యారంటీగా వస్తుందనిపిస్తుంది.
ఈ సినిమా కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఇక్కడ చూడండి.
ముందుగా ఈ సినిమా ఇది [...]

Waltz with Bashir

Waltz with Bashir

పరిచయం:
మన విజయవాడకు చెందిన ఒకాయన ఉన్నాడు. పేరు చాలా డిఫరెంట్ గా వుంటుంది. సినిమాల గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఆయన పేరు ’డిఫరెంట్ జాక్సన్’. (చెప్పానుగా డిఫరెంట్ గా వుంటుందని )
ఈయన రచించిన ఒక పుస్తకం పేరు “సినిమాలు చూడండి: సమస్యలు మర్చిపోవడానికి కాదు పరిష్కరించుకోడానికి”. అప్పుడెప్పుడో మరేదో పుస్తకం కోసం వెతుకుతుంటే అనుకోకుండా తగిలిందీ పుస్తకం. ఇదేదో డిఫరెంట్ గా వుందనుకున్నా కానీ చదివిన పాపాన పోలేదు కానీ ఆ డిఫరెంట్ [...]

IFFI - 2008

IFFI – 2008

పోయిన ఆదివారం (అనగా 23 నవంబరు, 2008) నుంచి గోవాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైన సంగతి పాఠకులకు తెలిసేవుంటుంది.భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన చలనచిత్రోత్సవం ఇది. గతంలో ఒక్కో సంవత్సరం ఒక్కో పట్టణంలో ఈ చిత్రోత్సవం జరుగుతుండేది. కొన్నేళ్ళ క్రితం ఈ చిత్రోత్సవానికి గోవాని పర్మనెంట్ వేదికగా నిర్ణయించారు. అప్పటినుంచీ ఈ చిత్రోత్సవం ప్రతి సంవత్సరం నవంబరులో గోవాలో జరుగుతూ వస్తుంది.
మూడు రోజుల క్రితం మొదలైన ఈ 39 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశం లోని వివిధ రాష్ట్రాలకు [...]