Tag: "2008"

బాలీవుడ్-2008

బాలీవుడ్-2008

కొత్త సంవత్సరం వచ్చి ఇన్నాళ్ళౌతుంది, ఇప్పటిదాకా ఎవరూ నవతరంగంలో 2008 లో తాము చూసిన సినిమాల రౌండప్ రాసినట్లు లేరు. అందుకే నేనే మొదలుపెడుతున్నా బాలీవుడ్-08 నా వ్యాసాంశం.
ఈ ఏడాది నేనే మారానో లేక బాలీవుడ్ లోనే వైవిధ్యం ఎక్కువైందో నాకు తెలీదు కానీ, నాకు మాత్రం బాలీవుడ్ నచ్చింది. భిన్న రకాలైన కథా వస్తువులతో సినిమాలొచ్చాయి. మన సినిమాలు ప్రపంచమంతా చూసేంత క్లాసిక్ గా ఉండాలి అన్న దృష్టితో చూస్తే బహుశా నేననే [...]

గమ్యం సినిమా - నా అభిప్రాయం

గమ్యం సినిమా – నా అభిప్రాయం

ఎంతోవిన్నాను ఈ సినిమా గురించి. ఈ మధ్య నే చూసా. చాల నిరాశ పరిచింది. ఈ సినిమా కి ప్రేరణ Walter Salles గారి Diarios de motocicleta (మోటార్ సైకిల్ డైరీసు). ఆ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. అందులో నాయకుడు అతని మిత్రుడు మోటార్ సైకిల్ మీద సౌత్ అమెరికా పర్యాటనం చేస్తారు. ఇది Che Guevara గురించిన సినిమా. Che Guevara ని ప్రపంచం ఎలా మార్చింది , ప్రపంచాన్ని అతను మార్చే [...]

Drona (2008)

Drona (2008)

ద్రోణ గురించిన టాక్ సినిమా వచ్చాక కంటే వచ్చే ముందే ఎక్కువ ఉండింది అనిపిస్తోంది ఇప్పుడు. నిన్ననే ఈ సినిమా చూశాను. చిన్నపాటి పరిచయ వ్యాసం ఇది.
సినిమా కథ విషయానికొస్తే, ఇదో సూపర్ హీరో కథ. ఆది అనబడు హీరో అభిషేక్ బచ్చన్ ఒక కుటుంబం పెంపకంలో పెరిగి పెద్దవాడౌతాడు. ఆ కుటుంబం మరి అతన్ని ఎందుకు పెంచుతోందో అర్థం కాలేదు కానీ, హ్యారీపాటర్ లాగా ఇందులో కూడా ఆ కుటుంబసభ్యులకి అతనంటే పడదు. అతనికి [...]

మరీ అంత 'కొత్త బంగారులోకం' కాదు.

మరీ అంత ‘కొత్త బంగారులోకం’ కాదు.

ఈ మధ్య కాలం లో అంతగా సినిమాలు చూడలేదు కదాని ఇవాళ రెండు సినిమాలు చూశాను. ఒకటి సగం, రెండోది పూర్తిగానూ.
సగం చూసింది ‘కష్టా చెమ్మా’. రెండోది ‘కొత్త బంగారు లోకం’. మొదటి దాని గురించి మాట్లాడి నా మూడ్ చెడగొట్టుకోలేను కానీ రెండోదే కొంచం విషయం ఉన్న సినిమా. (నిజంగానే కొంచెం విషయం. పూర్తి విషయం కాదు).
సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల బాగుంది.
కథ: ఒకమ్మాయీ [...]

సుబ్రమణ్యపురం (2008)

సుబ్రమణ్యపురం (2008)

ఎదురుచూసి, ఎదురుచూసి నేను కూడా “సుబ్రమణ్యపురం” చూసేసాను. దీనిపై వెంకట్ గారు రాస్తానన్న వివరమైన వ్యాసం ఇంకా రానేలేదు కనుక, పెద్ద వివరాలేమీ చెప్పకుండా నా స్పందన మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నా. సుబ్రమణ్యపురం ఏమిటీ? అంటారా? రెణ్ణెల్ల క్రితం వచ్చిన ఓ తమిళ సినిమా. దీని గురించి నవతరంగంలో ఇదివరలో వచ్చిన వ్యాసం ఇక్కడ.
కథ విషయానికొస్తే, 1980 లో మధురై ప్రాంతాల్లోని సుబ్రమణ్యపురం లో నడుస్తుంది కథ. ఐదుగురు అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగపు స్నేహితులు, వీళ్ళలో [...]

రాక్ ఆన్ - అభిమాని అభిప్రాయం

రాక్ ఆన్ – అభిమాని అభిప్రాయం

ఇప్పటికే నతలో రాకాన్ సమీక్ష రావడం జరిగింది. ముందు అది చదివి, దీనిని చదివితే మంచిది. దానికి నా అతికింపు ఈ టపా. ఇది సమీక్ష కాదు, ఇది ఒక అభిమాని అభిప్రాయం మాత్రమే.
హెచ్చరిక: మీరు సినిమా చూడకుంటే, ఇందులో కొన్ని స్పాయిలర్లు వున్నాయి. ఇది చదివినా సినిమాని అంతే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇప్పటికే మీరు సినిమా చూడాలని నిశ్చయించుకుంటే, ఈ సమీక్షను చదువవద్దు.

అభిమాని అభిప్రాయం
నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ [...]

డార్క్ నైట్ త్రిప్పిన మలుపులు

డార్క్ నైట్ త్రిప్పిన మలుపులు

ఫ్రాంక్ మిల్లర్ వ్రాసిన గ్రాఫిక్కు నవల ‘డార్క్ నైటు రిటన్స్’ వల్ల బాట్మాన్ పాత్రకి తిరిగి ప్రాణం వచ్చిందనే చెప్పువచ్చు. అంతకు మునుపు, మరిం కెవరూ పెద్దగా పట్టించుకోక కుంటు పడుతున్న పాత్రయి కూర్చున్న బాట్మానుని పట్టుకుని వాడి ఉనికినే మార్చేసి, ఓ డార్క ఫోర్స్ గా తీర్చి దిద్దిన ఫ్రాంక్ మిల్లర్ కి డీసీ కామిక్సు వాళ్ళు ఎంతో ఋణపడి ఉండాలి.
ఒకానొక సమయంలో వెండి తెర మీద కూడా బాట్మాన్ కి తిలోదకాలందాయి. జోయెల్ షూమాకర్ [...]

"వెల్కం టు సజ్జన్ పూర్" - ఒక హాయైన ప్రయాణం

“వెల్కం టు సజ్జన్ పూర్” – ఒక హాయైన ప్రయాణం

ఆదివారంనాడు (28 సెప్టెంబర్ ,2008) ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన “వెల్కం టు సజ్జన్ పూర్” (Welcome to Sajjanpur) చూసాను. చూసినప్పటి నుంచీ, “సమీక్ష ఎలారాయాలా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే,ఒక సినిమాని కొంత విమర్శనాదృష్టితో చూసి బాగుందోలేదో, ఎందుకలా ఉందో చెప్పెయ్యొచ్చు. కానీ, కొన్ని సినిమాలలో ఉన్న ‘సింప్లిసిటీ’ మన ‘కాంప్లెక్స్’ విశ్లేషణకు ఒక్కోసారి సవాలుగా మారుతుంటాయి. ఉదాహరణకు, శంకర్ నాగ్ తీసిన “మాల్గుడి డేస్” సీరియల్ తీసుకున్నా [...]

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul అన్నది 2008 లోనే వచ్చిన ఓ తమిళ సినిమా. దీనికి అర్థం – 305 గదిలో దేవుడు అని. దేవుడుగా ప్రకాశ్ రాజ్ నటించాడు. ఈ సినిమా గురించి ఎందుకు రాద్దాం అనుకుంటున్నా అంటే… ఇది ఒక మంచి ప్రయత్నమని నాకు తోచింది. ఏదో గొప్ప ప్రభావవంతమైన కథ అని కాదు. హాస్యం పాలు ఎక్కడా తగ్గకుండానే చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా ఎలా చెప్పొచ్చో తెలుసుకోడానికి ఈ సినిమా [...]

నాలుగు ముంబై సినిమాలు

నాలుగు ముంబై సినిమాలు

ఈ మధ్యకాలం లో నేను ముంబాయి నగరం బ్యాక్‌డ్రాప్ లో తీసిన మూడు సినిమాలని వరుసగా చూసాను. వెంటనే ముంబాయి నగరం కథలతో రాయబడ్డ – “A fine Balance”, “Such a long journey” (Rohinton Mistry), Pervez (Meher Pestonji) వంటి పుస్తకాలు ఒకసారి మనసులో మెదిలాయి. ఇదే సందర్భం లో ముంబాయి పైనే రాసిన Maximum City (Suketu Mehta) పుస్తకం దొరికింది. ఓ ముంబాయి కి అంకితమైన వారం గడిచాక, ఆ [...]

ఉచితం:మైఖేల్ మూర్ కొత్త సినిమా

ఉచితం:మైఖేల్ మూర్ కొత్త సినిమా

మైఖేల్ మూర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అమెరికా పై జరిగిన విమానదాడుల గురించి ఆయన నిర్మించిన 9/11 అనే చిత్రంతో పాటు, సికో పేరుతో అమెరికన్ వైద్య వ్యవస్థ గురించి, బౌలింగ్ ఫర్ కొలంబైన్ పేరుతో కొలంబైన్ హై స్కూలు లో జరిగిన హింసాత్మక సంఘటనల గురించి ఆయన నిర్మించిన చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించడమే కాకుండా ఆయనకు ఎన్నో అవార్డులూ తెచ్చిపెట్టాయి.
ఈ రోజు (అంటే సెప్టెంబరు 23,2008 న) ఆయన తన [...]

అష్టాచమ్మా

అష్టాచమ్మా

ఇమ్మహేశాభిధానుల కిటుల పెద్ద
పీటవేసి గుండియలలొ గూటినిచ్చి
పూజచేయ ప్రతీ పూట పొలతు లిలను
కీత రాంబాబులందరి కేది దిక్కు?
పై తేటగీతి ప్రశ్నకి రెండంకాలలో, మొదటిది హైదరాబాదులో ఉల్లాసంగా, రెండవది లక్కవరంలో కొంచెం ఊదరకొట్టి, చిత్రరూపంలో ప్రేక్షకుల ముందు సమాధానంగా ఉంచారు ఇంద్రగంటి మోహనకృష్ణ.
మహేశ్ బాబు దొరక్కపోతే కనీసం ఆ పేరున్న వాడైనా దొరికితీరాలన్న పట్టు బట్టిన ఓ వీరాభిమాని అయిన హైదరాబాదు అమ్మాయి, చిన్నప్పుడు ఆ అమ్మాయి చేసిన సహాయానికి ప్రతిగా చేస్తున్న సహాయం అని బనాయించి చెప్పినా అసలు [...]

తప్పక చూడండి:అష్టా చెమ్మా

తప్పక చూడండి:అష్టా చెమ్మా

Alright, boys and gals!
If you are in a mood to see a knee-slapping, jumping up and down in your seat, falling forward with laughter kind of movie, go see అష్టా చెమ్మా immediately. You are advised to check thoughtfulness and seriousness at the door. Don’t even think of going to this movie if you [...]

లండన్ చలన చిత్రోత్సవంలో ఐదు భారతీయ సినిమాలు

లండన్ చలన చిత్రోత్సవంలో ఐదు భారతీయ సినిమాలు

ఈ సంవత్సరం అక్టోబరు 15 నుండి 30 వరకూ జరగనున్న 52 వ లండన్ చలన చిత్రోత్సవంలో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు ప్రదర్శింపబడునున్నాయి. ఆ సినిమాల వివరాలు:
Colours of Passion(రంగ్ రసియా): మిర్చ్ మసాలా, మాయా మేమ్ సాబ్ వంటి కళాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన కేతన్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జీవితం అధారంగా రూపొందించబడింది. గత కొన్నేళ్ళుగా కమర్షియల్ సినిమాల వైపు దృష్టి [...]

Wall-E (2008)

Wall-E (2008)

“Wall-E” – యానిమేషన్ ప్రియుల్లో ఇటీవల భారతదేశానికి (ఎట్టకేలకు) వచ్చిన ఈ సినిమా పేరు వినని వాళ్ళు ఉండకపోవచ్చు. పిక్సార్-డిస్నీ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదో యానిమేషన్ చిత్రం. తక్కిన ఎనిమిదీ – టాయ్ స్టోరీ-1 (1995), టాయ్ స్టోరీ-2 (1999), బగ్స్ లైఫ్ (1998), మాన్స్టర్స్ ఇంక్ (2001), ఫైండింగ్ నెమో (2003), ఇన్క్రెడిబుల్స్ (2004), కార్స్ (2006) మరియు రాటాటూయీ (2007). వీటిలో రాటాటూయీ గురించి నవతరంగంలో ఇదివరకే ఓ వ్యాసం వచ్చింది. తక్కిన [...]

బా(హా)లీవుడ్ హంగామా!

బా(హా)లీవుడ్ హంగామా!

ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలలు బాలీవుడ్ లో పెద్దగా exciting గా ఏమీ జరగలేదనే చెప్పాలి. సింగ్ ఈజ్ కింగ్, బచ్నా యే హసీనో లాంటి రొటీన్ మసాలా సినిమాలు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు.
ఇప్పుడు చూస్తే ఒకదాని తర్వాత మరొకటి(ముంబాయ్ మేరీ జాన్, A Wednesday, తహన్, ముఖ్ బీర్, రాక్ ఆన్) విభిన్న కథాంశాలతో సినిమాలు దూసుకొస్తున్నాయి.
రాబోయే రోజుల్లో బాలీవుడ్/హాలీవుడ్ లో రానున్న కొన్ని మంచి సినిమాల వివరాలు:

Slumdog Millionaire
Firaaq
The Pool

Slumdog [...]

తమిళవాసనల "స-రో-జ"

తమిళవాసనల “స-రో-జ”

చెన్నై నుంచీ హైదరాబాదుకు క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఒక వ్యాన్లో బయల్దేరిన రామస్వామి(వైభవ్),రంగస్వామి (ఎస్.పి.చరణ్), గణేష్ (ప్రేమ్ జీ),అజయ్ (శివ) అనే ఇద్దరన్నదమ్ములు మరో ఇద్దరు స్నేహితులు.
ఒరిస్సానుంచీ వస్తున్నా ఒక ఫ్యూయల్ ట్రక్కు.
ఒక కిడ్నాప్ చెయ్యబడిన ప్రముఖ్య పారిశ్రామిక వేత్త (ప్రకాశ్ రాజ్) కూతురు సరోజ (వెగ). ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన మనుషులు (సంపత్ & నిఖిత).
పారిశ్రామికవేత్త స్నేహితుడైన ఒక పోలీస్ అధికారి, కిడ్నాప్ చెయ్యబడిన అమ్మాయిని విడిపించడానికి చేసే ప్రయత్నం .
ఈ నాలుగు లంకెలూ [...]

రాక్ ’న్ రోలా

రాక్ ’న్ రోలా

Spoilers ahead
పరిచయం:ఇంతకుముందు గయ్ రిచీ పేరు వినివుంటే ఆయన తీసిన ’లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్’, ’స్నాచ్’ అనే రెండు సినిమాల గురించి మీకు తెలిసే వుంటుంది.ఈ దశాబ్దంలో వచ్చిన అతి కొద్ది ఇంగ్లీష్ (అంటే బ్రిటన్ దేశపు సినిమాలని ఇక్కడ అర్థం) సినిమాల్లో ఈ రెండింటినీ తప్పక ప్రస్తావించవచ్చు. మన వాళ్ళు పూర్వం రాజుల సినిమాలు తీసినట్టుగా ఈ ఇంగ్లాడు వాళ్ళు కూడా ఎక్కువ రాజులూ రాణుల కథలతో కాస్ట్యుమ్ డ్రామాలు తీసి [...]

అష్టా - చమ్మా : Its all about a name

అష్టా – చమ్మా : Its all about a name

సాధారణంగా షేక్స్పియర్ నాటకంలోని డైలాగు  “What is there in a name?” అంటూ వుంటాం. కానీ ఇకపై మనకు బహుశా ఆ అవకాశం రాదనుకుంటా. ఎందుకంటే అష్టా – చెమ్మా సినిమా is all about a name. యువనటుడు మహేష్ బాబు కున్న, మహేష్, మహి, ప్రిన్స్, పోకిరి, అతిధి ఇవే ఆ పేర్లు.
మహేష్ బాబుకి పేద్ద పంఖా/ఫ్యాన్ అయిన లావణ్య (‘కలర్స్’ స్వాతి) కొంత హద్దుదాటి తననే పెళ్ళిచేసుకుందామని డిసైడ్ అయిన సమయంలో [...]

A Wednesday

A Wednesday

ఈతరం బాలివుడ్ దర్శకులు చిన్న సినిమాకి పెద్దసినిమాకి మధ్య గీతని చెరిపేయడానికి చాలా కృషి చేస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ.  టెర్రరిజం బ్యాక్‍డ్రాప్‍తో నవతరం బాలీవుడ్ దర్శకులు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వెస్టెర్న్ సినిమాల్లో క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలు ఏదో ఒకరకంగా ప్రపంచ యుద్ధాల విషాధగాధల్నో విజయ గాధల్నో పొందుపరచినట్టే, మనవాళ్ళు టెర్రరిజాన్ని వాటి పర్యవశాణాల్ని వెరైటీ కధలతో ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నవచ్చిన mumbai meri jaan ఆ జ్నాపకాల్ని మర్చిపోవడానికి మనల్ని మనం ఎలా mold [...]