నవ్య సినిమా
దృశ్య శ్రవణ మాధ్యమాల్ని తనలో ఇముడ్చుకుని ఈ శతాబ్దపు అధ్భుతంగా రూపొందిన సినిమా సర్వకళా సమ్మిశ్రితమై వందేళ్ళుగా విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతోంది. శాస్త్ర పరిణామమూ, నవ్య సాంకేతిక పరిశోధనల్లోంచి కళారూపంగా జనించిన సినిమా అన్ని కళల్లాగే స్వీయ కళాత్మకమయిన భావాల్ని సంతరించుకుంది. సామాజికప పరిశీలనే ప్రధాన లక్షణంగా ఎదిగిన సినిమా జీవన వాస్తవాల్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు మనిషి చేతన, అంత:చేతనలోని అంశాల్ని కూడా వ్యక్తీకరించే స్థాయి సినిమాకుంది. వివిధ కాలాల్లోని సంక్లిష్ట సామాజిక సమస్యల్ని, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం [...]