మనము సినిమాలెందుకు చూస్తాం?
ఇది పనికి రాని ప్రశ్నలా అనిపిస్తుంది, వినగానే. అవును, సినిమాలెందుకు చూస్తాము?
టైం పాస్ కి అన్నది ఒక సమాధానం. వినోదానికి అన్నది ఇంకో సమాధానం. నిజ జీవితం నుంచి కొన్ని గంటలయినా దూరం పారిపోయి, కలల ప్రపంచంలో విహరించటానికి అన్నది కాస్త తెలివయిన సమాధానం. వినోదాత్మకంగా విఙ్నానాన్ని గ్రహించటానికి అన్నది ఆశాభావంతో కూడుకున్న ఆదర్శవాది సమాధానం. వ్యాపారులను బ్రతికించటానికి అన్నది గడుసు సమాధానం. పనిలేక అన్నది విసుగు సమాధానం. మనము చేయలేని పనులు వేరేవారు సాధిస్తూంటే, పరోక్షంగా [...]