గోగోగో పిమ్మట నాలో నేను.
గోగోగో సినిమా చూశాను.
గోపి గోపికా గోదావరి!
దాని గురించి ఏమన్నా వ్రాయాలా?
ఏం వ్రాయాలి?
బాగోలేదని వ్రాయాలి.
అలా ఎలా వ్రాస్తావ్ ?
ఏం ఎందుకు వ్రాయకూడదు?
వంశీ సినిమా కదా.
వంశీ అయితే కొమ్ములుంటాయా?
కొమ్ములు తిరిగిన దర్శకుడు కదా!
ఎన్ని కొమ్ములేంటి?
ఎన్నో ఒకన్నిలేగాని, మంచి రచయిత కదా!
అవునా! నాకంతగా తెల్వదు.
స్వాతిలో మన్యం రాణి సీరియల్ వస్తుందిగా!
ఏవో బొమ్మలు చూట్టమేగాని, సీరియల్ ఎప్పుడూ చదవలేదు.
ఎందుకలాగ?
నాకా గోదావరి యాస చదవబుద్దికాదు.
అవునా?
అవును. అసలు యాసలో ఉన్నయి చదవాలంటే నాకేదో గ్రీక్ రష్యన్ లా ఉంటాయి.
ఆహా!
అవున్రా బాబు. అందుకే మన రానారె బ్లాగు [...]