అందాల రాముడు సినిమా-అదో అనుభవం-1
అందాలరాముడు సినిమాను మొదటి సారి నా చిన్నతనంలో చూశాను,ఏ సంవత్సరమో సరిగ్గా గుర్తు లేదు గానీ చూస్తూ చాలా సార్లు పడిపడి నవ్వుకోవటం బాగా గుర్తుంది.అందుకు కారణం తీతా అంటూ పిలిపించుకునే అల్లు,ఓ ఫైవుందా అంటూ వెంటాడే రాజబాబు.తర్వాత కొన్ని సార్లు చూసినా సినిమాహాల్లో చివరి సారి చూసి మాత్రం పదిహేనేళ్ళు దాటింది.మధ్యమధ్య స్థానిక కేబుల్ నెట్వర్కుల్లో వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని సన్ని వేశాలు మాత్రం ఆస్వాదించాను.
చివరిసారి చూశానన్నానే దానికో చిన్న రామాయణంలో పిడకల వేట లాంటి [...]