Posts Tagged ‘ రమణ ’


మా సినిమాలు:బాపు-ఐదో భాగం

leadimage

నాలుగో భాగం ఇక్కడ చదవండి.
తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం.
ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా [...]



మా సినిమాలు:బాపు-నాలుగో భాగం

leadimage

మూడవ భాగం ఇక్కడ చదవండి.
ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే - పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు.
సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా [...]



మా సినిమాలు:బాపు-మూడవ భాగం

leadimage

రెండవ భాగం ఇక్కడ చదవండి.
సంపూర్ణ రామాయణం తరువాత అక్కినేని గారితో అందాలరాముడు తీశాము. గోదారి మీద ఒక సాదా లాంచీ, ఒక గొప్పవాడి లగ్జరీ లాంచీ కలిపి లాగే ఒక మోటారు బోటు. భద్రాచల ప్రయాణం- పంటు అనబడే ఒక పెద్ద చెక్క ప్లాట్‍ఫాం మీద, మా ఫ్రెండు సీతారాముడు ఆ లగ్జరీ లాంచి కట్టాడు.
డబ్బుని నమ్మిన ధనవంతుడికీ అప్యాయత, సంఘీభావం కలిగిన మధ్య తరగతి కటుంబాలకీ సంఘర్షణ. బస్సుల్లో ఎక్కినపుడు హోటల్లో మెక్కినప్పుడు ఈ కులాలూ [...]



మా సినిమాలు:బాపు-రెండవ భాగం

leadimage

మొదటి భాగం ఇక్కడ చదవండి.
బుద్ధిమంతుడు: మూడో సినిమా- పాము నోట్లోంచి బయటపడి నిచ్చెనెక్కాం. శ్రీ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు (డబుల్ రోల్) చాలా గొప్ప కథ. పూజారికి దేవుడు కనిపించి, ’మానవా నీకెంత అహంకారమయ్యా, మానవాకారం మించిన అందం లేదనే కదా నాక్కూడా కళ్ళూ, ముక్కూ పెట్టావు. అయినా  అసలు నేనున్నానో లేదో. కేవలం నీ భ్రమేనేమో,’ అంటాడు. పూజారి, ’మా తమ్ముడు అన్ని కులాల వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడయ్యా అప్రాచ్యుడు,’ అని ఫిర్యాదు చేస్తే కృష్ణుడు, [...]



మా సినిమాలు:బాపు-మొదటి భాగం

leadimage

సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, తన సినిమాల గురించి అరుదుగా మాట్లాడే ’మితభాషి.’ మొదటిసారిగా తన చిత్రాల సిత్రాలను పాఠకుల ముందు పరుస్తున్నారు. ఆస్వాదించండి….
నవతరంగం లో ఈ వ్యాసాల సీరీస్ ను ప్రచురించే అవకాశం కల్పించిన తెలుగునాడి సంపాదకులకు, మా తెలుగు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ - TAL, ) సంపాదకులకు, కళాధర్ బాపు (బాపు [...]



బాపు-ఒక పరిచయం(లాంటిది)

leadimage

తెలుగు వారికి బాపు ని పరిచయం చేసే అవసరం వుందా? ఏదో ఫార్మాలటీగా రాద్దామనుకున్నా ఆ ప్రయత్నం వ్యర్థమనిపించింది. అందుకే  తమ గురించి వారే చెప్పుకుంటే మేలని ’బొమ్మా-బొరుసా’ పుస్తకం నుంచి వారి పరిచయాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం.కానీ బొమ్మ అంటే బొరుసూ ఉండాలి కాబట్టి, బుడుగంటే సీ గాన పెసూనంబ కూడా ఉండాలి అలాగే బాపు అంటే రమణా కూడా ఉండాలి కాబట్టి చెప్పడానికి ఇది బాపు గురించి పరిచయం అయినా రమణ లేని బాపు ని [...]