Posts tagged as: బి యన్ రెడ్డి back to homepage

వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం

కథాసంగ్రహం: గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘు పట్టభద్రుడు.తల్లిదండ్రుల కట్నం ఆశను ఎదిరించి అతను జానకిని వివాహమాడతాడు. కాపురానికి వచ్చిన జానకిని అత్తగారు అడుగడుగునా ఆరడి పెడుతుంటుంది. నోరులేని మావగారు నిస్సహాయంగా చూస్తుంటాడు. పేదరాలైన జానకి అన్నీ భరిస్తుంటుంది.అత్తింట ఆమెకు భర్త ప్రేమే స్వాంతన. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘుకు ఓ పట్టాన ఉద్యోగం దొరకదు. చివరికి అతను ఉద్యోగాన్వేషణలో బస్తీ బయలుదేరి వెడతాడు. అక్కడ మోసానికి గురవుతాడు. ఇక్కడ జానకికి [...]

sumangali సుమంగళి

చలన చిత్ర మాధ్యమాన్ని అధ్యయనం చేసే క్రమంలో బి.ఎన్.రెడ్డి నిర్మించిన చిత్రాలు నేటికీ పాఠ్య పుస్తకాల్లాంటివే. ఆయన చిత్రాల్లో కనిపించే భావుకత, నిర్మాణ సరళిలో ఆవిష్కృతమవుతున్న టెక్నిక్ నేటికీ నిత్యనూతనంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన నిర్మించిన తొలి చిత్రాలు ఆయన దృక్పధాన్ని, ఆలోచనా రీతిని ప్రతిభావంతంగా మన ముందుంచుతాయి. ఆయన తొలి చిత్రం ‘వందేమాతరం’ (1939) సామాజికాంశాన్ని, ఆనాటి రాజకీయాంశాల్ని చర్చిస్తే, రెండవ సినిమా ‘సుమంగళి’(1940)లో స్త్రీ సమస్యని, విధవా సమస్యని ఇతివృత్తంగా స్వీకరించారాయన. ఆరు దశాబ్దాల [...]

మిస్ కాకూడని మిస్సమ్మ(ఒక సమగ్ర విశ్లేషణ) – 2

మొదట భాగం ఇక్కడ చదవండి. పాత్రలూ, పాత్రోచితాలూ ఇవన్నీ కథకుడి చేతిలో పుట్టినవే! తన ఊహాశక్తికి ప్రాణంపోసి వీటిని స్క్రిప్ట్ ( కథామూలం ) అనే దాంట్లో బంధిస్తాడు రచయిత. అదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. సినిమాలో భాగమైన ఎవరైనా సరే, దాన్ని ఎంత కోరికతో తాకితే, అంతగా వారికి కావల్సిన అద్భుతాలు జరుగుతాయి. దానికి తగ్గట్టుగా వారి గొప్పతనం తెరమీద సాక్షాత్కరింస్తుంది. ఇదీ స్క్రిప్ట్ గొప్పదనం. ఈ స్క్రిప్ట్ నే సన్నివేశ పరంగా ముక్కలు [...]

missamma-lead మిస్ కాకూడని మిస్సమ్మ ( ఒక సమగ్ర విశ్లేషణ )

“Story structure” is one of screenwriting’s most enduring cliches, and not without reason. Many of the most successful writers say that the story structure is the single most important function of the writing process, one that will ultimately determine the success or failure of the script and of the film itself. Linda Seger & Edward [...]

నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం

చలనచిత్రాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గ్రహించి, తమ చలనచిత్రాల ద్వారా ప్రేక్షకుల ఉత్తమాభి రుచులను, లలితకళాసక్తిని పెంపొందించి, సంఘంలో ఉన్న దుష్టసంప్రదాయాలకు, ఆవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బి.యన్.రెడ్డి అగ్రగణ్యులు. చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీత, సాహిత్య శిల్పాది లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. అయిదేళ్ళ పిల్లలనుండి వృద్ధుల వరకు, పామరులనుండి పండితులవరకు, మనదేశంలోని అన్ని తరగతుల కుటుంబాలకు అతితక్కువ [...]

దేవత-కథ,కథనాల్లో వైవిధ్యం

నిర్మాణం:వాహినీ ఫిలింస్ కాలం: 1941 కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ:కె.రామ్‍నాథ్ మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్ ఎడిటింగ్:నారాయణన్ నటీనటవర్గం:నాగయ్య,కుమారి కథాసంగ్రహం: ఇంగ్లండ్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని సొంతవూరు వస్తాడు వేణు . తల్లి, చెల్లెలు సీత ఆనందానికి అవధులు లేవు. లక్ష్మి వాళ్ళింట్లో పనిమనిషి. కానీ, ఇంట్లో వాళ్ళంతా ఆమెను సొంతమనిషిగానే చూస్తుంటారు.లక్ష్మి తమ్ముడు కూడా ఆమెతోటే ఆ ఇంటిలో పనిచేస్తుంటాడు. మద్రాసులో వుంటున్న వేణు మేనమామకు అతన్ని తన అల్లుడిని చేసుకోవాలని ఆశ.అతనికి ఒక్కతే కూతురు. పేరు [...]

బి.యన్.రెడ్డి-ఒక పరిచయం

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories