దటీజ్ బాపు…అంతే
ఏది తూరుపు..ఏది వెలుతురు..ఎవరు బాపు? పొద్దు పొడవగానే తూరపు తెలుస్తుంది..చీకటి పడగానే వెలుతురు తెలుస్తుంది.బొమ్మ చూడగానే.. తెలుగుతనం పరవళ్ళు తొక్కగానే..గీతలు అందాలు దిద్దుకోగానే…మాటలు బిడియం ఒలికించగానే..రాతలు వినయం తొణికించగానే..రమణ స్నేహంలో రూపం మూర్తి కట్టగానే…బుడుగు అల్లరి స్పురణకు రాగానే…రాముని దయ స్మరణకు రాగానే బాపు తెలుస్తాడు. బాపు కేవలం ఒక వ్యక్తి కాదు. బాపు ఒక సిద్దాంతం.ఒక తత్వం. ఒక చరిత్ర.ఒక సంస్కృతి…ఇలా బాపు గురించి అధ్బుతంగా చాలామంది చాలాకాలం నుంచి ఉన్న నిజాలు ..చెప్తూనే ఉన్నారు. [...]