నేనింతే గురించి నా అభిప్రాయం
నిన్న సాక్షి దిన పత్రిక లో మన తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తో ముఖాముఖి చదివి నేను ఈ రోజు ఉదయం “నేనింతే” సినిమా కి వెళ్ళాను.ఈ సినిమా కథ విషయానికి వస్తే ఏమి అంత గొప్పగా లేకపోవడమే కాదు అసలు ఏమీ లేదనే చెప్పాలి. సినిమా ద్వారా ఒక కథ చెప్పడం కంటే తన సినిమాలతోపాటు తన తోటి దర్శకుల సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతండడంతో ఈ పరిస్థితికి [...]