Posts Tagged ‘ పాండురంగడు ’


నేను పాండురంగని చూచి తరించితినీ!

ఏ పూర్వ జన్మ పుణ్యమో,ఎన్ని నోముల ఫలమో అత్యంత సృజనాత్మక,ఉన్మత్త ఊహాశాలురకాలవాలమయిన తెలుగుసినిమాలు చూసి తరించు భాగ్యము నాకు కలిగినది. అందునా,భక్తి తత్వ విచారాత్మకమయిన భావ మోహపారవశ్యమునొందించు అపూర్వ కళాఖండాలను ఖండ ఖండాలుగా, తుండ తుండాలుగా తృంచి ఉప్పు కారంతో పాటుగా విదేశీ సినిమాలందించు మాల్ మసాలాలతో,స్వంత పాశవిక ప్రవృత్తీ జనితాలయిన కామ వికార కుకార టక్కు టమారాది ఐంద్రజాలికా సహిత అర్ధరహిత దుర్భర కువినోదాత్మకయిన దృష్యమాలాతోరణాల నిలయమయి, తర్కమే మర్కటమై, మస్తకము చెదలుతిన్న పుస్తకమై, [...]



పాండురంగడు

కథ:పాండురంగడు ఒక శృంగార పురుషుడు. పెళ్ళి మాటెత్తితే ఇంట్లోంచి పారిపోతానని ఇంట్లో వాళ్ళని బెదిరించి, కనిపించిన ఆడవాళ్ళతో సరసాలాడుతూ కనిపెంచిన వారిని ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తూ వుంటాడు.
పాండురంగడి శృంగారా కార్యకలాపాలిలా జరుగుతుండగా ఒక రోజు శ్రీ కృష్ణునికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది.ఎవరైనా భక్తుల పాదధూళి తోనే అది తగ్గుతుందని తెలిసి కృష్ణుని భక్తురాలైనా లక్ష్మి ఆ కార్యం కాస్తా నిర్వహించడంతో ఆమె భక్తికి మెచ్చిన కృష్ణుని భార్యలు ఆమెను చూసి ముచ్చటపడి ఆమెకు మంచి భర్తను [...]