అమెరికా! అమెరికా!! (కన్నడ) – పరిచయం
శశాంక్ (అక్షయ్ ఆనంద్) : “పక్షి లాగా ఆకాశం లో ఎగిరిపోవాలి, ప్రపంచాన్ని చుట్టిరావాలి. ఆనందాల్ని అనుభవించాలి”
సూర్య (రమేష్ అర్వింద్): మహావృక్షంలా వేళ్ళూనుకుని ఆకాశాన్ని అంటేలా ఎదగాలి. వేర్లు బలంగా నేలలో ఉంటూనే ఆకాశాన్ని ఏలాలి. పక్షిలాగా ఎంత ఎగిరినా ఏం లాభం ఎప్పుడో ఒకప్పుడు నేలని చేరాల్సిందే. కానీ వృక్షమైతే నింగికీ,నేలకూ,నీడనిచ్చే ప్రజకూ అందరికీ ఉపయోగం.”
భూమిక (హేమ) : “ఏమిటో బాబూ! మీ ఇద్దరి మాటలూ ఎప్పటికప్పుడు సరైనవే అనిపిస్తాయి. ఇద్దరూ నాకు ముఖ్యమే. ఇద్దరి [...]