Tag: "దృశ్యకావ్యం"

శుభ సంకల్పం (1995)

శుభ సంకల్పం (1995)

నేను ఎట్టకేలకి “శుభసంకల్పం” సినిమా చూసాను. సినిమా రిలీజైంది 1995 లో. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. చూసినట్లు గుర్తు ఉంది కానీ, సినిమా పూర్తిగా గుర్తు లేదు. ఇప్పుడు చూశాక సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది, ఈ సినిమాని గురించి నేను చెప్పాలనుకున్నవి చాలా ఉండటంతో.
మొదట కథ క్లుప్తంగా – రాయుడు గారి నమ్మిన బంటు దాసు. రాయుడి మనవరాలు సంధ్య. దాసు, గంగల ప్రేమ తెలుసుకున్న రాయుడు వాళ్ళకి వివాహం జరిపిస్తాడు. [...]