Tag: "తమిళ్"

నాడోడిగళ్ (త)- సమీక్ష

నాడోడిగళ్ (త)- సమీక్ష

“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి)
అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a friend అనే సూత్రాన్ని [...]

రీమేకులు - ప్రేక్షక అగంతకులు

రీమేకులు – ప్రేక్షక అగంతకులు

ఆదివారం హైదరాబాద్ ప్రసాద్స్ లో ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమా చూసి బయటికొస్తుంటే, ఆ తమిళ ప్రేక్షకుల సంతృప్తికరమైన ధ్వనుల మధ్య ఒక తెలుగు స్వరం వినిపించింది.
“ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారట్రా! రవితేజ హీరో అంట. మనోళ్ళు చూస్తారంటావా?”
“అబ్బే, నాకు డౌటే. హీరోయిన్ హీరోని పెళ్ళి చేసుకోకుండా, ఒక బట్టతలోణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే మనోళ్ళకు దిగదెహే!”
బహుశా ఇదే ఆలోచన రీమేక్ చేసేప్పుడు మన తెలుగు నిర్మాతలకు వస్తుందనుకుంటాను. అప్పుడే మొదలౌతుందనుకుంటా ఒక మంచి సినిమాని “తెలుగు ప్రేక్షకులకు” [...]

పసంగ (తమిళ్)  - పిల్లలు: పిడుగులు

పసంగ (తమిళ్) – పిల్లలు: పిడుగులు

సినిమాకు కావలసింది భారీతారాగణం, కళ్ళుమిరుమిట్లు గొలిపే సెట్లు, హోరెత్తించే పాటలూ, భీకరమైన పోరాటాలు, నిమిషానికి మారే కాస్ట్యూములు, అర్థంపర్థం లేని హాస్యాలూ, ‘పంచ్’ పేరుతో కేవలం ప్రాసతో పలికే మాటలూ, హీరోయిన్ల అర్థనగ్న ప్రదర్శనలూ…కాదు! అని నిరూపించే మరో తమిళ చిత్రం “పసంగ”. పసంగ అంటే పిల్లలు అని అర్థం. ఈ సినిమా అంతా పిల్లలే.ఇద్దరు చిన్నపిల్లలు వారి కుటుంబాలు. కానీ ఇది పిల్లలకోసం పెద్దలు తీసిన సినిమాకాదు. పెద్దలు తీసిన పిల్లల సినిమా అంతకంటే కాదు. [...]