Posts Tagged ‘ జాన్ అబ్రహం ’


జాన్ అబ్రహం-ఐదో భాగం

.
..
మొదటి భాగం ఇక్కడ చదవండి.
రెండవ భాగం ఇక్కడ చదవండి.
మూడవ భాగం ఇక్కడ చదవండి.
నాలుగవ భాగం ఇక్కడ చదవండి.
మూడో అధ్యాయం -ముగింపు
అన్నట్టు,ఆ నాటి సభకు ప్రసిద్ధ దర్శకులు బి.నరసింగరావు కూడా వచ్చారు.
జాన్ అబ్రహంతో మాట్లాడిన వారు, కలుసుకున్న వారు మాలో ఎవరూ లేరు, మీరు తప్పక రావాలన్నప్పుడు ఆయన మా మాట మన్నించి వచ్చేశారు.
మేం సభను రెండో అంత్రంలో నిర్వహించాం. తాను మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నందున రెండో అంత్రం వరకూ మెట్లు ఎక్కలేకపోయారు.
అప్పటికే అందరూ [...]



జాన్ అబ్రహం-నాలుగో భాగం

మూడో భాగం ఇక్కడ చదవండి.
20
వెంకటేశ్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి.
ఇంటిపేరు ఏడాకులపల్లి
ఎం.ఏ తెలుగు సాహిత్యం చదువుతున్నాడు. కవిత్వం రాస్తాడు. తన తండ్రి రాధయ్య హెడ్మాస్టార్ గా పనిచేశాడు. డ్యూటీలో వుండగానే ఆయన చనిపోయాడు.అతడు సాహిత్యాభిమాని, పుస్తక ప్రియుడు.పెద్ద లైబ్రరీ వుందట. అందులో రకరకాల విభాగాల కింద అనేక పుస్తకాలున్నాయని, వాటిని ఏదైనా లైబ్రరీకి ఇవ్వాలనే ఆలోచన వుందని వెంకటేశ్ చెప్పాడు. నేను అడిగిన మీదట తండ్రి పేరిట ఆ పుస్తకాలను సామాన్య శాస్త్రం లైబ్రరీకి ఇస్తానని కూడా చెప్పాడు.
తండ్రి [...]



జాన్ అబ్రహం-మూడవ భాగం

.
..

మొదటి భాగం ఇక్కడ చదవండి.
రెండవ భాగం ఇక్కడ చదవండి.
.
.
రెండో అధ్యాయం - సంస్మరణ
1
జాన్, నిన్నూ పోల్చుకోవాల్సి వచ్చింది.
ఈ శీర్షికతో ఇప్పటిదాకా మీరు చదివిన భాగాన్ని ఎడిట్ చేసి వ్యాస రూపంలో పంపితే, ఆంధ్రజ్యోతి దినపత్రిక జాన్ అబ్రహం మరణించిన రోజే అంటే 31 మే 2007న సంపాదకీయ పేజీలో నివాళి వ్యాసంగా ప్రచురించింది.
దాంతో ఈ శీర్షికతోనే సామాన్యశాస్త్రం మిత్రులం అదే రాత్రి రాంనగర్ లో స్మారక సభ జరుపుకున్నాం.
సభ అంటే సభ. లేదంటే లేదు.
మైకు [...]



జాన్ అబ్రహం-రెండవ భాగం

మొదటి భాగం ఇక్కడ చదవండి
20
జాన్ అబ్రహం గురించి తెలియాలంటే ఓ ఆసక్తికరమైన సంగతి వినాల్సిందే.
ఏదో అవార్డు ఉత్సవం సందర్భంగా అతడిని పిలిచారట.
అల్లరి చిల్లరిగా తిరిగేవాళ్లు, బిచ్చగాళ్ళ మూకతో జాన్ అబ్రహం ఆడిటోరియం వద్దకు వచ్చాడట. వారందరినీ చూసిన నిర్వాహకులు లోపలికి అనుమతించేది లేదన్నారట. వారిని రానివ్వనప్పుడు నేనూ రానని భీష్మించుకున్నాడట జాన్ అబ్రహం. దాంతో తప్పనిసరై అందరినీ గౌరవంగా ఆడిటోరియం లోపలికి తీసుకెళ్లాడట.
అవును మరి. జాన్ అబ్రహం దేన్నీ పట్టించుకోడు. అవార్డులన్నా అతడికి లెక్కలేదు.ప్రజలే అతడికి ముఖ్యం.
వారు [...]



జాన్ అబ్రహం - మొదటి భాగం


….
…..
మరేం లేదు
వజ్రోత్సవం జరుపుకున్న
తెలుగు సినిమాకు ఈ పుస్తకం
అంకితం
….

మొదటి అధ్యాయం:యాది/31 మే 2007
1
నాకిప్పటికీ జ్ఞాపకం వస్తుంది.
ఓ రోజు మా ఇంటికి వచ్చాడు జాన్ అబ్రహం.
చాలా రోజులైందేమో మా పాపను చూసి, వెంటనే అడిగాడు:
పాపా, నిన్ను పెద్దవమని ఎవరడిగారు?
… …
జాన్, నిన్నూ ఓ ప్రశ్న అడగాలని ఉంది.
చెబుతావు కదూ.
చచ్చిపొమ్మని నీకెవరు చెప్పారు?

——–
2
ఎపుడో, జాన్ అబ్రహం గురించి మలయాళ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ ఒక చోట ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు. చదివితే గుండె కలుక్కుమంది.
ఇప్పటికీ అంతే.
అతడు మరణించి నేటికి సరిగ్గా ఇరవై [...]



జాన్ అబ్రహం-ఒక పరిచయం

సినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం.
ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట వున్న [...]