ప్రజా రాజ్యం లో సినిమా
ఎనాళ్ళగానో ఊరిస్తూ వచ్చిన చిరంజీవి నిన్న ప్రజా రాజ్యం పార్టీని ప్రకటించారు. ఆయన ఎజెండా కూడా చెప్పేసారు. కానీ సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెడ్తున్న చిరంజీవి, తనకు ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యత, ప్రఖ్యాతి కలుగచేసిన సినిమా పరిశ్రమకు ఋణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. రేపటి రోజున ఎన్నికలలో గెలుపొంది చిరంజీవి ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడితే సినిమా రంగానికి ఆయన చేయదగ్గ సేవలు ఎన్నో ఉన్నాయి. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న సినిమా [...]