అసామాన్య నటుడు-కమల్ హాసన్-2
కమల్‌హాసన్ ఒక నిరంతర నటతపస్వి. ఆయనలోని నటనార్తి తీర్చుకోవడానికి బహుపాత్రలను పోషించాడు. ఒకే సినిమాలో డబుల్‌రోల్స్‌ని, ట్రిపుల్‌రోల్స్‌ని పోషించినా, ప్రతీ పాత్రలో కంప్లీట్ డిఫరెన్స్‌ని చూపించి నటనకే, నటించడం నేర్పిన హీరో.
కమల్ – సినిమాలలో మొదట కొరియోగ్రాఫర్‌గానే రంగప్రవేశం చేశాడు. మన తెలుగు సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావుకు సినిమాలలో స్టెప్పులేయించాడు కూడా. ఆయనలోని డాన్సింగ్ స్కిల్స్‌ని ఆధునిక తరహాలో చూపించే అవకాశం. డ్యాన్స్‌మాస్టర్ సినిమాలో వచ్చింది. ఇందులో ఆయన చేసిన మోడ్రన్ డ్యాన్సులకు మంచి పేరొచ్చింది.
ఆయన నటించిన [...]