పెద్దలు – ప్రేమలు – సినిమాలు

“దేవదాసు” కు దాస్యం చేసి, “మల్లీశ్వరి” ని రాణి ని చేసి, “సాహసం సేయరా ఢింభకా…రాకుమారి దక్కుతుందని” (పాతాలభైరవి) ప్రేమని ప్రోత్సహించిన తాతయ్య,బామ్మ ల తరం ఒకటైతే, “మేఘసందేశా”న్ని మధించి “ప్రేమాభిషేకా”న్ని పొంగించిన నాన్నలు,అమ్మల తరం మరోటి. కానీ,ఈ రెండు జనరేషన్లూ ప్రేమకు వ్యతిరెకమే.మళ్ళీ ఏమైనా ఆంటే “ఈకాలం సినిమాలున్నాయి చూసారూ…ఇవి పిల్లల్ని చెడగొట్టేస్తున్నాయి” అంటూ రాగాలు పోవడం పరిపాటి. నిజంగా సినిమాలు అంత మహత్తును కల్గి ఉంటాయా? మానవ సంభంధాలను అదీ ముఖ్యంగా ప్రేమను నిర్వచించి,ప్రోత్సహించే(…)