Menu

నవతరంగం Archive

అందాల రాముడు-అదో అనుభవం

అందాలరాముడు సినిమాను మొదటి సారి నా చిన్నతనంలో చూశాను,ఏ సంవత్సరమో సరిగ్గా గుర్తు లేదు గానీ చూస్తూ చాలా సార్లు పడిపడి నవ్వుకోవటం బాగా గుర్తుంది.అందుకు కారణం తీతా అంటూ పిలిపించుకునే అల్లు,ఓ ఫైవుందా అంటూ వెంటాడే రాజబాబు.తర్వాత కొన్ని సార్లు చూసినా సినిమాహాల్లో చివరి సారి చూసి మాత్రం పదిహేనేళ్ళు దాటింది.మధ్యమధ్య స్థానిక కేబుల్ నెట్వర్కుల్లో వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని సన్ని వేశాలు మాత్రం ఆస్వాదించాను. చివరిసారి చూశానన్నానే దానికో చిన్న రామాయణంలో పిడకల వేట

అకిరా కురొసావా

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి

Jean-Luc Godard-ఒక పరిచయం

Godard- ఈ పేరు తెలియని సినీ ప్రేమికులుంటారంటే ఆశ్చర్యమే.ప్రపంచ సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈయన గురించి రాయడమంటే తేనెతుట్టెపై రాయి వేసినట్టే. Godard ని పరిచయం చెయ్యాలంటే ఆయనొక్కరి గురించి చెప్తే సరిపోదు. ఈయన గురించి చెప్పాలంటే  ముందు Andre Bazin ని పరిచయం చెయ్యాలి. ఆయన పరిచయం చేయడంతో  సరిపోదు. Andre Bazin అన్నాక Cahiers du Cienma గురించి చెప్పకపోతే ఎట్లా? ఈ పెద్దాయన గురించి మొదలెట్టాక  Henri Langlois గురించి చెప్పకపోతే గీస్తున్న

న్యూవేవ్ సినిమా

ఉపోద్ఘాతం అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి

మంచి సినిమా

సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. Pirates of the Caribbean సినిమా తీసుకోండి లేదా స్పైడర్మ్యాన్ (Spiderman 3) సినిమా తీసుకోండి. అందులో