Menu

కార్తీక్ Archive

కాపీయా? ప్రేరణా? – ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?

తీరిగ్గా ఉన్న ఒక సెలవురోజు సాయంత్రం వాలుకుర్చీలో కూర్చుని, రేడియోలోనో, టివిలోనో లేదా మీ టేప్ రికార్డరులోనో మీకిష్టమైన పాటొకటి వింటున్నారు. అందులోని రిథంకీ, సంగీతానికీ అనుగుణంగా మీకు తెలియకుండానే మీ కాళ్ళు నేలను తాటిస్తూ ఉన్నాయి (మెలొడీ ఐతే ‘మనసు పులకరిస్తుంది’ అనుకోవచ్చు). హఠాత్తుగా, ఎక్కడో ఒకచోట “అరె! ఈ ట్యూనును ఇదివరకెక్కడో విన్నట్టుందే.” అనుకున్నారు. మీ మెదడు పొరల్లోని ఆర్కివ్స్ లోకి వెళ్ళాక, ఆ ట్యూను ఎక్కడిదో మీకు అర్థమైంది. అంతే! అంతకుముందు “ఎంత