“వెల్కం టు సజ్జన్ పూర్” – ఒక హాయైన ప్రయాణం

ఆదివారంనాడు (28 సెప్టెంబర్ ,2008) ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన “వెల్కం టు సజ్జన్ పూర్” (Welcome to Sajjanpur) చూసాను. చూసినప్పటి నుంచీ, “సమీక్ష ఎలారాయాలా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే,ఒక సినిమాని కొంత విమర్శనాదృష్టితో చూసి బాగుందోలేదో, ఎందుకలా ఉందో చెప్పెయ్యొచ్చు. కానీ, కొన్ని సినిమాలలో ఉన్న ‘సింప్లిసిటీ’ మన ‘కాంప్లెక్స్’ విశ్లేషణకు ఒక్కోసారి సవాలుగా మారుతుంటాయి. ఉదాహరణకు, శంకర్ నాగ్ తీసిన “మాల్గుడి డేస్” సీరియల్ తీసుకున్నా(…)