NTSC


సినిమాని అభిమానించే తెలుగువారి వెబ్‌సైట్‌గా నవతరంగం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా వున్న అనేక సినిమా వెబ్‌సైట్లకు భిన్నంగా కేవలం గాసిప్‌లు, రివ్యూలకే పరిమితం కాకుండా, నవతరంగం జాతీయ, అంతర్జాతీయ చిత్రాలను తెలుగువారికి పరిచయం చేస్తూ, విశ్లేషణలను అందిస్తూ వచ్చింది నవతరంగం. ఆ క్రమంలో మీ అందరి ఆదరాభిమానాలను పొందింది. నవతరంగంలో వచ్చే సినిమా రివ్యూలు, వ్యాసాలు ఉత్తమస్థాయిలో వుంటాయనేది పాఠకులు, అభిమనులేకాక, సినీ పరిశ్రమకు చెందినవారుకూడా ఒప్పుకుంటున్న సత్యం. ఈ క్రమంలో కొంతమంది ఔత్సాహిక దర్శకులు, నవతరంగం సభ్యులను కలిసి వాళ్ళు తీయబోతున్న చిత్రాల స్క్రిప్ట్‌లను పరిశీలించి, తగిన సూచనలను ఇవ్వమని అడగడం జరిగింది. సరిగ్గా అప్పుడు పుట్టుందే ఈ ఆలోచన – నవతరంగం స్క్రిప్ట్ కన్సెల్టెన్సీ.

నవతరంగం స్క్రిప్ట్ కన్సల్టెన్సీ

ఇప్పటిదాక కేవలం సినిమా చూసి విమర్శించే వారుగా మిగిలిపోయిన నవతరంగం మరో అడుగు ముందుకేసి సినిమా నిర్మాణానికి ముందే విమర్శకు ఆస్కారం వున్న విషయాలను దర్శకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కన్సెల్టెన్సీ. నవతరంగం సభ్యులైన మహేష్, సత్యప్రసాద్ మరియు వెంకట్ శిద్దారెడ్డి ఈ కన్సల్టెన్సీ లో సభ్యులు. అవసరం ఉన్నప్పుడు నవతరం వెబ్ సైట్ సభ్యుల సేవలు కూడా వినియోగించుకునే ఆలోచన ఉంది.

ఇప్పటికే కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ డెవలప్మెంట్, మాటలు వ్రాయడం, స్క్రిప్ట్ అనువాదం చేయడం, సబ్ టైటిల్స్ వ్రాయడం, ప్రీ ప్రొడక్షన్, షెడ్యూలింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కోఆర్డినేషన్,  పబ్లిసిటి డిజైన్ లాంటి ఎన్నో పనులు (unofficial గా) తలపెట్టినా ఇప్పుడు నవతరంగం బ్యానర్ కింద ఒక పూర్తి స్థాయి script consultancy మొదలుపెట్టడం ఆనందంగా ఉంది.

ఈ కన్సల్టెన్సీ ఇందులో భాగంగా నవతరంగం ఔత్సాహిక దర్శకులకి రెండురకాలుగా సహాయపడగలదు. స్క్రిప్ట్ రీడింగ్ సర్వీస్ (Script Reading Service), స్క్రిప్ట్ డెవలప్మెంట్ సర్వీస్ (Script Development Service). ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా వున్న దర్శకులకి వారి స్క్రిప్ట్‌ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్క్రిప్ట్ మరింత మెరుగ్గా తయారు చేసేందుకు అవసరమనిపించిన సూచనలతో విశ్లేషణ ఇవ్వడం మొదటిది. స్క్రిప్ట్ సిద్ధంగా లేని దర్శకులకి/రచయితలకి వారి దగ్గర వున్న ఆలోచన/కథ ఆధారంగా సినిమా తీసేందుకు అవసరమయ్యే స్క్రిప్ట్ తయారుచెయ్యడం రెండొవది. ఒక విధంగా సినిమా తీయాలన్న ఆలోచన నుంచి సినిమా తీసేదాక దర్శకుడికి/రచయితకి సహాయపడటం ఈ కన్సెల్టెన్సీ వుద్దేశ్యం.

స్క్రిప్ట్ రీడింగ్‌లో భాగంగా నవతరంగం స్క్రిప్ట్ కన్సల్టెంట్స్ స్క్రిప్ట్‌ని చదివి విశ్లేషించి ఆ స్క్రిప్ట్ ఒక విజయవంతమైన సినిమాగా రూపొందడానికి కావల్సిన అన్ని సలహాలను ఇస్తారు. (విజయం అంటే ఇక్కడ కేవలం ఆర్థికగా విజయవంతం అని అర్థం కాదు). ఇందులో భాగంగా నవతరంగం ఇచ్చే విశ్లేషణలో – టార్గెట్ ఆడియన్స్, అయ్యే ఖర్చు, విశ్లేషణతో పాటు “నవతరంగం రేటింగ్” కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా విడుదలైన సినిమాలకు రేటింగ్ ఇచ్చే సాంప్రదాయానికి భిన్నంగా స్క్రిప్ట్ స్థాయిలోనే రేటింగ్ ఇవ్వడంతో ఆ స్క్రిప్ట్ సినిమాగా మారేయేందుకు మార్గం సుగమం అవుతుందని మా అభిప్రాయం. నవతరంగం ఇప్పటికే వెబ్‌సైట్ ద్వారా కలిసిన ఔత్సాహికులకు ఈ సేవలు అందించింది. వాటిని అలాగే కొనసాగిస్తూ ఈ సర్వీశ్‌ను వుచితంగానే (Script reading మాత్రమే, Script consulting and development will be a paid service) అందిస్తుంది నవతరంగం.

స్క్రిప్ట్ డెవలప్మెంట్‌లో భాగంగా ఆలోచన స్థాయిలో వున్న కథని వ్రాయడం, కథని స్క్రీన్‌ప్లేయ్ రూపంలోకి మార్చడం, మాటలు, కేరక్టర్ డెవలప్మెంట్, ట్రీట్మెంట్ నుంచి పూర్తైన స్క్రిప్ట్‌కి బడ్జెట్ ఎస్టిమేషన్, ప్రొడక్షన్ షెడ్యూలింగ్ వరకూ పూర్తి సహకారం అందిస్తుంది నవతరంగం టీం.

మా ఈ ప్రయత్నం సినిమా తీయాలనుకున్న ప్రతివారికి మరింత మంచి సినిమా తీసేందుకు దోహదపడుతుంది మా ఆశ, ఆకాంక్ష.

“I have never said this movie is good, this movie is bad; they discover by themselves. I have not helped, I have not talked. I have put food on the table and they have taken the food and eaten, and then gone on to eat more and more food. All I give them is food, food, food, food. This is my work, to show films; to save and to show films, nothing more.”

- Henri Langlois

23 Comments to “NTSC”

  • చాలా మంచి ఆలోచన.

    “స్క్రిప్ట్ రీడింగ్‌లో భాగంగా నవతరంగం సభ్యులు స్క్రిప్ట్‌ని చదివి విశ్లేషించి ఆ స్క్రిప్ట్ ఒక విజయవంతమైన సినిమాగా రూపొందడానికి కావల్సిన అన్ని సలహాలను ఇస్తారు.”

    నవతరంగం సభ్యులంతా విశ్లేషిస్తారా? నవతరంగం సభ్యులంటే నవతరంగంలో వ్రాసేవారా? నేను నవతరంగం సభ్యుడిని అవుతానా?

    • Sorry for the confusion. I corrected it now.
      నవతరంగం సభ్యులైన మహేష్, సత్యప్రసాద్ మరియు వెంకట్ శిద్దారెడ్డి ఈ కన్సల్టెన్సీ లో సభ్యులు. అవసరం ఉన్నప్పుడు నవతరం వెబ్ సైట్ సభ్యుల సేవలు కూడా వినియోగించుకునే ఆలోచన ఉంది.

  • nice thought.

  • మీ స్క్రిప్ట్ కనసల్టేన్సి ఐడియా బాగుంది. నవతరం దర్శకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తే ప్రోత్సాహకర ఫలితాలు వుంటాయి. అవకాశం
    వుంటే మీ టీం లో మెంబర్ గా చేర్చుకోండి. విష్ యు గుడ్ లక్.
    Narayana Murthy K.

    Knmurthy116@yahoo.com

  • ఇది చాల మంచి ఆలొచన….

  • మంచి ఆలోచన, అభినందనలు. మీ ప్రయత్నం విజయవంతమవ్వాలని మంచి ఫలితాలనివ్వాలని కోరుకుంటున్నాను.

  • good idea for great Scripts…

    surya

  • Subhamastu!

  • మీరు ఏ సర్వీస్‍కు ఎ౦త ఛార్జ్ చేస్తారో తెలిపితే, దాన్నిబట్టి కావాల్సినవాళ్ళు మిమ్మల్ని కా౦టాక్ట్ చేస్తారు.

    • ఫిక్స్డ్ రేట్స్ అంటూ ఏమీ లేవు.
      మామూలుగా స్క్రిప్ట్ కోసం సినిమా బడ్జెట్ లో 3 నుంచి 4 % కేటాయిస్తారు.
      మీ సినిమా బడ్జెట్ ఇంత అనుకుంటే అందులో 4% స్క్రిప్ట్ కోసం పక్కన పెట్టుకుని అందులో మేము చెయ్యబోయే పని ఎంత ఉంటుందో దాన్ని బట్టి we will quote the rate.

    • హెర్కులస్,

      ప్రస్తుతానికి స్క్రిప్ట్ అనాలసిస్ కి ఏ చార్జీ లేదు. అనాలిసిస్ పూర్తి అయ్యాక అసలు చెయ్యాల్సిన స్క్రిప్ట్ పని ఎంత వుందో తెలుస్తుంది. దాని బట్టి చార్జీలు.

      • బాగు౦ది. ఐతే కా౦టాక్ట్ చెయ్యడనికి నె౦బర్లైనా, మెయిల్ ఐడి ఐనా ఇవ్వ౦డి. తొ౦దరగా పని మొదలెట్టొచ్చేమో!

  • whats the trust to narrate our stories to your group, what security can u give, so we have to pay to take advices, why you only people we have to approach, there are so many who can analaze the things na,

    • సినిమా పరిశ్రమ మొత్తం ఇలాంటి నమ్మకంతోనే నడుస్తుంది. ఒక రచయిత లేదా దర్శకుడు ఒక కథని సినిమాగా మార్చడానికి ముందు హీనపక్షం ఇరవైమందికి చెప్పకుండా అది సినిమాగా మారదు. అందులో కథా చౌర్యాలు జరగవా అంటే జరుగుతాయి.. అందుకని కథలు ఎవరికీ చెప్పకుండా సినిమా తీయగలమా? అయితే కథను రిజిస్టర్ చేసుకునే సౌకర్యంకూడా పరిశ్రమలో వుంది. నవతరంగం కన్సల్టెంట్స్ మీలాంటి ఔత్సాహికుల కథలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా ఉచిత సేవ అందిస్తుంది (రిజిస్ట్రేషన్ చార్జీలు రచయితవే).

  • మీ ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదండీ…ఇప్పుడు ఒక సినిమా కథా చర్చలకు నలుగురైదుగురు వ్యక్తులు కూర్చుని పని చేస్తారు. వాళ్ళు కథను కాపీ కొట్టి వేరే వాళ్ళకి చెప్పరని నమ్మకం ఏంటి?
    మేము మీ కథలు కొట్టేయం అని చెప్పగలను. కానీ మా మాట మీరెందుకు నమ్మాలి?

  • @ venkat gaaru.. lol

  • finally…now we will write a review on the movie you “Consulted”…

  • నిజంగానే మంచి ఆలోచన…….మరి కథలు కాపీ కొట్టడం గురించి అంటే ఏం చెప్పగలం ఒకే కథతో ఒచ్చిన సినిమాలు మన తెలుగులో చాలానే ఉన్నాయి…..Godfather movie కథతో దాదాపు ఎన్ని చిత్రాలు మన బాషలలో ఉన్నాయో చూడండి…ఎంత కథను కాపీ కొట్టినా మనకు వాళ్ళకు తేడా ఉంటుంది, కథనం బాగుండాలి కదా! అది ఎవరైతే కథను సొంతగా వ్రాస్తారో వారికే దక్కుతుంది అని నాఅభిప్రాయం…….

  • మీ ఐడియా చాల బాగుంది…నేను సాటి తెలుగు సినిమా అభిమానిని.నాకు చాల ఆలోచనలు,డైలాగ్స, రియల్ టైం కధలు ఎన్నో కదలాడుతున్ట్టాయి.
    ఈ వన్నిటిని ఒక స్క్రిప్టు గా ఫార్మ్ చేసుకోవాలని నా ఆలోచన.
    అసలు స్రిప్ట్ ఎలా రాయాలో నాకు ఎటువంట్టి అవగాహనా లేదు, మీరు ఎవరైనా ఏదైనా సలహా ఇవ్వగలరా..
    “స్రిప్ట్ ని ఎలా మొదలు పెట్టాలి అండ్ ఎలా రాయాలి”

  • That’s Good idea certainly. Helping new comers and helping your self :)

    Most importantly.. This can save many audiences watching head ache movies.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories