ప్రపంచ చిత్ర చరిత్ర

ప్రపంచ చిత్ర చరిత్ర 14: మాస్ హీరోలు… మసాలా సినిమాలు..!

ప్రపంచ చిత్ర చరిత్ర 14: మాస్ హీరోలు… మసాలా సినిమాలు..!

రెండొవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల జీవితంలో సినిమా ఒక ముఖ్య భాగం అయిపోయింది. కేవలం వినోద సాధనంగానే కాకుండా, ఆలోచనలు ప్రేరేపించే కళా ప్రక్రియగా, రాజకీయ వ్యాఖ్యానాలకి, దేశభక్తి ప్రభోదానికి ఒక సాధనంగా కూడా సినిమా మారింది. అయితే ప్రపంచ మొత్తం నెలకొన్న కోల్డ్ వార్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, అన్ని చోట్ల ఎక్కువైపోతున్న న్యూక్లియర్ కుటుంబాలు వంటి కారణాల వల్ల వినోదాత్మక ప్రేమ చిత్రాల జోరు పెరగడం మొదలైంది. ముఖ్యంగా బ్రిటన్ మ్యూజికల్ సినిమాలు,(…)

ప్రపంచ చలన చిత్ర చరిత్ర 15: త్వరలో విడుదల

ప్రపంచ చలన చిత్ర చరిత్ర 15: త్వరలో విడుదల

కదిలే బొమ్మల్ని చూడాలనుకున్న మనిషి కోరిక ఫోటోలతో మొదలై, క్రమంగా సెల్యులాయిడ్ పైన ఎక్కి మాటలు నేర్చి, రంగులు అద్దుకోని, బ్లాక్ బస్టర్ సినిమాగా, ఆర్ట్ సినిమాగా, సమాంతర సినిమాగా రకరకాలు రూపాంతరాలు చెందుతూ వచ్చిన సినిమా తరువాత ఏ కొత్త పుంతలు తొక్కబోతోంది? ఒకప్పుడు నాటకాలు, బొమ్మలాటలు, సంగీత కచేరిలు (ఒపెరాలు) వంటి వినోధసాధనాలకు అదనంగా వచ్చిన చేరిన సినిమా, అలాంటి కళలనే మింగేసిందనే అపప్రధ కూడా మూటకట్టుకుంది. అయినా ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించారు.(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 1: చిత్రం చలనమైన వేళ

ప్రపంచ చిత్ర చరిత్ర 1: చిత్రం చలనమైన వేళ

అది 1878 జూన్ 19 తేది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలోఆల్టో అనే నగరంలోని ఒక మైదానం. అనేకమంది ప్రేక్షకులు, పత్రికా విలేఖరులు ఉత్కంఠతతో చూస్తున్నారు. అప్పటికే ప్రముఖ ఫొటోగ్రాఫర్‌గా పేరు పొందిన ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ తన ఇరవైనాలుగు కెమెరాలను సరిచూసుకోని తెల్ల గడ్డం నెమురుకుంటూ కూర్చున్నాడు. ఆ ఇరవై నాలుగు కెమెరాలు ఒక దాని పక్కన ఒకటి ఇరవై ఏడు అంగుళాల దూరంలో పెట్టబడి వున్నాయి. అన్ని కెమెరాలు సెకనులో ఇరవై అయిదో వంతు కాలం(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 2: “ఎడిసన్ సరికొత్త ఆవిష్కరణ”: కెనిటోస్కోప్

ప్రపంచ చిత్ర చరిత్ర 2: “ఎడిసన్ సరికొత్త ఆవిష్కరణ”: కెనిటోస్కోప్

“చెవులకి ఫోనోగ్రాఫ్ ఎలాగో, కంటికి కూడా అలాంటి పరికరాన్ని కనిపెడతాను” అని థామస్ ఆల్వా ఏడిసన్ ప్రకటించాడు. గ్రీకు పదాలు “కినిటో” (చలనం), “స్కోప్” (దర్శించు) కలిపి “కినెటోస్కోప్” (చలన దర్శని)అనే పేరు ఆ పరికరానికి నిర్థారించాడు ఎడిసన్. అయితే ఆ పరికరాన్ని ఎలా తయారు చెయ్యాలో అప్పటికికా అతనికి తెలియదు.. అప్పటికే మైబ్రిడ్జి చేసిన ప్రయోగాల ఫలితంగా జూప్రాక్సిస్కోప్ అనే అ పరికరం రూపొందించబడింది. మరో పక్క ఫ్రాన్స్‌లో లుమినరి బ్రదర్స్ కదులుతున్న బొమ్మల చిత్రాల్ని(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 3: మొదటి సినిమా – మన సినిమా

ప్రపంచ చిత్ర చరిత్ర 3: మొదటి సినిమా – మన సినిమా

అతని పేరు ఫ్రెడ్ ఓట్. పొడవైన బుర్రమీసాలు, కుదురుగా దువ్విన జుట్టు, చక్కటి సూటు, కుడి చేతిలో రుమాలుతో ప్రత్యక్షమయ్యాడు. ఎడమచేతిలో వున్న నశ్యం పొడిని ముక్కుతో ఎగబీల్చి గట్టిగా తుమ్మాడు. కేవలం అయిదు సెకండ్లు నడిచే ఈ సినిమానే అమెరికాలో కాపీరైట్ పొందిన మొదటి సినిమా (9 జనవరి 1894). అంతకుముందు 1888లో లీప్రిన్స్ “రౌంథేయ్ గార్డెన్” సినిమా తీసినా, మరింకెంతోమంది సినిమా తీసే ప్రయత్నం చేసినా “ఫ్రెడ్ ఓట్ స్నీజ్” అనేదే మొదటి సినిమా(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 4: భారత సినీ దర్శకులకే “దాదాసాహెబ్”

ప్రపంచ చిత్ర చరిత్ర 4: భారత సినీ దర్శకులకే “దాదాసాహెబ్”

భారతదేశంలో తొలి సినిమా ప్రదర్శన 1896లో బాంబేలో జరిగింది. లుమినరీ సోదరులు తీసిన ఆరు చిత్రాలను అక్కడ ప్రదర్శించారు. అయితే ఆ చిత్రాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఒకటుంది. “ది అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ అట్ లా సియోటాట్ స్టేషన్” అనే ఈ చిత్రంలో కెమెరా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ పైన వుండగా ఒక రైలు దూసుకుంటూ వచ్చి ఆగడం కనిపిస్తుంది. లుమినరీ సోదరులు అనేక దేశాల్లో ఇచ్చిన ప్రదర్శనలో ఈ చిత్రాన్ని కూడా జతపరిచారు.(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 5: సినిమా పరిభాష దిశగా తొలి అడుగులు

ప్రపంచ చిత్ర చరిత్ర 5: సినిమా పరిభాష దిశగా తొలి అడుగులు

అప్పటికి కదిలే చిత్రాలన్నింటిని సినిమాలుగానే పరిగణించేవారు.. అయితే 19వ శతాబ్దం చివర్లో వచ్చిన సినిమాలన్నీ సంఘటనా చిత్రాలే కాని పూర్తి నిడివి చిత్రాలు కావు. వుదాహరణకి లుమినరీ సోదరులు తీసిన తొలి చిత్రంలో లుమినరీ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కార్మికులు కనిపిస్తారు. ఇలాగే ప్లాట్‌ఫారం మీదకు వస్తున్న రైలు, స్ప్రింక్లర్‌తో ఆడుతున్న తోటమాలి, మనదేశానికి వస్తే లార్డ్ కర్జన్ డిల్లీ దర్బారు, కుస్తీపోటీలు ఇలాంటివన్నీ చిత్రీకరించేవారు. అయితే సినిమా ద్వారా ఒక కథ చెప్పవచ్చని, అప్పటికే ప్రాచుర్యంలో(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 6: సత్తు నాణానికి సినిమా ప్రదర్శన

ప్రపంచ చిత్ర చరిత్ర 6: సత్తు నాణానికి సినిమా ప్రదర్శన

పిట్స్ బర్గ్, స్మిత్ ఫీల్డ్ స్ట్రీట్ లొ డైమండ్ ఎవన్యూ, ఫిఫ్త్ ఎవన్యూ మధ్యలో వున్న ఒక చిన్న దుకాణం (Store Front) ఒకరోజు కొత్త అవతారం ఎత్తింది. “నికలోడియన్” అన్న పేరుతో, చుట్టూ వెలుగు చిమ్మే రంగురంగుల లైట్లతో ఆ వీధి మొత్తానికి కొత్త శోభ తెచ్చి పెట్టింది. ఆ “స్టోర్ థియేటర్” ముందు నిలబడి ఒక వ్యక్తి అరుస్తున్నాడు – “పిల్లల్లారా, పెద్దల్లారా.. రండి.. నేడే చూడండి.. లోపలికి దయఛేయండి.. ఇంతవరకూ మీరు చూడని(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 7: థామస్ ఆల్వా ఎడిసన్ vs గ్రిఫిత్

ప్రపంచ చిత్ర చరిత్ర 7: థామస్ ఆల్వా ఎడిసన్ vs గ్రిఫిత్

ప్రపంచ సినిమా చరిత్రలో మైలురాళ్ళుగా చెప్పుకొదగ్గ ఎన్నో ఆవిష్కరణలకు మూలమైన థామస్ ఆల్వా ఎడిసన్ క్రమ క్రమంగా సినిమా తీయాలనుకునే ఔత్సాహికుల పాలిట విలన్ లా తయారయ్యాడు. అప్పటికే సినిమా ప్రక్రియకి సంబంధించిన ఎన్నో పేటంట్లను సొంతం చేసుకున్న ఎడిసన్, అవి వాడాలనుకునే వారిపై భారీ సుంకాలు విధించడంతో సినిమా తీయటం అనేది కొందరికే పరిమితమైపోయింది. ఒకవేళ ఎవరినా ఎదిరించినా, చట్టపరంగా కేసులు వేసి వేధించేవారు. 1908 నాటికే ఇలాంటి కేసులు వందల సంఖ్యలో వేయబడ్డాయి. సినిమా(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 8: సినీ ప్రపంచానికి ఛార్లీ ఛాప్లిన్ చేసిన నిశ్శబ్ద సేవ

ప్రపంచ చిత్ర చరిత్ర 8: సినీ ప్రపంచానికి ఛార్లీ ఛాప్లిన్ చేసిన నిశ్శబ్ద సేవ

ఛార్లీ చాప్లిన్ ని తెరపైన చూడగానే పెదాలపై చిరునవ్వు, కళ్ళలో తడి ఒకేసారి పుట్టడం అందరికీ అనుభవమయ్యే సత్యం. ఈ అనుభవం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో కాక యావత్ ప్రపంచానికి కలగడం కేవలం చాప్లిన్ మాత్రమే సాధించిన అద్బుతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో అసంఖ్యాక అభిమానులు కలిగిన నటుడు, అప్పటికీ ఇప్పటికీ ఒక్క ఛార్లీ చాప్లినే అంటే అతిశయోక్తి కాదేమో. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంతో బాధలు పడుతున్న ప్రపంచాన్ని నవ్వించడానికా అన్నట్లు చాప్లిన్ కూడా(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 9: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు…

ప్రపంచ చిత్ర చరిత్ర 9: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు…

1905 ప్రాంతానికల్లా సినిమా ప్రపంచపటంపైన బుడిబుడి అడుగులు మొదలుపెట్టింది. 1912 థామస్ ఎడిసన్ ఒక్క రీలుకి మించి సినిమా వుండకూడదని నియత్రించడంతో అమెరికాలో సినిమా ఒక రీలుకే పరిమితమైపోయింది. ఇలాంటి నియంత్రణ లేని ఆస్ట్రేలియా, యూరప్ లలో నాలుగు ఐదు రీళ్ళ సినిమాలు కూడా తయారయ్యాయి. ఎడిసన్ శాసనాన్ని తప్పించుకోడానికి ఎడిసన్ ట్రస్ట్ సభ్యులు కూడా మూడు నాలుగు రీళ్ళ సినిమాలు రూపొందించినా వాటిని విడి విడిగా ఒక వారం తరువాత మరికటి విడుదల చేసేవారు. ఒక(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 10: మూకీ నుంచి టాకీకి..

ప్రపంచ చిత్ర చరిత్ర 10: మూకీ నుంచి టాకీకి..

1920 లలో ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రక్రియ వూపందుకుంది. అయితే అంతకు ముందే సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ చాలా చోట్ల సినిమా నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. ప్రత్యేకించి యూరప్ దేశాలలో, ఆసియా ఖండంలో కూడా సినిమాలు ప్రపంచ యుద్ధం ప్రభావానికి లోనయ్యాయి. అయినప్పటికీ, 1930 నాటికి టాకీ చిత్ర నిర్మాణం ప్రారంభవమవడంతో మళ్ళీ సినిమా నిర్మాణం జోరందుకుంది. అక్కడి నుంచి మళ్ళీ రెండొవ ప్రపంచ యుద్ధం వచ్చేదాకా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయమని(…)

ప్రపంచ సినిమా చరిత్ర 11: సినిమాకి మేలు చేసిన ప్రపంచ యుద్ధం

ప్రపంచ సినిమా చరిత్ర 11: సినిమాకి మేలు చేసిన ప్రపంచ యుద్ధం

1930లలో టాకీ సినిమాలతో ఊపందుకున్న ప్రపంచ సినిమా పరిశ్రమలు శబ్దగ్రహణం, చాయాగ్రహణం, స్పెషల్ ఎఫెక్ట్ లలో అభివృద్ధి చెందుతూ క్రమ క్రమంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనటం ఆరంభమైంది. 1946వ సంవత్సరం అత్యధిక వీక్షకులకు అందుబాటులోకి వచ్చిన వినోదసాథనంగా సినిమాని గుర్తించింది హాలీవుడ్. అయితే దాదాపు ఇదే ప్రాంతంలో నడిచిన రెండొవ ప్రపంచ యుద్ధం, సినిమా గతిని ప్రగతిని చాలా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఈ సమయంలోనే సినిమా కథలలో యుద్ధ నేపథ్యం, సైనికులు ప్రథాన పాత్రలుగా రూపొందించబడిన(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 12: సినీచరిత్రలో “నవతరంగం”

ప్రపంచ చిత్ర చరిత్ర 12: సినీచరిత్రలో “నవతరంగం”

అన్నీ అమర్చినట్లు అందుబాటులో వుంటే అద్భుతాలు జరగవు. ప్రతిబంధకాలు ఎదురైనప్పుడే సృజనాత్మకత పెరిగి కొత్తకొత్త ఆవిష్కారాలు జరుగుతాయి. ఈ విషయం రెండో ప్రపంచయుద్ధం తరువాత వచ్చిన సినిమాలని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రపంచయుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వత్తిడుల నేపధ్యంలో తయారైన ఎన్నో సినిమాలు ప్రపంచ చలనచిత్ర గతినే మార్చేశాయి. ఇలాంటి సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఇటలీ నవ్యవాస్తవిక చిత్రాలు (Italian Neo-realism), ఫ్రెంచ్ నవతరంగం చిత్రాలు (French new wave). ఈ ఇటాలియన్(…)

ప్రపంచ చిత్ర చరిత్ర 13: ప్రపంచ సినిమాపై ఆసియా బావుటా

ప్రపంచ చిత్ర చరిత్ర 13: ప్రపంచ సినిమాపై ఆసియా బావుటా

1960 ప్రాంతంలొ అమెరికాలో తయారవుతున్న హాలీవుడ్ సినిమాలు వాస్తవికతని వదిలిపెట్టి, కేవలం హీరో హీరోయిన్ల పేరు ప్రఖ్యాతులమీద, స్టార్‌డమ్ మీద ఆధారపడి తీయబడుతున్నాయని విమర్శలు మొదలయ్యాయి. ఇటలీలో నవ్యవాస్తవిక చిత్రాలు, ఫ్రెంచ్ నవతరంగం చిత్రాల రాకతో హాలీవుడ్ సినిమాలలో లోపాలు ప్రస్ఫుటమయ్యాయి. అయితే  ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న సినీ వుద్యమాలని గుర్తించడంలో హాలీవుడ్ సినిమా, హాలీవుడ్ ప్రభావంలో వున్న యూరోపియన్ సినిమా కూడా విఫలమయ్యాయి. ఇదే అవకాశంగా ఆసియాలో నిర్మాణమౌతున్న ఎన్నో చిత్ర పరిశ్రమలు ఈ కొత్త(…)