తెలుగు సినిమా బాగుపడదా! – 1
తెలుగు సినిమా గురించి వచ్చే చాలా వరకు విమర్శలలో (నవతరంగం తో సహా) అనేక చోట్ల మనకి తరచుగా వినిపించేవి వ్యంగ్య వ్యాఖ్యలు, సెటైర్లు కొండకచో తెలుగు సినిమా బాగుపడదు అనే నిరాశావాద నిస్పృహలు, నిట్టూర్పులు. సినిమా పరిశ్రమలో వున్న వారి సంగతి చూస్తే కూడా ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ కనపడదు. ఇక అన్నింటికన్నా ముఖ్యులైన ప్రేక్షకుల విషయానికి వస్తే గత మూడు సంవత్సరాలలో పట్టుమని పది హిట్టులు కూడా లేని తెలుగు సినిమా(…)


