మా సినిమాలు:బాపు-మొదటి భాగం
ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు 23వ తేది రాత్రి చెన్నైలో పరమపదించారు. కొన్ని దశాబ్దాలుగా బాపురమణ అంటే ఒకటే పేరుగా చెలామణి అయిన ఈ జంట ఇక జంట కాదు. సీగానపెసూనాంబ లేని బుడుగులా, సీత జాడ తెలియని రాముడిలా, రెండుజళ్ళసీత లేని గోపాలంలా బాపు ఇప్పుడు ఒంటరివాడు. ఒక మంచి కవి, తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోదగిన రచయిత, నిర్మాత ఇక లేకపోవటం దురదృష్టం. 75 సంవత్సరాల తెలుగు చిత్ర యజ్ఞంలో(…)







